సురీందర్ అమర్‌నాథ్

1948, డిసెంబర్ 30న ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన ఇతడు భారత్ తరఫున 10 టెస్టులు, 3 వన్డేలలోజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1976 జనవరిలో తన తొలి టెస్టులోనే న్యూజీలాండ్ పై శతకం సాధించాడు.

సురీందర్ అమర్‌నాథ్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 10 3
చేసిన పరుగులు 550 100
బ్యాటింగు సగటు 30.55 33.33
100లు/50లు 1/3 -/1
అత్యధిక స్కోరు 124 62
వేసిన బంతులు 11 -
వికెట్లు 1 -
బౌలింగు సగటు 5.00 -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు 1/5 -
క్యాచ్‌లు/స్టంపింగులు 4/- 1/-
మూలం: [1], 2006 ఫిబ్రవరి 4

టెస్ట్ క్రికెట్ గణాంకాలు మార్చు

సురీందర్ అమర్‌నాథ్ 10 టెస్టులలో 30.55 సగటుతో 550 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 3 అర్థసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 124 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు మార్చు

సురీందర్ 3 వన్డేలు ఆడి 33.33 సగటుతో 100 పరుగులు చేశాడు. వన్డేలో అతడి అత్యధిక స్కోరు 62 పరుగులు.

కుటుంబం మార్చు

సురీందర్ తండ్రి లాలా అమర్‌నాథ్, సోదరుడు మోహిందర్ అమర్‌నాథ్లు కూడా భారత్ తరఫున క్రికెట్ ఆడినారు.