సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం
2020 జూన్ 14 న బాలీవుడ్ నటుడు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబయి లోని బాంద్రా ప్రదేశంలో గల తన స్వగృహంలో తుది శ్వాస వదిలాడు.[2] సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నదే మొదటి నుండి సర్వత్రా కలిగిన అభిప్రాయం.[3] అధికారిక పోస్టుమార్టం నివేదికలు కూడా ఊపిరి అందకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని నిర్ధారించాయి. పలు పుకార్లు, అనుమానాల మధ్య ముంబయి పోలీసు విభాగం ఈ హఠాన్మరణాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించింది.[4]
సమయం | Afternoon |
---|---|
తేదీ | 14 జూన్ 2020 |
ప్రదేశం | Bandra, Mumbai, India |
కారణం | Suicide by hanging[1] |
ఖననం | 15 June 2020, at the Pawan Hans Crematorium, Vile Parle |
కాలరేఖ
మార్చుతన ఆత్మాహుతికి వారం రోజుల ముందు నుండి సుషాంత్ మూడు విషయాలపై పలుమార్లు గూగుల్ లో వెదికాడు. మొదటి విషయం దిశా సలియాన్ (తన కంటే వారం రోజులు ముందుగా మరణించిన తన మేనేజర్) కాగా, రెండవది తనపై వచ్చిన వార్తలు, మూడవది మానసిక వ్యాధులు.[5]
- 13 జూన్
భోజనం ముగించి సుషాంత్ నిద్రకు ఉపక్రమించాడు.
- 14 జూన్
మధ్య రాత్రి గం| 2:00 ప్రాంతంలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కి ఒక మారు, టీవీ నటుడు మహేశ్ షెట్టి కి ఒక మారు ఫోన్ కాల్ చేశాడు. రెండింటిలో వేటికి సమాధానం రాలేదు. ఉదయం తొందరగానే నిద్రలేచి కాసేపు తర్వాత స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధుల గురించి, పెయిన్ లెస్ డెత్ (బాధ లేని మరణం) గురించి గూగుల్ లో వెదికాడు [6] [7].
తన సోదరితో గం| 9:00 ప్రాంతంలో మాట్లాడాడు. మరొక గంట గడచిన తర్వాత పళ్ళరసం తీసుకొని, తాను వేసుకొనవలసిన మందు బిళ్ళలను వేసుకొన్నాడు.
గం| 11:30 |ని ప్రాంతంలో సుషాంత్ వంట మనిషి భోజనానికి ఏం వండాలో తెలుసుకొనేందుకు పలుమార్లు తలుపు తట్టగా సుషాంత్ స్పందించలేదు. తనతోనే నివాసం ఉంటున్న తన స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాళం చెవులను తయారు చేసేవారిని పిలిపించి తలుపులు తెరిచిన అతని స్నేహితులు మరణించిన సుషాంత్ ను చూచి సోదరికి, పోలీసులకు కాల్ చేసారు. తన ఆత్మహత్యను ధృవీకరిస్తూ సుషాంత్ ఎటువంటి లేఖను రాయలేదు.[8]
ముంబయి పోలీసులు సుషాంత్ డిప్రెషన్ బారిన పడటంతో సైకియాట్రిస్టును సంప్రదిస్తున్నట్లు తెలిపింది.[9] దీనికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు, డిప్రెషన్ ను తగ్గించే మందుబిళ్ళలు అతని గదిలో దొరికినవి అని టైమ్స్ నౌ తెలిపింది.[10]
- 05 సెప్టెంబరు
ఈ కేసును మూడు సంస్థలు దర్యాప్తు చేస్తున్నవి. అవి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో [11]
ఆరోపణలు
మార్చురియా చక్రవర్తి , ఆమె కుటుంబ సభ్యులు సుశాంత్ కు సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలను వాడుకోవాలని చూశారని సుశాంత్ తండ్రి ఆరోపించారు. సుషాంత్ కు నమ్మకంగా పనిచేసే అతని పనివారిని రియా/ఆమె కుటుంబ సభ్యులు మార్చివేశారని, 15 కోట్ల రూపాయలను సుషాంత్ బ్యాంకు ఖాతా నుండి తమ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకొన్నారని, మానసిక రుగ్మతలకు నివారణగా వాడుతోన్న ఔషధాలను మితి మించి వాడేలా చేశారని, తాము చెప్పినట్లు వినకపోతే సుషాంత్ కు ఉన్న "పిచ్చి" కి సంబంధించిన మెడికల్ రికార్డులను బట్టబయలు చేస్తామని బెదిరించి ముంబైని విడిచి కూర్గ్ కు వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్న సుషాంత్ ఆశలను అడియాసలు చేశారని సుశాంత్ తండ్రి కె కె సింఘ్ అరోపించారు.
