సురేష్ ఒబెరాయ్ (జననం 17 డిసెంబరు 1946)[1] ప్రముఖ బాలీవుడ్ సహాయ నటుడు. ఆయన అసలు పేరు విశాల్ కుమార్ ఒబెరాయ్. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు తండ్రి. పాకిస్థాన్ లోని  కెట్టా ప్రాంతంలో జన్మించారు సురేష్. కెరీర్ మొదట్లో రేడియోలో పనిచేసేవారు సురేష్. ఆ తరువాత మోడలింగ్ కూడా చేశారు. 1980, 90వ దశకాల్లో సురేష్ బాలీవుడ్ లో ప్రముఖ సహాయ నటునిగా కొనసాగారు.

సురేష్ ఒబెరాయ్

వ్యక్తిగత జీవితం మార్చు

పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ లో కెట్టా అనే ప్రాంతంలో 17 డిసెంబరు 1946న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు  సురేష్. ఆయన తండ్రి ఆనంద్ సారూప్ ఒబెరాయ్ పంజాబీ వ్యాపారవేత్త, తల్లి కర్టర్ దేవి గృహిణి. భారత విభజన తరువాత వీరి కుటుంబం పాకిస్థాన్ నుంచి హైదరబాద్ కు మారారు. హైదరాబాద్ లో సురేష్ తండ్రి మెడికల్ స్టోర్ చైన్ ను మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదువుకున్నారు. చదువుకునేటప్పుడు టెన్నిస్,  స్విమ్మింగ్ వంటి క్రీడల్లో బాగా రాణించేవారు. బాయ్ స్కాట్ లో ప్రెసిడెంట్ అవార్డు పొందారు ఆయన. సురేష్ హైస్కూల్ చదువుతుండగా తండ్రి చనిపోయారు. దాంతో ఆయన అన్నదమ్ముళ్ళతో కలసి వారి కుటుంబ వ్యాపారం మెడికల్ స్టోర్స్ చూసుకునేవారు.[2]  సురేష్ హిందీ, ఉర్దు,  ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు.

కెరీర్ మార్చు

1970ల్లో రేడియో షోలలోనూ, నాటకాలతోనూ కెరీర్ మొదలు పెట్టారు సురేష్. పూణె లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  లో నటన నేర్చుకున్నారు ఆయన. ఆ సమయంలోనే తమిళనాడుకు చెందిన యశోధరను కలుసుకున్నారు ఆయన. 1974లో వారు  వివాహం చేసుకున్నారు. 1976లో వారికి ఒక కుమారుడు పుట్టారు.  ఆయనే ప్రస్తుతం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఆ తరువాత వారి కుటుంబం ముంబైకు మారింది.[2]

మోడలింగ్, రేడియో షోలు మార్చు

ముంబైకు వచ్చిన మొదట్లో ఆయన చేసిన రేడియో షోల వల్ల చాలా ప్రసిద్ధి పొందారు. ఆ తరువాత చార్మినార్ సిగరెట్లు, లైఫ్ బాయ్ సబ్బుకూ మోడల్ గా పనిచేశారు. 1970వ దశకం చివర్లో ఆయన ప్రసిద్ధ మోడల్ గా కొనసాగారు.

సినిమాలు మార్చు

1978లో ఏక్ బార్ ఫిర్ సినిమాతో తెరంగేట్రం చేశారు సురేష్. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. 1980లో లావరిస్ సినిమాలో నటించారాయాన. 2000 దశకం తొలినాళ్ళ వరకు సంవత్సరానికి 4 నుంచి 5 సినిమాల్లో నటించారు సురేష్. దాదాపు 135 సినిమాల్లో చేశారు సురేష్. యాదోం కా మౌసమ్ (1990)లో ఒక పాటలో కొన్ని లైన్లు పాడారు ఆయన.[3]

టీవీ మార్చు

ధడ్కన్ కాశ్మీర్ వంటి టెలివిజన్ షోలలో కూడా కనిపించారాయన.[4]  జీనా ఐసీ కా నామ్ హై షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.

కుటుంబం మార్చు

1970లలో సురేష్ హైదరాబాద్ లో యశోధరను కలిశారు. 1974లో మద్రాసులో ఆమెను వివాహం చేసుకున్నారు. వీరి మొదటి కుమారుడు వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ నటుడు. ఆయన భార్య యశోధర తమిళ్ నాడులోని కొయంబత్తూర్ ప్రాంతంలో పలయక్కోటి పట్టకరర్ కుటుంబానికి చెందినవారు.[2]

నటనే కాక, సురేష్ పాటలు కూడా బాగా పాడతారు. ఆయన గాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. జీ టివిలో వచ్చే జీనా ఐసీ కా నామ్ హై షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు ఆయన. ఇవే కాక, ఆయన రొమాంటిక్, ఫిలాసఫికల్ కవిత్వం కూడా రాస్తుంటారు.[5]

