సువెందు అధికారి
సువెందు అధికారి పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.[3]
సువెందు అధికారి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 10 మే 2021 | |||
డిప్యూటీ | మిహిర్ గోస్వామి | ||
---|---|---|---|
ముందు | అబ్దుల్ మన్నన్ | ||
నియోజకవర్గం | నందిగ్రామ్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2016 | |||
ముందు | ఫిరోజ్ బిబి | ||
నియోజకవర్గం | నందిగ్రామ్ | ||
రవాణా శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 27 మే 2016 – 27 నవంబర్ 2020 | |||
గవర్నరు | కేశరినాథ్ త్రిపాఠి జగదీప్ ధంకర్ | ||
ముందు | అరూప్ బిస్వాస్ | ||
తరువాత | మమతా బెనర్జీ[1] | ||
పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2018 – 2020 | |||
ముందు | సోవన్ ఛటర్జీ | ||
తరువాత | మమతా బెనర్జీ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 16 మే 2009 – 19 మే 2016 | |||
ముందు | లక్ష్మణ్ చంద్ర సేథ్ | ||
తరువాత | దిబ్యేందు అధికారి | ||
నియోజకవర్గం | తమ్లుక్ | ||
జ్యూట్ కార్పొరేషన్ చైర్పర్సన్
| |||
పదవీ కాలం 31 డిసెంబర్ 2020 – 2 మార్చ్ 2021[2] | |||
ముందు | అజయ్ కుమార్ జోలీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొంటాయి, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1970 డిసెంబరు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2020- ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | * కాంగ్రెస్ పార్టీ (1995-1998)
| ||
బంధువులు | దిబ్యేందు అధికారి (సోదరుడు) | ||
నివాసం | కొంటాయి,పూర్భా మేదినిపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ | ||
పూర్వ విద్యార్థి | రవీంద్రభారతి యూనివర్సిటీ (ఎంఏ) ప్రభాస్ కుమార్ కాలేజీ (బిఏ) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుసువెందు అధికారి 1970 డిసెంబరు 15న కర్కులి, పుర్బా మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిసిర్ కుమార్ అధికారి, గాయత్రి దంపతులకు జన్మించాడు. ఆయన ఎంఏ వరకు చదివాడు.
రాజకీయ జీవితం
మార్చుసువెందు అధికారి తన తండ్రి సిసిర్ కుమార్ అధికారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995లో తొలిసారి కాంటాయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 1998లో మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరి 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
సువెందు అధికారి పార్టీలో మమతా బెనర్జీ అనుచరుడిగా మరి ఎకనమిక్ సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా పోరాడిన నాయకుడిగా మంచి గుర్తింపునందుకున్నాడు. ఆయన తరువాత ఎంపీగా, ఎమ్మెల్యేగా 2016లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసి 2020 డిసెంబరు 17న పార్టీకి రాజీనామా చేసి, [4] డిసెంబరు 19న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5] ఆయన 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీ పై 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[6] ఆయనను తరువాత బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితుడయ్యాడు.
ఎన్నికల్లో పోటీ
మార్చు- 1995 : కాంటాయ్ మున్సిపాలిటీ కౌన్సిలర్
- 2006 : కాంతి దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నిక
- 2009 : తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
- 2014 : రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎంపీగా రాజీనామా చేశాడు.
- 2021 : నందిగ్రామ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక[7]
మూలాలు
మార్చు- ↑ "CM Banerjee will take charge of Suvendu's portfolio". NDTV. 28 November 2020.
- ↑ ANI News (2 March 2021). "BJP leader Suvendu Adhikari likely to step down as Chairperson of Jute Corporation of India" (in ఇంగ్లీష్). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
- ↑ Namasthe Telangana (10 May 2021). "బెంగాల్ ప్రతిపక్ష నేతగా సువేందు". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
- ↑ 10TV (27 November 2020). "బెంగాల్ రవాణాశాఖ మంత్రి రాజీనామా" (in telugu). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Mana Telangana (19 December 2020). "బిజెపిలో చేరిన సువేందు అధికారి". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
- ↑ 10TV (2 May 2021). "నందిగ్రామ్ లో సీఎం మమతని ఓడించిన సువెందు అధికారి" (in telugu). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (2 May 2021). "నందిగ్రామ్ సువేందుదే!". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.