విచారణ
మార్చుముంబై పోలీసు విభాగం ఇది ఆత్మహత్యగానే పరిగణించి విచారణ మొదలుపెట్టింది.[12] ముగ్గురు అటాప్సీ డాక్టర్లు తాత్కాలిక పోస్టు మార్టం నిర్వహించి నివేదిక సమర్పించారు. 22 జూన్ న ముంబై డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉరి వేసుకోవడం వలన ఊపిరి అందకనే మరణం సంభవించింది అని ధృవీకరించారు.[13] 25 జూన్ న తుది పోస్టు మార్టం కూడా ఆత్మాహుతి, ఉరి లనే ధృవీకరించింది.[14] పంచనామా వైద్యులు, పంచనామా జరిగిన సమయం నుండి పది నుండి పన్నెండు గంటల ముందు మరణం సంభవించి ఉండవచ్చని నివేదిక లో పేర్కొన్నారు.[15] (అంటే భారతీయ కాలమానం ప్రకారం ఉదయం గం | 11.30 |ని నుండి మధ్యాహ్నం గం | 01:30 |ని లోపు.) ఈ నివేదిక లోనే సుశాంత్ మరణానికి ఎటువంటి అనుమానాలకు తావు లేదని పేర్కొన్నారు.[16][17]
సుశాంత్ తన నిర్వాహకురాలు దిశా సలయిన్ మృతి కి కారణం అనే వార్తలతో మనస్తాపం చెందాడని పోలీసులు తెలిపారు. సుశాంత్ ఆత్మాహుతికి పాల్పడిన ఐదు రోజుల క్రితం దిశా ప్రమాదవశాత్తు మరణించింది. పధ్నాలుగవ అంతస్తు నుండి క్రింద పడిపోవటంతో ఆమె మరణించింది.[18] 3 ఆగష్టు ముంబై పోలీసు కమీషనర్ రెండు మరణాలకు సంబంధం లేదని తెలిపారు.[19]
ముగ్గురు సైకియాట్రిస్టులు, ఒక సైకో థెరపిస్టు సుశాంత్ తమ వద్ద చికిత్ర పొందుతున్నాడని, వారు సూచించిన ఔషధాలను వాడేవాడు అని విచారణలో తెలిపారు.
మొదట సుశాంత్ బాత్ రోబ్ (స్నానానికి ముందు/తర్వాత ధరించే కోటు లాంటిది) యొక్క బెల్టుతో ఉరి వేసుకోవటానికి ప్రయత్నించాడు అని, కాని అతని బరువును అది మోయలేకపోవటంతో తన కుర్తాతో ఉరి వేస్కొన్నాడని పోలీసులు తెలిపారు. వస్త్రాలన్నీ సుశాంత్ బెడ్ రూంలో చిందర వందరగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.[20]
25 జూలై న సుశాంత్ తండ్రి కె.కె సింగ్ తను నివసించే పట్టణం పాట్నా లో రియా, ఆరుగురు ఇతరులు (రియా కుటుంబ సభ్యుల) పై సుశాంత్ ను ఆత్మాహుతికి ప్రేరేపించినట్లు FIR దాఖలు చేసారు.[21] ఈ FIR లో ఇంకా దొంగతనం, నమ్మకద్రోహం, మోసం వంటి ఆరోపణలు కూడా చేశారు. రియా ఆర్థికంగా సుశాంత్ ను మోసం చేసిందని మానసికంగా హింసించిందని పేర్కొన్నాడు.[22] సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని, సుశాంత్ తండ్రివి తప్పుడు ఆరోపణలని రియా సుప్రీం కోర్టుకు విన్నవించుకొంది.[23] పాట్నాలో కేసు తప్పుదోవ పట్టవచ్చని, కేసును ముంబయి కి బదిలీ చేయాలని రియా కోరింది.[24] సుశాంత్ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలను శోధించే Enforcement Directorate 150 మిలియను రూపాయల మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది.[25]
13 జూన్ న సుశాంత్ తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడని పలు నివేదికలు తెలిపిననూ, సుశాంత్ ఇంట్లో పనివారు, వారిని విచారించిన బీహార్ పోలీసులు ఈ వార్తను నిరాకరించారు. తొలుత సుశాంత్ ఇంట్లో ఉన్న CCTV పని చేయటం లేదని తెలిపిన ముంబయి పోలీసులు[26] 3 ఆగస్టు న మాత్రం తాము CCTV ఫుటేజ్ ని పరిశీలించామని ఆ రోజు ఎటువంటి పార్టీ జరుగలేదని ధృవీకరించారు.[27]
