సులోచన లట్కర్

కర్ణాటకకు చెందిన సినిమా నటి.

సులోచన లట్కర్ (1928 జూలై 30 - 2023 జూన్ 4), కర్ణాటకకు చెందిన సినిమా నటి. మరాఠీలో 50 సినిమాలలో, హిందీలో దాదాపు 250 సినిమాలలో నటించింది. ససుర్వాస్ (1946), వాహినిచ్యా బంగ్ద్య (1953), మీత్ భాకర్, సంగ్త్యే ఐకా (1959), ధక్తి జౌ వంటి మరాఠీ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి గుర్తింపు పొందింది.[1] అలాగే తల్లి పాత్రలలో నటించి బాగా పేరు సంపాదించింది.

సులోచన లట్కర్
సులోచన లట్కర్ (2011)
జననం
నాగబాయి

1928 జూలై 30
ఖడక్లత్ గ్రామం, బెల్గాం, కర్ణాటక
మరణం4 జూన్ 2023 ( 94 సంవత్సరాలు)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1946–1995
జీవిత భాగస్వామిఅబాసాహెబ్ చవాన్‌
పురస్కారాలుచిత్ర భూషణ్
మహారాష్ట్ర భూషణ్
పద్మశ్రీ

సులోచన 1928, జూలై 30న కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది.

కళారంగం

మార్చు

సులోచన లట్కర్ 1946లో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 1946 నుండి 1961 వరకు మరాఠీ సినిమాలో ప్రధానపాత్రలు పోషించింది. ఆ తరువాత తల్లి పాత్రలలో నటించింది. 2003లో ఆధునిక మరాఠీ సినిమా వ్యవస్థాపకులలో ఒకరైన బాబూరావు పెయింటర్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ మరాఠీ చిత్రపట్ మహామండల్ స్థాపించిన చిత్రభూషణ్ అవార్డు అందుకుంది.[2]

అవార్డులు

మార్చు
  • 1999: పద్మశ్రీ పురస్కారం[3]
  • 2004: ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • 2009: మహారాష్ట్ర ప్రభుత్వం నుండి మహారాష్ట్ర భూషణ్ అవార్డు[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

ప్రస్తుతం ముంబైలోని ప్రభాదేవిలో నివసిస్తోంది.[5] సులోచనకు 14 ఏళ్ళ వయసులో వివాహం జరిగింది. సులోచన కుమార్తె పేరు కంచన్ ఘనేకర్, మరాఠీ రంగస్థల సూపర్ స్టార్ డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ భార్య.[6]

కొన్ని సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష
1957 అబ్ దిల్లీ దుర్ నహిన్ బేలా హిందీ
1959 సంగ్తే ఐకా సఖారామ్ భార్య మరాఠీ
1959 దిల్ దేకే దేఖో జమున హిందీ
1961 సంపూర్ణ రామాయణ కైకేయి హిందీ
1963 మోల్కారిన్ గయాబాయి మరాఠీ
1963 బాందిని హిందీ
1964 మరాఠా టిటుకా మేల్వావా జీజాబాయి మరాఠీ
1965 సాధి మాన్సే మరాఠీ
1965 గోవాలో జోహార్-మెహమూద్ హిందీ
1966 దేవర్ శకుంతల ఎం. సింగ్ హిందీ
1967 నై రోష్ని ప్రకాష్ తల్లి హిందీ
1968 ఎకటీ మధు తల్లి మరాఠీ
1968 సంఘుర్ష్ శంకర్ భార్య హిందీ
1968 సరస్వతీచంద్ర కుముద్ తల్లి హిందీ
1968 ఆద్మీ శేఖర్ తల్లి హిందీ
1969 సంబంధ్ సుమతి హిందీ
1970 కటి పతంగ్ శ్రీమతి దీనానాథ్ హిందీ
1970 జానీ మేరా నామ్ సోహన్, మోహన్ తల్లి హిందీ
1970 మెయిన్ సుందర్ హూన్ సుందర్ తల్లి హిందీ
1972 దిల్ దౌలత్ దునియా అతిథి స్వరూపం హిందీ
1973 కహానీ కిస్మత్ కీ శ్రీమతి శర్మ హిందీ
1974 కోరా కాగజ్ సుకేష్ అత్త హిందీ
1974 మజ్బూర్ శ్రీమతి ఖన్నా హిందీ
1974 కసౌతి సప్నా తల్లి హిందీ
1978 ముకద్దర్ కా సికందర్ విశాల్ తల్లి హిందీ
1978 ఆజాద్ సరళ హిందీ
1980 ఆశా జీతేంద్ర తల్లి హిందీ
1982 ఏక్ దావ్ భూతాచా రాధా మావాషి మరాఠీ
1983 జరా సి జిందగీ రాకేష్ తల్లి హిందీ
1983 హిమ్మత్ వాలా దాడిమా హిందీ
1984 ఫుల్వారి రాజీవ్ తల్లి హిందీ
1984 అందర్ బాహర్ రవి తల్లి హిందీ
1984 సాసు వర్చాద్ జవై అశోక్ సరాఫ్ తల్లి మరాఠీ
1985 గులామి రంజిత్ చౌదరి తల్లి హిందీ
1986 కాలా దండ గోరే లాగ్ హిందీ
1988 ఖూన్ భారీ మాంగ్ జెడి తల్లి హిందీ

సులోచన లత్కర్ వయోవృద్ధ సమస్యలతో బాధపడుతూ దాదార్‌లోని శుశృత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 జూన్ 4న మరణించింది.[7][8]

మూలాలు

మార్చు
  1. "Sulochana wins top cine award". The Times of India. 4 June 2003. Archived from the original on 21 October 2012. Retrieved 2022-08-26.
  2. "Sulochana wins top cine award". The Times of India. 4 June 2003. Archived from the original on 21 October 2012. Retrieved 2022-08-26.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved 2022-08-26.
  4. Nitsure-Joshi, Manisha (30 November 2009). "हा तर माझ्या घरचा आहेर!". Maharashtra Times. Mumbai. Archived from the original on 2012-02-23. Retrieved 2022-08-26.
  5. "Actress Sulochana's 72nd birthday". 11 August 2000. Archived from the original on 24 మార్చి 2010. Retrieved 26 ఆగస్టు 2022.
  6. "Changing face of Bollywood screen mothers". Archived from the original on 2014-04-07. Retrieved 2022-08-26.
  7. News18 Telugu (4 June 2023). "ప్రముఖ నటి సులోచన లట్కర్ మృతి..సినీ ప్రముఖుల సంతాపం". Retrieved 4 June 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  8. Mana Telangana (4 June 2023). "నటి సులోచన కన్నుమూత". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.

బయటి లింకులు

మార్చు