సూరజ్ తాల్ సరస్సు
సూర్య భగవానుడి పేరు మీదుగా ఈ సరస్సుకు సూరజ్ తాల్ అని పేరు వచ్చింది. ఇది 800 మీటర్ల (2,600 అడుగులు) పొడవు కలిగి, సముద్ర మట్టానికి 4,890 మీటర్ల (16,040 అడుగులు) ఎత్తులో ఉంది.[1][2]
సూరజ్ తాల్ సరస్సు సూర్య తాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సిబి రేంజ్, లాహౌల్ స్పితి జిల్లా,హిమాచల్ ప్రదేశ్,భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 32°45′46″N 77°23′52″E / 32.76278°N 77.39778°E |
రకం | ఎత్తైన మంచినీటి సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | మంచు కరగడం |
వెలుపలికి ప్రవాహం | చంద్రభాగ నది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల ఎత్తు | 4,883 మీ. (16,020.3 అ.) |
ఘనీభవనం | శీతాకాలం |
ప్రత్యేకత
మార్చుఈ సరస్సు అత్యంత ఎత్తైన సరస్సులలో భారతదేశంలో మూడవదిగా, ప్రపంచంలో 21వదిగా ప్రసిద్ధి చెందింది . ఈ సరస్సు నుండి చంద్రభాగ నది ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చుసూరజ్ తాల్ సరస్సు లాహౌల్ స్పితి జిల్లా కేంద్రమైన కీలాంగ్ నుండి 65 కిమీ (40 మైళ్ళు) దూరంలో ఉంది. లేహ్-మనాలి హైవే అని పిలువబడే జాతీయ రహదారి NH-21 రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. రోహ్తంగ్ పాస్ నుంచి లేహ్ వరకూ ఈ మార్గం శీతాకాలంలో (నవంబర్ నుంచి ఏప్రిల్) అందుబాటులో ఉండదు. ఆ సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. భారతీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఈ అందమైన సరస్సుకు ట్రెక్ చేసుకుంటూ వెళ్లడం ఇష్టపడతారు.[4][5]
వాతావరణం,శీతోష్ణస్థితి
మార్చుఇది బారాలచ శిఖరం మార్గంలో ఉన్న భగ నది వలన నిండుతుంది. వాస్తవానికి స్పితి, లడఖ్, జంస్కర్ లకు వెళ్లే రహదారులు కలిసే మార్గం ఇది. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడి జనాభా చాలా తక్కువ. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతుంది. కనిష్టంగా -27 డిగ్రీలు నమోదు అవుతుంది. ఇక్కడ ఏడాది పొడవునా మంచు కురుస్తుంది.[6]
మూలాలు
మార్చు- ↑ "The Highest Lake in the World". Archived from the original on 2007-08-24. Retrieved 2021-07-31.
- ↑ Lakes
- ↑ Training Report on Feasibility Study of Existing Manali-Darcha Highway and Proposed Darcha-Padam Road Using Remote Sensing and GIS Techniques (pages 11-13) Archived 22 సెప్టెంబరు 2007 at the Wayback Machine
- ↑ Bajpai, S.C. (2002). Lahaul-Spiti: A Forbidden Land in the Himalayas. Indus Publishing. p. 130. ISBN 81-7387-113-2.
- ↑ Lahaul and Spiti District Archived 13 జూన్ 2010 at the Wayback Machine
- ↑ "Archived copy". Archived from the original on 13 జూలై 2006. Retrieved 13 నవంబరు 2008.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)