 
బ్యాంకాక్ లో బ్రహ్మకుమారీల కార్యక్రమంలో పాల్గొన్న సురేష్
 
రాజేష్ ఖన్నా ప్రేయర్ మీట్ 08లో పాల్గొన్న యశోధర, సురేష్, వివేక్ ఒబెరాయ్

సినిమాలు మార్చు

సంవత్సరం చిత్రం పాత్ర నోట్స్
2013 అట్టహాస రాజ్ కుమార్ కన్నడ చిత్రం
2009 వరల్డ్ కప్ 2011 కోచ్
2009 కర్మా ఔర్ హోళీ శేఖర్
2005 సోచా నా థా నిర్మల్ ఒబెరాయ్
2003 యే దిల్
2003 తలాష్ బాబు
2002 రాత్ కే సౌదాగర్
2002 దేవాంగే మిస్టర్.భుల్లర్
2002 23ర్డ్ మార్చి 1931:షాహీద్ గోవలర్ చడ్డా
2001 శిరిడి సాయిబాబా
2001 ప్యార్ తూనే క్యా కియా మిస్టర్.జైస్వాల్
2001 మోక్ష:సల్వషన్ మిస్టర్.సెహగల్
2001 లజ్జ రఘువీర్ తండ్రి
2001 కాలా మందిర్
2001 హమ్ హో గయే ఆప్కే మిస్టర్.ఒబెరాయ్
2001 గదర్: ఏక్ ప్రేమ్ కథ తయ
2001 దాల్:ది గ్యాంగ్ భక్తవర్ సింగ్
2001 అశోక వ్యాఖ్యాత
2000 ఖౌఫ్ మిస్టర్.సింఘానియా
1999 సౌతెలా
1999 సఫారీ మిస్టర్.అజిత్ అగర్వాల్
1998 సర్వైవింగ్ సబు సద్రు షార్ట్ ఫిలిమ్
1998 సోల్జర్ ప్రతాప్ సింగ్
1998 పురైడో:ఉన్మై నొ తోకి జస్టిస్, డాక్టర్. రథబినోద్ పాల్ హిందీ/ఇంగ్లీష్/జపనీస్ భాషల్లో తీశారు ఈ సినిమా
1998 ఖొటే సిక్కీ పుఖ్ రాజ్ మహాదేవన్
1998 ఆక్రోశ్:సైక్లోన్ ఆఫ్ ఏంగర్ మహేంద్ర ప్రతాప్ గుజ్రాల్
1998 2001: దో హజార్ ఏక్ మిస్టర్.అమిర్ చంద్
1997 సూరజ్
1997 పృధ్వీ
1997 కౌన్ సచ్చా కౌన్ ఝూటా ఐజి సూర్యకాంత్ వర్మ
1997 లాహు కే దో రంగ్ ధర్మ షికారీ
1996 రాజా హిందుస్థానీ మిస్టర్. సెహగల్
1996 మౌసమ్ విక్రమ్ సింగ్
1996 జాన్ విశంభర్
1996 హిమ్మత్
1996 అజయ్ రాజా బ్రిజ్ రాజ్ సింగ్
1995 సురక్ష
1995 రఘువీర్ రవి వర్మ, కమాండో
1995 మేరీ మొహొబ్బత్ మేరా నసీబా
1995 కిస్మత్ ఎసిపి ఆనంద్
1995 జై విక్రంతా రాజా
1995 దియా ఔర్ తూఫాన్ డాక్టర్.విజయ్ మెహ్రా
1995 దిల్ బర్ డిసిపి శ్రీధర్ అత్మారామ్ వర్మ
1995 అనోఖీ చాల్
1994 విజయ్ పథ్ ఇన్ స్పెక్టర్ రాజేష్ సక్సేనా
1994 సుహాగ్ రాయ్ బహద్దూర్
1994 క్రాంత్రి క్షేత్రా
1994 గోపి కిషన్ రాజేశ్వర్ చౌదరి
1993 సంతాన్ జడ్జ్ సాహబ్
1993 ప్రతిమూర్తి
1993 పరదేశీ
1993 ఖూన్ కా సిందూర్
1993 గర్దిష్ ఇన్ స్పెక్టర్ సైని
1993 గేమ్ ఇన్ స్పెక్టర్ పవార్
1993 ధర్తిపుత్ర
1993 భూకంప్
1993 అనారీ
1993 ఆన్సూ బనే అంగారే
1992 జిందగీ ఏక్ జువా సిబిఐ అధికారి సురేష్ చంద్ర భట్నాగర్
1992 తిరంగా రుద్రప్రతాప్ చౌహాన్
1992 కిస్ మే కిత్నా హై దమ్
1992 ఇందిరా
1992 దిల్ కా క్యా కసూర్ రాజేశ్ సక్సేనా
1992 అపరాధీ సత్యప్రకాశ్ వి.నాథ్
1992 అభి అభి
1991 సాధు సంత్