సుశాంత్ బ్యాంక్ ఖాతాల నుండి రియా చక్రవర్తి బ్యాంక్ ఖాతాకు ఎటువంటి డబ్బు చేరలేదని ముంబయి పోలీసు కమీషనర్ 3 ఆగస్టు న తెలిపారు. 4 ఆగస్టు న గ్రాంట్ థార్టన్ అనే ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ సంస్థను ముంబయి పోలీసు నియమించింది.[28]
6 ఆగస్టు న భారతదేశ ప్రభుత్వ అత్యున్నత విచారణ సంస్థ అయిన CBI (Central Bureau of Investigation) పాట్నా FIR ఆధారంగా రియా చక్రవర్తిని ముద్దాయిగా పేర్కొంటూ కేసును తమ అధీనం లోకి తీసుకొంది.[29]
19 ఆగస్టున సుప్రీం కోర్టు విచారణ బాధ్యతలు CBI తీసుకోవడాఅనికి అనుమతించటమే కాక, భవిష్యత్తులో సుషాంత్ మరణానికి సంబంధించిన అన్ని చట్టపరమైన కేసులను CBI పర్యవేక్షించాలని అజ్ఞాపించింది.[30] న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేసే AIIMS (All India Institute of Medical Sciences) యొక్క Forensic Medicine HOD అయిన సుధీర్ గుప్తా ను ఈ కేసు లో సహాయసహకారాలను అందించేందుకు CBI నియమించింది.[31]. 21 ఆగస్టున గుప్తా "హత్య కోణం లో కూడా మేము దర్యాపు చేస్తాం. అయితే, మిగితా అన్నీ కోణాలను కూడా మేము నిశితంగా పరిశీలిస్తాం." అని PTI (Press Trust of India) కు తెలిపారు. "పోస్టు మార్టం జరిగిన సమయంలో ఇతర సాక్ష్యాధారాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆత్మాహుతి, హత్యారోపణల దిశగా పరిశీలిస్తాం." అని ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ కు తెలిపారు.[32]
26 ఆగస్టున Narcotics Control Bureau రియా, రియా సోదరుడు షోవిక్, ఇంకొక ముగ్గురి పై FIR దాఖలు చేసింది. ఆర్థిక విచారణలో రియా, షోవిక్ లకు మాదకద్రవ్యాలు అందినవి అని తేలిన తర్వాత, ఇక పై విచారణలో పాల్గొనటానికి ED NCB కి ఆహ్వానం పంపింది. గంజాయి వాడారని తేలడంతో Narcotic Drugs and Psychotropic Substances Act (NDPS Act) చట్టం క్రింద ఈ FIR దాఖలు చేయబడ్డది [33]. ఇదే చట్టం క్రింద 4 సెప్టెంబరున షోవిక్ ను, సుశాంత్ ఇంటి నిర్వాహకుడిని అరెస్టు చేయడం జరిగింది.[34] 9 సెప్టెంబరున NCB రియా ను సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అభియోగం పై అరెస్టు చేశారు. సుశాంత్ మరణం పై జరుగుతోన్న విచారణలో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి అరెస్టు చేయబడ్డ 20 మంది లో రియా కూడా ఒకరు [35]. 6 అక్టోబరున ముంబయి సెషన్స్ కోర్టు రియా రిమాండు ను 20 అక్టోబరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాతి రోజే ముంబయి హై కోర్టు రియాకు బెయిలు మంజూరు చేసింది [36]. సుశాంత్ కు మాదకద్రవ్యాలు అందించి రియా నే అనే NCB వాదన ను ముంబయి హై కోర్టు తోసిపుచ్చింది. పైగా మాదక ద్రవ్యాల వర్తకులతో రియాకు ఎటువంటి భాగస్వామ్యం లేదని తేలింది. దీనితో జస్టిస్ సారంగ్ కొత్వాల్, "తాను ఖరీదు చేసిన మాదకద్రవ్యాలను ఆర్థిక, మరే ఇతర లాభాల కోసం వేరొకరికి అందించ లేదు." అని పేర్కొన్నారు.
