సున్నం రాజయ్య (ఆగస్టు 8, 1960 - ఆగస్టు 4, 2020) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)కు చెందిన రాజకీయ నాయకుడు. 1999, 2004, 2014లలో భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.[1][2]

సున్నం రాజయ్య
సున్నం రాజయ్య

గిరిజన నాయకులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్,మల్లు దొర, గంటం దొర ల విగ్రహాలను ఖమ్మం జిల్లా, చింతూరు లో ఆవిష్కరిస్తున్న సున్నం రాజయ్య


నియోజకవర్గం భద్రాచలం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-08-08)1960 ఆగస్టు 8
సున్నంవారిగూడెం,
వరరామచంద్రపురం మండలం
తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
మరణం 2020 ఆగస్టు 4(2020-08-04) (వయసు 59)
సున్నంవారిగూడెం
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
నివాసం సున్నంవారిగూడెం
మతం హిందూ

జీవిత విషయాలు మార్చు

రాజయ్య, తూర్పు గోదావరి జిల్లా, వరరామచంద్రపురం మండలం, సున్నంవారిగూడెం గ్రామంలో 1960, ఆగస్టు 8నజన్మించాడు.

రాజకీయ జీవితం మార్చు

రాజయ్య భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఎం తరఫున 1999, 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించాడు.[3] 2009లో సి.పి.ఎం పార్టీ తరపున భద్రాచలం స్థానం నుండి పార్లమెంటుకు పోటీచేసి కుంజా సత్యవతి చేతిలో 6956 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రాష్ట్ర విభజన తర్వాత పాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో రాజయ్య సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు.[4]

వార్తలలో రాజయ్య మార్చు

శాసనసభకు వస్తున్న రాజయ్యను గుర్తు పట్టని పోలీసులు మార్చు

ఇతడు చాలా నిరాండబరుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవాడు. ఇందుకు నిదర్శనం 2015 ఏప్రిల్ 9 గురువారం జరిగిన సంఘటన. ఆర్భాట రాజకీయాలు ఇంకా వంటబట్టని గిరిజన నాయకుడిగా, సీపీఎం శాసనసభా పక్ష నేతగా సుపరిచితుడైన ఖమ్మం జిల్లా భద్రాచలం శాసన సభ్యులు సున్నం రాజయ్యను సచివాలయం ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. ఆయన సామాన్యులు ప్రయాణించే ఆటోలో వెళ్ళడమే! గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు.. ఆటోలో వచ్చావ్.. నువ్వు శాసన సభ్యులువంటే మేము నమ్మం అనడంతో తన గుర్తింపు కార్డు తీసి పోలీసులకు చూపారు రాజయ్య. కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట గానీ శాసన సభ్యులు రాజయ్యను పోలీసుల లోనికి అనుమతించలేదు. భాగ్యనగర వీధుల్లో అన్న క్యాంటీన్ల వద్ద భోజనం చేసి కడుపు నింపుకునేవాడు.[5]

మరణం మార్చు

రాజయ్య కరోనా వ్యాధితో 2020, ఆగస్టు 4న మరణించాడు.[6][7]

ఇవికూడా చూడండి మార్చు

మూలాల జాబితా మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-16. Retrieved 2010-06-29.
  2. సాక్షి, తాజావార్తలు (4 August 2020). "కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి". Sakshi. Archived from the original on 4 August 2020. Retrieved 4 August 2020.
  3. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  4. వి6 వెలుగు, తెలంగాణ (4 August 2020). "కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి". Archived from the original on 4 August 2020. Retrieved 6 August 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. సాక్షి, ప్రధాన వార్తలు (9 April 2015). "ఆటోలో వచ్చావు.. ఎమ్మెల్యేవి కావు!". Sakshi. Archived from the original on 6 August 2020. Retrieved 6 August 2020.
  6. ఆంధ్రజోతి, ఆంధ్రప్రదేశ్ (4 August 2020). "భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి". www.andhrajyothy.com. Archived from the original on 4 August 2020. Retrieved 4 August 2020.
  7. ఈనాడు, తాజావార్తలు (4 August 2020). "కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి". www.eenadu.net. Archived from the original on 4 August 2020. Retrieved 4 August 2020.

బయటి లింకులు మార్చు