1991 పుక్కా బద్మాష్
1991 ప్యార్ కా దేవతా ఇన్ స్పెక్టర్ అరుణ్
1991 నుంబ్రీ ఆద్మీ ఎసిపి విజయ్ ప్రతాప్
1991 కసమ్ కాలీ కా
1991 జీనేకీ సజా డాక్టర్.సంతోష్
1991 జాన్ కీ కసమ్ కుమార్
1991 ఇరాదా
1991 ఇన్స్పెక్టర్ ధనుష్ కాం.అవినాష్ కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ తో కలసి నటించారు ఈ సినిమాలో
1991 ఫతే మేజర్ ఆనంద్
1991 దేశ్ వాసీ ప్రతాప్ సింగ్
1991 దస్తూర్
1990 సైలాబ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ రంజిత్ కపూర్
1990 పంచవటి
1990 కాళీ గంగ
1990 హలాత్
1990 సి.ఐ.డి మేజర్ బ్రిజ్ మోహన్ వర్మ
1990 ఆజ్ కా అర్జున్ మోహన్
1989 తుఝే నహీ చోడూంగా
1989 రఖ్ వాలా రంజిత్
1989 పరిందా అబ్దుల్ ఖాన్
1989 ముజ్రిమ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గోఖలే
1989 మణికా, ఉనే వియే ప్లస్ టర్డ్ రజిత్ శర్మ ఫ్రెంచ్ సినిమా
1989 కసమ్ సుహాగ్ కి ఇన్ స్పెక్టర్ దిల్దార్ దావూద్
1989 దో కైదీ ఇన్ స్పెక్టర్ అమర్ సిన్హా సురేష్ ఒబెరాయ్
1989 దాత రంజాన్ ఖాన్
1989 అప్నా దేశ్ పరాయే లోగ్
1989 అంధేర్ గర్డీ
1989 ఆఖరీ ముకాబ్లా బజ్రంజ్
1988 తెజాబ్ ఇన్ స్పెక్టర్ గగన్ సింగ్
1988 షూర్వీర్ డాక్టర్.ఎస్.మల్హోత్రా
1988 ముల్జిమ్ రంజిత్ కుమార్
1988 మొహొబ్బత్ కే దుష్మన్ అబు భాయ్, అతిథి పాత్ర
1988 మరణ మృదంగం వసంత్ దాదా తెలుగు సినిమా
1988 ఖూన్ బాహా గంగా మే
1988 కాల్ చక్ర
1988 ధరమ్ యుద్ధ్ కుందన్
1988 భాయ్ కా దుష్మన్ భాయ్
1987 వహీమ్
1987 థికానా పోలీస్ ఇన్ స్పెక్టర్ రణబీర్ సింగ్
1987 తేరా కరమ్ మేరా ధరమ్
1987 సాత్ సాల్ బాద్ దీపక్ ఖన్నా
1987 నామ్ ఓ నిషాన్ జొరావర్ జవర్
1987 ఇతిహాస్ కాళీచరన్
1987 ఇన్సాఫ్ మిస్టర్.అగ్నిహోత్రి
1987 దిల్ తుఝ్ కో దియా అశోక్ ఎ.సహ్నీ
1987 డకైట్ అమ్రిత్ లాల్ యాదవ్
1986 జిందగానీ సుదర్శన్ అతిధి పాత్ర
1986 త్రివేణి
1986 స్వార్ధీ
1986 పంచవటీ
1986 పాలే ఖాన్ డాక్టర్. రామకృష్ణ సిన్హా
1986 మజ్లూమ్ విజయ్ సింగ్
1986 మై బల్వాన్ అనిల్
1986 జ్వాలా డాక్టర్.దేవ్ దత్
1986 దిల్ వాలా మదన్ లాల్ శర్మ
1986 భాయ్ కా దుష్మన్ భాయ్
1986 అమ్మ
1986 ఆగ్ ఔర్ షోలా ఆరతి మావయ్య
1985 సుర్ఖియాన్ షేరా
1985 రామ్ కలీ ఇన్ స్పెక్టర్ దిలీప్ సింగ్
1985 రాహీ బాదల్ గయే డాక్టర్.మెహ్రా
1985 ఫులాన్ దేబీ
1985 మిర్చ్ మసాలా ముఖి భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటుడు,

1988 బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్- ఉత్తమ సహాయ నటుడు అవార్డు