3 అక్టోబరు న AIIMS కు చెందిన సుధీర్ గుప్తా, "సుశాంత్ ది ఆత్మహత్యే. హత్య అనే వాదనకు తావు లేదు." అని తెలిపారు.[37] . ANI కు తెలుపుతూ, "ఉరి తప్పితే అతని శరీరం పై ఎటువంటి గాయాలు లేవు. ఎటువంటి ప్రతిఘటన/గింజుకొనే ప్రయత్నం, అతని శరీరం దుస్తులపై లేదు." అన్నారు.[38]. 5 అక్టోబరున AIIMS మెడికల్ బోర్దు CBI కి సుశాంత్ ది ముమ్మాటికీ ఆత్మహత్యే, హత్య కాదు అని నివేదిక సమర్పించినట్లు ANI పేర్కొంది.
ప్రతిస్పందనలు
మార్చుసుశాంత్ మరణం ఊహించనిదిగా,, ఆశ్చర్యం కలిగించేదిగా అభివర్ణించబడింది [39]. మానసిక ఆరోగ్యం పై పలు చర్చలకు తెర తీసింది [40]. చాలా మంది ప్రముఖ నేతలు, నటీనటులు సాంఘిక మాధ్యమాలలో స్పందించారు [41]. ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీ "a bright young actor gone too soon" అని తెలిపారు. క్రికెటీర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి లు తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు [42].
సుశాంత్ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం, 2019 లో విడుదల అయిన చిచోరే వంటి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన తర్వాత సుశాంత్ తొమ్మిది చిత్రాలను ఒప్పుకొన్నాడని, అయితే ఆరు నెలల కాలవ్యవధి లోనే అన్ని అవకాశాలు కనుమరుగైయాయని తెలిపారు [43].
15 జూన్ న మహరాష్ట్ర సైబర్ పోలీసు కొందరు అసౌకర్యం కలిగించేలా సుశాంత్ ఫోటోలు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొనవలసి వస్తుందని హెచ్చరిక జారీ చేసింది [44].
31 జూలై నాటికి కనీసం ముగ్గురు సుశాంత్ అభిమానులు సుశాంత్ వలె నే ఆత్మాహుతికి పాల్పడ్డారు. వీరిలో ఒక టీవీ నటుడు [45], ఒక 13 ఏళ్ళ బాలిక కూడా కలరు [46].
రియాపై అభియోగాల మోపబడ్డ తర్వాత రియాను దూషిస్తూ, బెదిరిస్తూ భోజ్ పురి భాషలో చిత్రీకరించబడ్డ గీతాలు కొన్ని బీహార్ లో జనాదరణ పొందాయి.[47]
సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సుషాంత్ కోసం సామూహిక ప్రార్థన (Global Prayers for SSR) తలపెట్టింది. 15 ఆగస్టు స్థానిక కాలమానం ప్రకారం ఉ: గం| 10.00 | ని కి సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రకటించింది.[48] కుటుంబ సభ్యులు, అభిమానులతో బాటు బాలీవుడ్ కు చెందిన కృతి సనన్, అంకిత లోఖండే, ఏక్తా కపూర్ ఈ ప్రార్థనలో పాలుపంచుకొన్నారు.[49][50]
సుశాంత్ కేసు ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా, అవిరామంగా చర్చించబడింది.[51][52] 3 సెప్టెంబరు 2020 రెండు PIL (Public Interest Litigation) లను పరిగణలోకి తీసుకొంటూ ముంబయి పోలీసు కు వ్యతిరేకంగా "అనుచిత, దురుద్దేశ్యపూర్వకంగా, ప్రసార మాధ్యమాలలో తప్పుడు ప్రచారాన్ని" ఉద్దేశ్యించి బొంబాయి హై కోర్టు, "ఈ కేసు విచారణకు ఏ విధమైన అడ్డుకట్టలు పడకుండా ఉండేలా ప్రసార మాధ్యమాలలో తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరుతున్నాం, ఆశిస్తున్నాం" [53] అని సలహా ఇచ్చింది. 