సుహాస్ యతిరాజ్

(సుహాస్‌ యతిరాజ్‌ నుండి దారిమార్పు చెందింది)

సుహాస్ లలినకెరె యతిరాజ్ భారతదేశానికి చెందిన ఐఏఎస్‌ అధికారి, పారాలింపిక్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 4 విభాగంలో రజత పతకం గెలిచాడు. ఆయన 2007 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.[1][2][3]

సుహాస్‌ యతిరాజ్‌
Suhas in 2016
వ్యక్తిగత సమాచారం
జన్మనామంసుహాస్ లలినకెరె యతిరాజ్
జననం (1983-07-02) 1983 జూలై 2 (వయసు 40)
హస్సన్ , కర్ణాటక, భారతదేశం
నివాసముగౌతమ్ బుద్దా నగర్ , ఉత్తర ప్రదేశ్,భారతదేశం
ఎత్తు1.75 m (5 ft 9 in)
బరువు61 కేజీలు
దేశం భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2007–ప్రస్తుతం
వాటంకుడి చేతి
గురువుసుహాస్‌ యతిరాజ్‌

జననం, విద్యాభ్యాసం మార్చు

సుహాస్‌ యతిరాజ్‌ 2 జూలై 1983న కర్ణాటక రాష్ట్రం, హాసన్ లో జన్మించాడు. ఆయన ఎన్ఐటీ కర్ణాటకలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సివిల్స్ రాసి 2007లో ఐఏఎస్‌ను సాధించాడు.

వృత్తి జీవితం మార్చు

సుహాస్‌ యతిరాజ్‌ ఐఏఎస్ గా ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, ఆజమ్‌ఘర్, జాన్‌పూర్, సోన్‌భద్రా జిల్లాల్లో పనిచేసి ప్రస్తుతం గౌతమ్ బుద్దా నగర్ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నాడు.

నిర్వహించిన భాద్యతలు మార్చు

హోదా ప్రదేశం కాల పరిమితి
ప్రొబెషనర్ ఆగ్రా 1 సంవత్సరం
జాయింట్ మేజిస్ట్రేట్ ఆజంగఢ్ 15 నెలలు
చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మథుర 4 నెలలు
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మహారాజ్‌గంజ్ జిల్లా 3 నెలలు
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హాత్‌రస్ 10 నెలలు
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సోన్‌భద్ర జిల్లా 3 నెలలు
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జౌన్‌పూర్ జిల్లా 27 నెలలు
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆజంగఢ్ 23 నెలలు
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రయాగ్‌రాజ్ 16నెలలు
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గౌతమ బుద్ద నగర్ జిల్లా ప్రస్తుతం

మూలాలు మార్చు

  1. Eenadu (5 September 2021). "Paralympics: బ్యాడ్మింటన్‌లో సుహాస్‌ యతిరాజ్‌కు రజతం - telugu news suhas yathiraj wins silver in paralympics". Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.
  2. Andrajyothy (5 September 2021). "Tokyo Paralympics: బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్‌కు రజతం". Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.
  3. Sakshi (5 September 2021). "పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్." Archived from the original on 6 September 2021. Retrieved 6 September 2021.