1985 కహానీ ఫూల్వతి కీ
1985 జవాబ్ ఇన్ స్పెక్టర్ జె.ఎస్.శర్మ
1985 గ్రహస్థి
1985 ఏక్ డాకూ షహెర్ మే రాకేష్ ప్రతాప్ సింగ్
1985 దేఖా ప్యార్ తుమ్హారా ఇన్ స్పెక్టర్ రంజిత్ ముల్లిక్
1985 బెపనాహ్ ట్రక్ డ్రైవర్
1985 ఐత్ బార్ సాగర్
1984 జిందగీ జీనే కే లియే
1984 షరాబీ అబ్దుల్
1984 ముఝే శక్తి దో
1984 కానూన్ క్యా కరేగా గౌతం మెహ్రా
1984 గృహస్థి కెప్టెన్ దీపక్ వర్మ
1984 ఘర్ ఏక్ మందిర్
1984 గంగ్వా ఇన్ స్పెక్టర్
1984 ఏక్ నాయీ పెహలీ అవినాష్
1984 ఏక్ దిన్ బహూ కా
1984 అవాజ్ ఇన్ స్పెక్టర్ అమిత్ గుప్త
1984 ఆగమన్
1983 రిష్తా కాగజ్ కా డాక్టర్.రవి కౌల్
1983 మజ్దూర్ హిరాలాల్ సిన్హా
1983 జీనా హై ప్యార్ మే
1983 హీరో
1983 ఘుంగ్రూ సూరజ్
1983 కూలీ విక్కీ పూరి
1982 విధాత ఇన్ స్పెక్టర్ ప్రతాప్ సింగ్ అతిధి పాత్ర
1982 తుమ్హారా బినా రాబిన్ దత్
1982 తేరీ మేరీ కహానీ అజయ్ వర్మ టివి ఫిలిం
1982 తక్దీర్ కా బాద్షా
1982 పత్తర్ కీ లకీర్
1982 నమక్ హలాల్ భీమ్ సింగ్
1982 కామ్ చోర్ సురేష్
1982 జానీ ఐ లవ్ యూ సూరజ్ సింగ్
1982 ఆగ్ మన్
1981 శ్రద్ధాంజలి లక్ష్మీ నారాయణ్
1981 సాజన్ కీ సహేలీ సురేష్ ఒబెరాయ్
1981 రక్ష డాక్టర్. సిన్హా
1981 నారీ
1981 మై ఔర్ మేరా హాతీ తేజ
1981 లవారిస్ రాం సింగ్
1981 హక్దార్
1980 ప్యారా దుష్మన్
1980 ఫిర్ వోహీ రాత్ ఇన్ స్పెక్టర్
1980 మోర్చా
1980 ఖంజార్ క్యాప్టన్ ఉస్మాన్
1980 ఏక్ బార్ ఫిర్ మహెందర్ కుమార్
1980 ఏక్ బార్ కహో
1979 సురక్ష క్యాప్టన్ కపూర్
1979 కర్తవ్య అటవీశాఖా అధికారి
1979 కాలా పత్తర్ నావికా దళ అధికారి
1977 జీవన్ ముక్త్ మొదటి సినిమా

డబ్బింగ్ పాత్రలు మార్చు

యానిమేటెడ్ చిత్రాలు మార్చు

టైటిల్ పాత్ర అసలు గాత్రం డబ్బింగ్ భాష అసలు భాష ఒరిజినల్ సినిమా విడుదలైన సంవత్సరం డబ్బింగ్ సినిమా విడుదలైన సంవత్సరం నోట్స్
ది లయన్ కింగ్ ముఫాసా జేమ్స్ ఏర్ల్ జోన్స్ హిందీ ఇంగ్లీష్ 1994 1995 [6]

అవార్డులు, నామినేషన్లు మార్చు

పురస్కారం చిత్రం పాత్ర సంవత్సరం స్టాటస్
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటుడు మిర్చ్ మసాలా ముఖీ 1987
ఉత్తమ సహాయ నటుడు ఘర్ ఏక్ మందిర్ రహీమ్ 1985
లారిస్ రామ్ సింగ్ 1982
ఉత్తమ సహాయ నటుడు మిర్చ్ మసాలా ముఖి[7] 1988

మూలాలు మార్చు

  1. "Vivek Oberoi makes his dad's birthday special". Oneindia Entertainment. Mid-Day. Archived from the original on 2012-10-22. Retrieved 2016-07-28.
  2. 2.0 2.1 2.2 "Suresh Oberoi, ek baar phir..." TOI. Times of India.
  3. "Songs of Suresh Oberoi". Gomolo. Archived from the original on 2012-08-04. Retrieved 2016-07-28.
  4. "Looking for fresh pastures". The Hindu. Retrieved 7 July 2016.
  5. "Biography of Suresh Oberoi". Archived from the original on 2012-08-01. Retrieved 2016-07-28.
  6. "Story of Simba – The Hindu". thehindu.com. Retrieved 21 August 2014.
  7. 1988 BFJA Awards[permanent dead link]