5 అక్టోబరు 2020న ముంబయి పోలీసు, దాని అనుబంధ సైబర్ యూనిట్ సాంఘిక మాధ్యమాలు 80,000 కు పైగా ఫేక్ అకౌంట్ ల ను గుర్తించారు. ఆసియా, ఐరోపా ఖండాలలోని వివిధ దేశాల నుండి ఈ అకౌంట్లు వారి అధికారిక విచారణకు అపకీర్తి తెచ్చేలా పోస్టులు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు కమీషనర్ పరం వీర్ సింగ్, "అప్పటికే 6,000 మంది పోలీసు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకి ఉంది. 84 పోలీసు ఉద్యోగులు వైరస్ వల్ల మృతి చెందారు. ఈ దుష్ప్రచారాలు మా మీద బురద చల్లటానికి, విచారణను ప్రక్కదారి పట్టించటానికి చేయబడ్డాయి. చట్టాన్ని అతిక్రమించిన వారి పై Information Technology Act చట్టం క్రింద కేసు నమోదు చేస్తాం." అని తెలిపారు [54].
CBI పరిశోధనకై విన్నపం
మార్చుసుశాంత్ తండ్రి సోదరుడు ఇది హత్యేనని దీనిని CBI యే శోధించాలి అని డిమాండ్ చేసారు.[55] పలు రాజకీయ నేతలు, చాలా వరకు బీహార్ కి చెందిన వారు ఈ కేసు విచారణ CBI చేపట్టాలని అభిప్రాయపడ్డారు.[56][57] శేఖర్ సుమన్ అనే బాలీవుడ్ యాక్టర్ #justiceforSushantforum అనే హ్యాష్ ట్యాగు చేసి CBI విచారణను కోరారు.[58]
అభిమానులు కూడా పలు సాంఘిక మాధ్యమాలలో CBI పరిశోధన కోరారు. 16 జూలై 2020న హిందుస్తాన్ టైంస్ సుశాంత్ ఆత్మాహుతి నేపథ్యంలో, "పలు కుతంత్రాలతో కూడిన ఒక భారీ ఆన్లైన్ క్యాంపెయిన్ ఈ విషయంలో CBI పరిశోధన అవసరం అనే అగ్నికి ఆజ్యం పోస్తోంది." అని ప్రచురించింది. తనను తాను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రకటించుకొన్న రియా, అమిత్ షా సహకారాన్ని కోరుతూ కేంద్ర హోం మంత్రికి CBI పరిశోధన చేయించాలి అని ఒక లేఖలో విన్నవించుకొన్నట్లు హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించింది [59] మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి కూడా CBI పరిశోధనకై విన్నవించుకోవటంతో ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విన్నపాన్ని అంగీకరించింది.[60]
అయితే మహరాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ CBI జోక్యం వాదనను త్రోసిపుచ్చారు. "ముంబై పోలీసు ఇటువంటి కేసులను దర్యాప్తు చేయటానికి తగు సమర్థులే [61] " అని 17 జూలై న వెల్లడించారు. 22 జులై న సుశాంత్ అభిమానులు ట్విట్టరులో #Candle4SSR అనే హ్యాష్ ట్యాగును సృష్టించి ఒక ప్రచార కార్యక్రమం నడిపారు. 2 మిలియన్ ట్వీట్లతో ఈ ప్రచారం జయప్రదమైంది. ప్రపంచ వ్యాప్తంగా సుశాంత్ అభిమానులు ఈ కేసు CBI చేపట్టాలని కోరుకున్నారు.[62]. అయినా 29 జులై న దేశ్ ముఖ్ ఈ కేసు CBI చేపట్టబోదని నొక్కి వక్కాణించారు.[63]
5 ఆగస్టు న CBI విచారణ చేపట్టాలనే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫారసును సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన తుషార్ మెహతా భారత దేశపు ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆమోదించిందని తెలిపారు.[64] దీని ఆధారంగా CBI దర్యాపును మొదలు పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు అధికారులు తెలిపారు. [65] ఈ కేసును CBI చేపట్టటంలో అవాంఛిత అత్యుత్సాహం ప్రదర్శించిందని మహరాష్ర ప్రభుత్వం సుప్రీం 8 ఆగస్టున కోర్టుకు తెలిపింది. కేసు కోర్టు పరిధిలో ఉండగానే CBI తమ వైపు నుండి కేసును ప్రారంభించడం అనుచితం అని పేర్కొంది.[66]
