హాత్‌రస్
హాత్‌రస్ ఉత్తర ప్రదేశ్ లోని హాత్‌రస్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. అలీగఢ్, మధుర, ఆగ్రా జిల్లాల్లోని కొన్ని భాగాలను విడదీసి, 1997 మే 3న హాత్‌రస్ జిల్లాను ఏర్పాటు చేసారు. ఇది అలీగఢ్ డివిజనులో భాగం.[1]
హాత్‌రస్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°36′N 78°03′E / 27.60°N 78.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | హాత్‌రస్ |
Government | |
• Type | Democratic |
విస్తీర్ణం | |
• Total | 142 కి.మీ2 (55 చ. మై) |
Elevation | 178 మీ (584 అ.) |
జనాభా (2011) | |
• Total | 15,64,708 |
• జనసాంద్రత | 850/కి.మీ2 (2,200/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 204101 |
టెలిఫోన్ కోడ్ | 05722 |
Vehicle registration | UP-86 |
లింగనిష్పత్తి | 870 ♂/♀ |
ప్రాథమికంగా ఇక్కడ మాట్లాడే భాష బ్రజ్. ఇది హిందీ భాషకు చెందిన ఒక మాండలికం. ఇది ఖడీబోలీ మాండలికానికి దగ్గరగా ఉంటుంది.[2] ఇంగువకు ప్రసిద్ధి చెందిన హాత్‌రస్ గత 100 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున దీనిని ఉత్పత్తి చేస్తుంది.[3]
భౌగోళికం
మార్చుహాత్రస్ 27°36′N 78°03′E / 27.6°N 78.05°E వద్ద [4] సముద్రమట్టం నుండి 185 మీటర్ల ఎత్తున, ఆగ్రా, అలీగఢ్, మధుర, బరేలీ రహదారుల కూడలి వద్ద ఉంది. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన వ్యత్యాసాలకు ప్రసిద్ధి చెందింది.[5] 2001 భారత జనాభా లెక్కల ప్రకారం, హాత్‌రస్ జనాభా 123,243. ఇందులో 53% పురుషులు, 47% స్త్రీలు. హాత్‌రస్ అక్షరాస్యత 60%, ఇది జాతీయ సగటు 59.5%తో దాదాపు సమానం, అందులో పురుషుల అక్షరాస్యత 66% కాగా, స్త్రీల అక్షరాస్యత 53%. ఆరేళ్ళ లోపు పిల్లలు జనాభాలో 14% ఉన్నారు .
నగరం | హాత్‌రస్ నుండి దూరం | హాత్‌రస్ నుండి దిశ |
---|---|---|
అలీగఢ్ | 36 కి.మీ. | ఉత్తరం వైపు |
మధుర | 41 కి.మీ. | పడమర వైపు |
ఖైర్ | 46 కి.మీ. | వాయవ్య దిశలో |
ఆగ్రా | 53.8 కి.మీ. | దక్షిణం వైపు |
పట్టణంలో హాత్‌రస్ జంక్షన్ రైల్వే స్టేషను ఉంది.
హాత్‌రస్‌లో రుతుపవనాల ప్రభావంతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది. ఇది ఉత్తర-మధ్య భారతదేశానికి విలక్షణమైనది. వేసవి కాలం ఏప్రిల్‌లో మొదలై మేలో ముగుస్తుంది. ప్రారంభమవుతుంది. రుతుపవనాలు జూన్ చివరలో మొదలవుతాయి, అక్టోబరు ఆరంభం వరకు కొనసాగుతాయి, అధిక తేమను కలిగిస్తాయి.[6]
శీతోష్ణస్థితి
మార్చుశీతోష్ణస్థితి డేటా - Hathras | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °F (°C) | 71.6 (22.0) |
82.0 (27.8) |
92.1 (33.4) |
102.2 (39.0) |
108.7 (42.6) |
104.0 (40.0) |
95.0 (35.0) |
93.2 (34.0) |
96.6 (35.9) |
94.1 (34.5) |
73.4 (23.0) |
— | 114.1 (45.6) |
సగటు అల్ప °F (°C) | 47.5 (8.6) |
53.6 (12.0) |
62.8 (17.1) |
72.3 (22.4) |
82.0 (27.8) |
85.1 (29.5) |
81.0 (27.2) |
78.8 (26.0) |
70.7 (21.5) |
73.4 (23.0) |
50.2 (10.1) |
— | 45.5 (7.5) |
Source: India Meteorological Department[7][8] |
రవాణా
మార్చుహాత్రస్లో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి: హాత్‌రస్ జంక్షన్ రైల్వే స్టేషన్, హాత్‌రస్ రోడ్ రైల్వే స్టేషన్,[9] హాత్‌రస్ సిటీ రైల్వే స్టేషన్, హాత్‌రస్ కిలా రైల్వే స్టేషన్. వస్తు రవాణా కోసం ప్రత్యేకించిన ఫ్రైట్ కారిడార్‌లో నిర్మించిన కొత్త స్టేషన్‌కు న్యూ హాత్‌రస్ అని పేరు పెట్టారు.
మూలాలు
మార్చు- ↑ "Akhilesh renames eight districts". Thehindu.com. 24 July 2012. Retrieved 6 January 2019.
- ↑ Scott, Jerrie Cobb; Straker, Dolores Y.; Katz, Laurie (2009-06-02). Affirming Students' Right to Their Own Language: Bridging Language Policies and Pedagogical Practices (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-26945-6.
- ↑ "Official Website of One District One Product Uttar Pradesh / Hathras". odopup.in. Archived from the original on 2020-09-21. Retrieved 2020-07-31.
- ↑ "Falling Rain Genomics, Inc - Hathras". Fallingrain.com. Retrieved 2012-06-23.
- ↑ "Weather for Hathras, Uttar Pradesh, India". Timeanddate.com. Retrieved 6 January 2019.
- ↑ "Hathras Monthly Climate Averages". WorldWeatherOnline.com. Retrieved 2020-08-16.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)". India Meteorological Department. December 2019. p. M210. Archived from the original on 28 సెప్టెంబరు 2020. Retrieved 27 April 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Extremes of Temperature (From Jan 2020 to Aug 2020)". India Meteorological Department. 16 August 2020. p. M210. Archived from the original on 9 అక్టోబరు 2020. Retrieved 16 August 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Hathras Road Railway Station (HTJ) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-25.