సుచేతా కృపలానీ

ఉత్తర్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి
(సుచేతా కృపాలానీ నుండి దారిమార్పు చెందింది)

సుచేతా మజుందార్ గా జన్మించిన సుచేతా కృపాలినీ (ఆంగ్లం: Sucheta Kriplani; Bengali: সুচেতা কৃপলানী, హిందీ: सुचेता कृपलानी) (25 June 1908[1] – 1 December 1974[2][3]) స్వాతంత్ర్య సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఈమె జె.బి.కృపాలినీ భార్య.

సుచేతా కృపలానీ
Sucheta Kriplani
సుచేతా కృపలానీ

సుచేతా కృపలానీ


పదవీ కాలం
2 అక్టోబర్ 1963 – 13 మార్చి 1967
తరువాత చంద్రభాను గుప్త

వ్యక్తిగత వివరాలు

జననం 25 జూన్ 1908
అంబాలా, పంజాబ్, British India
మరణం 1 డిసెంబరు 1974
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఆచార్య కృపలానీ

తొలిరోజులు

మార్చు

ఈమె హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో నివసించే ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఎస్.ఎన్.మజుందార్ ప్రభుత్వ వైద్యునిగా పనిచేసారు. ఈమె ఇంద్రప్రస్థ కళాశాల మరియ్ సెయింట్ స్టీఫెన్ కళాశాలల్లో విద్యనభ్యసించి, తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చరిత్రలో ప్రొఫెసర్ గా పనిచేశారు.[4] In ఈమె 1936 సంవత్సరంలో ఆచార్య కృపలానీని వివాహం చేసుకొని భారత జాతీయ కాంగ్రెసు కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు.

స్వాతంత్ర్య పోరాటం

మార్చు

ఈమె సమాకాలీన నేతలైన అరుణా అసఫ్ అలీ, ఉషా మెహతా, లతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పిదప మహాత్మా గాంధీకి సన్నిహితంగా పనిచేశారు. భారత రాజ్యాంగం నిర్మించే Constituent Assembly కి ఎన్నుకోబడిన కొద్దిమంది మహిళల్లో ఈమె ఒకరు. 1947 ఆగస్టు 15 తేదీన వందేమాతరం గీతాన్ని Constituent Assemblyలో గానం చేశారు.[5]

స్వాతంత్ర్యం తర్వాత

మార్చు

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పిదప ఈమె ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఈమె 1952, 1957 లో ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.[6] కాంగ్రెసు ప్రభుత్వంలో లఘుపరిశ్రమల మంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించారు. 1962 లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు కాన్పూర్ నుండి ఎన్నికయ్యారు. తర్వాత 1963 లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవినలంకరించి; భారతదేశంలోని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళగా రికార్డు స్థాపించారు. ఆ కాలంలో 62 రోజులు కొనసాగిన రాష్ట్ర ఉద్యోగుల సమ్మెను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. తర్వాత 1967 లో ఆమె తిరిగి 4వ లోక్‌సభకు ఉత్తర ప్రదేశ్ లోని గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడింది.[7] 1971 లో రాజకీయాలనుండి తొలగి 1974 వరకు ఒంటరి జీవితం గడిపారు.

మూలాలు

మార్చు
  1. S K Sharma (2004), Eminent Indian Freedom Fighters, Anmol Publications PVT. LTD., p. 560, ISBN 978-81-261-1890-8[permanent dead link]
  2. http://www.sandesh.org/Story_detail.asp?pageID=1&id=48
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-02. Retrieved 2014-03-07.
  4. "Kripalani, Shrimati Sucheta". Lok Sabha. Archived from the original on 2012-06-10. Retrieved 2012-06-06.
  5. 10TV (14 August 2020). "భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు" (in telugu). Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. http://164.100.47.132/LssNew/members/allmember1to12.aspx[permanent dead link]
  7. "4th Lok Sabha Members Bioprofile". Archived from the original on 2013-06-24. Retrieved 2014-03-07.
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
చంద్ర భాను గుప్త
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
2 అక్టోబర్ 1963 – 13 మార్చి 1967
తరువాత వారు
చంద్ర భాను గుప్త