సినీ పరిశ్రమ లో పక్షపాతం పై చర్చ
మార్చుసుశాంత్ మరణం బాలీవుడ్ లో వంశ పారంపర్యం, ఇతర దుశ్చర్యలపై చర్చలకు తెర తీసింది. కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్ లతో సహా మరో నలుగురి పై సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది పాట్నా ఉన్నత న్యాయస్థానం లో వంశపారంపర్యం వల్లనే సుశాంత్ కు అవకాశాలు కొరవడ్డాయని, అందుకే సుశాంత్ ఆత్మాహుతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కేసు వేశారు.[67]. కానీ ఈ కేసులో 8 జూలై న కొట్టివేయబడింది.[68] కరణ్ జోహార్, ఆలియా భట్ లు సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్డారు.[69]
కంగనా రనౌత్ తన అనుచర వర్గం తో బాలీవుడ్ లో వేళ్ళూనుకొని ఉన్న పక్షపాత ధోరణిని దుయ్యబట్టారు.[70] రిపబ్లిక్ టీవీ ముఖ్య ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి తో ముఖాముఖిలో సుశాంత్ మరణానికి కారణం 'మూవీ మాఫియా' నే అని తెలిపారు. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలు అయిన ధర్మా ప్రొడక్షన్స్, యష్ రాజ్ ఫిలింస్ పనిగట్టుకొని సుశాంత్ వైఫల్యం చవి చూపించారని, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ సుశాంత్ ను బహిరంగంగా అవహేళన చేసారని తెలిపారు [71].
సిమీ గేరేవాల్ [72], ఏ ఆర్ రెహమాన్ [73] తాము బాలీవుడ్ లో ఎదుర్కొన్న పక్షపాత ధోరణిని బయట పెట్టారు. సినీ సంగీత రంగంలో ఉన్న పక్షపాత ధోరణిని మ్యూజిక్ మాఫియా గా సోనూ నిగం అభివర్ణించారు.[74] పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో సాంఘిక మాధ్యమాలలో ప్రాచుర్యం పొందింది.[75]
12 ఆగస్టు 2020 న విడుదలైన సడక్ 2 ట్రైలర్ యూట్యూబ్ పై 24 గంటలలో అత్యధిక డిజ్లైక్ లు (అసహ్యించుకోబడ్ద) పొందినదిగా గుర్తించబడింది.[76] సుశాంత్ మరణానికి బాలీవుడ్ లో పక్షపాత ధోరణే కారణం అని భావించిన అతని అభిమానులే దీనిని అసహ్యించుకోన్నారు. మహేశ్ భట్ ను, ఈ చిత్ర దర్శకుణ్ణి, ఒక ముఖాముఖి లో ఒక ప్రశ్నకు సమాధానంగా మాట వరస కి "సుశాంత్ ను చంపేస్తాను" అని అన్న ఆలియా భట్ ను తీవ్రంగా దుయ్యబట్టారు.[77]
అంత్యక్రియలు
మార్చు15 జూన్ న విలే పార్లే లో ఉన్న పవన్ హన్స్ క్రిమేటోరియం లో సుశాంత్ తండ్రి చే అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి.[78] కృతి సనన్, శ్రద్ధా కపూర్, వివేక్ ఓబెరాయ్ వంటి సహచర నటులు ఈ అంత్యక్రియలలో పాల్గొన్నారు.[79]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sushant Singh Rajput dies by suicide at 34 in Mumbai". India Today. 14 June 2020. Archived from the original on 14 June 2020. Retrieved 14 June 2020.
- ↑ సుశాంత్ ఆత్మాహుతి
- ↑ సుశాంత్ పోస్టు మార్టం రిపోర్టు
- ↑ "సుశాంత్ మరణం పై పోలీసుల దర్యాప్తు". Archived from the original on 2020-08-17. Retrieved 2020-09-28.
