సురంగ లక్మల్

శ్రీలంక మాజీ క్రికెటర్

రణసింహ అరాచ్చిగే సురంగ లక్మల్ (జననం: 1987, మార్చి 10) శ్రీలంక మాజీ క్రికెటర్. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు. మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్. కుడిచేతి ఫాస్ట్ బౌలర్, కుడిచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. తిస్సమహారమాలోని దేబరవేవా నేషనల్ స్కూల్‌లో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. మొదటిసారిగా 2008-2009[1] లో పాకిస్తాన్ పర్యటన కోసం జాతీయ జట్టులో చేర్చబడ్డాడు. శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడినట్లు సమాచారం.[2][3]

సురంగ లక్మల్
2017లో లక్మల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రణసింహ అరాచ్చిగే సురంగ లక్మల్
పుట్టిన తేదీ (1987-03-10) 1987 మార్చి 10 (వయసు 37)
తిస్సమహారమా, శ్రీలంక
ఎత్తు1.94 m (6 ft 4 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 114)2010 నవంబరు 23 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2022 మార్చి 12 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 140)2009 డిసెంబరు 18 - ఇండియా తో
చివరి వన్‌డే2021 మార్చి 14 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 37)2011 జూన్ 25 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2018 మార్చి 24 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–presentTamil Union
2020–presentJaffna Kings
2022–presentడెర్బీషైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 70 86 135 170
చేసిన పరుగులు 934 244 1,522 436
బ్యాటింగు సగటు 11.11 9.38 11.19 9.27
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 42 26 58* 38*
వేసిన బంతులు 12,443 3,881 21,466 7,609
వికెట్లు 171 109 362 235
బౌలింగు సగటు 36.44 32.42 32.32 28.56
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 10 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/47 4/13 6/68 5/31
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 20/– 47/– 42/–
మూలం: ESPNcricinfo, 28 July 2022

ఇతను ప్రస్తుతం తమిళ్ యూనియన్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్ తరపున ఆడుతున్నాడు.[1][4] 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 విజేత జట్టులో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు.[5] 2022 ఫిబ్రవరి 2న భారత పర్యటన తర్వాత అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.[6]

దేశీయ క్రికెట్ మార్చు

2007లో తమిళ యూనియన్‌లో చేరినప్పటి నుండి దేశవాళీ క్రికెట్‌లో తన ఉనికిని చాటుకున్నాడు. 2007, నవంబరు 17న కోల్ట్స్ క్రికెట్ క్లబ్‌కు వ్యతిరేకంగా తమిళ్ యూనియన్ కోసం తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[7]

2008 జనవరి 17 న నాన్‌డిస్క్రిప్ట్ క్రికెట్ క్లబ్‌పై తమిళ యూనియన్‌కు ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[8]

2008 ఏప్రిల్ 23న వాయంబాపై బస్నాహిర సౌత్ తరపున తన టీ20 అరంగేట్రం చేసాడు.[9]

అంతర్జాతీయ క్రికెట్ మార్చు

2009 డిసెంబరులో భారతదేశంలో దిల్హారా ఫెర్నాండో స్థానంలో లక్మల్‌ని వచ్చాడు. నాగ్‌పూర్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో తన వన్డేలో అరంగేట్రం చేసాడు. ఎనిమిది ఓవర్‌లు బౌలింగ్ చేసి 58 పరుగులు ఇచ్చాడు.[10][11] 2010 నవంబరు 23న వెస్టిండీస్‌తో ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆడిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో తన అరంగేట్రం చేసాడు, 114వ శ్రీలంక టెస్ట్ ప్లేయర్ అయ్యాడు.[12][13]

2011 జూన్ 25న ఇంగ్లిండ్‌పై తన టీ20 అరంగేట్రం చేసాడు. ఓపెనింగ్ ఓవర్‌లో మైఖేల్ లంబ్‌ని అవుట్ చేసి మొదటి టీ20 వికెట్‌ను సాధించాడు.[14]

కెప్టెన్సీ మార్చు

202018 మేలో 18–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో ఇతను ఒకడు.[15][16]

తర్వాత నెలలో, బాల్ టాంపరింగ్ కారణంగా దినేష్ చండీమల్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించబడిన తర్వాత, వెస్టిండీస్‌తో జరిగే మూడవ (చివరి) మ్యాచ్‌కి ఇతను శ్రీలంక టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[17][18]

టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన 16వ ఆటగాడిగా నిలిచాడు.[19] ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచి కెన్సింగ్టన్ ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Sri Lanka name two newcomers for Pakistan Tests". Cricinfo. 2009-02-03. Retrieved 2023-08-27.
  2. "Full coverage of the Lahore attack". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  3. "Suranga Lakmal still carries splinter from bullet wound sustained in 2009 Lahore attack". Zee News (in ఇంగ్లీష్). 2017-10-05. Retrieved 2023-08-27.
  4. "Suranga Lakmal". Cricinfo. 2009-02-03. Retrieved 2023-08-27.
  5. "Suranga Lakmal". Sportskeeda. Retrieved 2023-08-27.
  6. "Suranga Lakmal to retire from all forms of international cricket". ESPN Cricinfo. Retrieved 2023-08-27.
  7. "Full Scorecard of Col CC vs Tamil Union Tier A 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  8. "Full Scorecard of Nondescripts vs Tamil Union Tier A 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  9. "Full Scorecard of Basnahira S vs Wayamba 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  10. "Full Scorecard of India vs Sri Lanka 2nd ODI 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  11. "India v Sri Lanka in 2009/10". CricketArchive. Retrieved 2023-08-27.
  12. "Suranga Lakmal makes his Test debut". Island Cricket. Archived from the original on 2011-07-22. Retrieved 2023-08-27.
  13. "Full Scorecard of Sri Lanka vs West Indies 2nd Test 2010/11 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  14. "Full Scorecard of England vs Sri Lanka Only T20I 2011 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  15. "Sri Lanka assign 33 జాతీయ contracts with pay hike". International Cricket Council. Retrieved 2023-08-27.
  16. "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-27.
  17. "Suranga Lakmal to Captain Sri Lanka in the 3rd test match". Sri Lanka Cricket. Retrieved 2023-08-27.
  18. "Lakmal replaces Chandimal as captain". Sunday Observer (in ఇంగ్లీష్). 2018-06-23. Retrieved 2023-08-27.
  19. "Sri Lanka appoint Lakmal as Test captain". Cricket Australia. Retrieved 2023-08-27.

బాహ్య లింకులు మార్చు