- ↑ ఆత్మాహుతికి ముందు సుశాంత్ ప్రవర్తన
- ↑ ఆ రోజు త్వరగానే నిద్రలేచిన సుశాంత్
- ↑ మానసిక వ్యాధుల గురించి గూగుల్ శోధించిన సుశాంత్
- ↑ ఆత్మాహుతిని ధృవీకరిస్తూ ఎటువంటి లేఖ రాయని సుశాంత్
- ↑ సుశాంత్ మానసిక వత్తిళ్ళను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించిన మానసిక వైద్య నిపుణులు
- ↑ సుశాంత్ ఇంట్లో మానసిక వత్తిడిని నయం చేసే ఔషధాలు లభ్యం
- ↑ సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న మూడు సంస్థలు
- ↑ ఆత్మాహుతిగానే పరిగణిస్తూ ముంబయి పోలీసుల విచారణ ప్రారంభం
- ↑ సుశాంత్ పార్థివ దేహం పై పోస్టు మార్టం రిపోర్టు
- ↑ పలు ఊహాగానాలకు తావు ఇచ్చిన సుశాంత్ మరణం
- ↑ పోస్టు మార్టం జరిగిన 10-12 గంటల ముందు సుశాంత్ మరణం
- ↑ ఎటువంటి కుతంత్రాలకు తావు లేదని తెలిపిన ముంబయి పోలీసు - ముంబయి మిర్రర్
- ↑ ఎటువంటి కుతంత్రాలకు తావు లేదని తెలిపిన ముంబయి పోలీసు డెక్కన్ హెరాల్ద్
- ↑ సుశాంత్ మేనేజర్ దిశ పధ్నాలుగవ అంతస్తు నుండి క్రింద పడి మృతి
- ↑ సుశాంత్, దిశ ల మరణాలకు సంబంధం లేదు - ముంబయి పోలీస్
- ↑ ఉరి పోసుకొన్న సమయంలో సుశాంత్ ఎలాంటి పెనుగులాట చేయలేదు
- ↑ రియా చక్రబొర్తి యే తమ కుమారుడిని ఆత్మాహుతికి ప్రేరేపించింది అని సింగ్ FIR
- ↑ FIR లో రియాపై మరిన్ని నేరారోపణలు
- ↑ తన పై నేరారోపణలు అసత్యాలు అని తెలిపిన రియా
- ↑ నిష్పక్షపాత విచారణ నిమిత్తం కేసును ముంబయికి తరలించాలని విన్నవించుకొన్న రియా
- ↑ రియా పై మనీ లాండరింగ్ ఆరోపణలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
- ↑ సుశాంత్ ఇంట్లో అమర్చబడ్డ CCTV కెమెరాలు పని చేయలేదన్న పోలీసులు
- ↑ దిశ హత్యకు సుశాంత్ ఆత్మాహుతికి ఎటువంటి సంబంధం లేదు
- ↑ గ్రాంట్ థార్టన్ సంస్థ సుశాంత్ మరణం దర్యాప్తులో ఆర్థిక కోణం
- ↑ CBI జోక్యం
- ↑ CBI కే బాధ్యతలు అప్పగించిన సుప్రీం కోర్టు
- ↑ AIIMS నియామకం
- ↑ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామన్న AIIMS
- ↑ రియాతో బాటు పలు ఇతరులపై మాదక ద్రవ్యాల దుర్వినియోగం చట్టాల కొరడా
- ↑ "రియా సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి నిర్వాహకుడు అరెస్టు". Archived from the original on 2020-10-22. Retrieved 2020-10-19.
- ↑ రియా అరెస్టు
- ↑ రియాకు బెయిలు మంజూరు
- ↑ సుశాంత్ ది ఆత్మాహుతే అని పునరుద్ఘటించిన AIIMS
- ↑ AIIMS నివేదిక
- ↑ "అనూహ్యం, బాధాకరం" అని స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటీర్లు, మంత్రులు
- ↑ మానసిక ఆరోగ్యం పై చర్చలకు తెర తీసిన సుశాంత్ మరణం
- ↑ సాంఘిక మాధ్యమాలలో స్పందించిన పలువురు ప్రముఖులు
- ↑ పలువురి ప్రతిస్పందనలు
- ↑ "సుశాంత్ అవకాశాలు కోల్పోయాడు" - కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం
- ↑ అసౌకర్యం కలిగించే ఫోటోలు డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు - మహారాష్ట్ర సైబర్ పోలీస్
- ↑ సుశాంత్ కు మల్లే ఉరి వేసుకొన్న టీవీ నటుడు
- ↑ అలానే ఉరి వేసుకొని మరణించిన మరొక బాలిక
- ↑ భోజ్ పురి లో రియా కు వ్యతిరేకంగా గీతాలు
- ↑ సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని అతని సోదరి ప్రార్థనలు
- ↑ ప్రార్థనలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, సహ నటులు
- ↑ సుశాంత్ ఆత్మశాంతికై ప్రార్థనలు
- ↑ ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా చర్చించబడ్డ సుశాంత్ మరణం
- ↑ సుశాంత్ మరణం పై చర్చలు
- ↑ మీడియా తమ ప్రచారాన్ని నిగ్రహించుకోవాలని కోరిన ముంబయి హై కోర్టు
- ↑ ముంబై పోలీసుల పై బురద జల్లేందుకే సృష్టించబడ్డ పలు ఫేక్ ఐడి లు
- ↑ సుశాంత్ ది ఆత్మహత్య కాదు అని అభిప్రాయపడ్డ సుశాంత్ బంధువులు
- ↑ సుశాంత్ కేసులో తాత్సారం ఎందుకు?
- ↑ సిబిఐ దర్యాప్తు చేపట్టాలని పలువురి అభిప్రాయం
- ↑ సుశాంత్ కు న్యాయం జరగాలని క్యాంపెయిన్ మొదలు పెట్టిన శేఖర్ సుమన్
- ↑ సిబిఐ దర్యాప్తును కోరిన రియా
- ↑ సుబ్రమణ్యం స్వామి అభ్యర్థన మేరకు సిబిఐ దర్యాప్తుకు అంగీకరించిన ప్రధాన మంత్రి కార్యాలయం
- ↑ CBI జోక్యం అవసరం లేదని అభిప్రాయపడ్డ మహారాష్ట్ర హోం మంత్రి.
- ↑ ట్విట్టర్ లో సుశాంత్ అభిమానులు CBI విచారణ చేపట్టాలని ఆన్లైన్ క్యాంపెయిన్
- ↑ CBIకి ఈ కేసు అప్పగించేది లేదని స్పష్టం చేసిన మహారాష్ట్ర హోమ్
- ↑ సుశాంత్ కేసు పగ్గాలు CBI కి
- ↑ CBI ధృవీకరణ
- ↑ CBI ది అత్యుత్సాహంగా పేర్కొన్న మహారాష్ట్ర ప్రభుత్వం
- ↑ కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్, ఏక్తా కపూర్ల పై కోర్టు కేసు
- ↑ కేసు కొట్టివేత
- ↑ సాంఘిక మాధ్యమాలలో దూషించబడ్ద కరణ్ జోహార్, ఆలియా భట్
- ↑ "సినీ పరిశ్రమలో వంశ పారంపర్యాన్ని దుయ్యబట్టిన కంగనా రణావత్". Archived from the original on 2020-09-25. Retrieved 2020-10-25.
- ↑ "కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, కొందరు విమర్శకులు సుశాంత్ లో ఆత్మన్యూనతాభావాన్ని నూరిపోశారన్న కంగన". Archived from the original on 2020-09-05. Retrieved 2020-10-25.
- ↑ కంగన ను సమర్థించిన సిమీ గెరెవాల్
- ↑ తాను సైతం బాలీవుడ్ లో పక్షపాత ధోరణిని ఎదుర్కొన్నానని తెలిపిన ఏ ఆర్ రెహమాన్
- ↑ మ్యూజిక్ మాఫియా గురించి గాయకుడు సోనూ నిగం
- ↑ పక్షపాతం పై కాదర్ ఖాన్ తీసిన వీడియో వైరల్
- ↑ సడక్ 2 కు అత్యధిక డిజ్లైకులు గా రికార్డు
- ↑ సడక్ 2లో అవకాశం కోల్పోవటం వలనే సుశాంత్ ఆత్మాహుతికి ఒడిగట్టాడని భావించిన అతని అభిమానులు
- ↑ సుశాంత్ అంత్యక్రియలు
- ↑ అంత్యక్రియలలో పాల్గొన్న సహచర నటీనటులు