సూరజ్ భాన్ (1 అక్టోబర్ 1928 - 6 ఆగస్టు 2006) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంబాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.

సూరజ్ భాన్
సూరజ్ భాన్

సూరజ్ భాన్


జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్
పదవీ కాలం
2004 - 2006
తరువాత బూటా సింగ్

పదవీ కాలం
23 నవంబర్ 2000 – 7 మే 2003
ముందు విష్ణు కాంత్ శాస్త్రి
తరువాత విష్ణు సదాశివ్ కోక్జే

పదవీ కాలం
20 ఏప్రిల్ 1998 – 23 నవంబర్ 2000
ముందు మహ్మద్ షఫీ ఖురేషి (తాత్కాలిక)
తరువాత విష్ణు కాంత్ శాస్త్రి

బీహార్ గవర్నర్
(అదనపు బాధ్యత)
పదవీ కాలం
6 అక్టోబర్ 1999 – 23 నవంబర్ 1999
ముందు బి.ఎం. లాల్ (తాత్కాలిక)
తరువాత వీసీ పాండే

పదవీ కాలం
12 జులై 1996 – 4 డిసెంబర్ 1997
ముందు ఎస్. మల్లికార్జునయ్య
తరువాత పీఎం సయీద్

కేంద్ర వ్యవసాయ మంత్రి
పదవీ కాలం
16 మే 1996 – 1 జూన్ 1996
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు జగన్నాథ్ మిశ్రా
తరువాత హెచ్‌డి దేవెగౌడ

పదవీ కాలం
1967–1970;
1977–1979;
1979–1984;
1996–1997

హర్యానా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
1989–1990

రెవెన్యూ మంత్రి (హర్యానా)
పదవీ కాలం
1987–1989

వ్యక్తిగత వివరాలు

జననం (1928-10-01)1928 అక్టోబరు 1
యమునానగర్, బ్రిటిష్ ఇండియా
మరణం 2006 ఆగస్టు 6(2006-08-06) (వయసు 77)
ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

రాజకీయ జీవితం

మార్చు
  • సూరజ్ భాన్ భారతీయ జనసంఘ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు[1]
  • ఆయన 4వ (1967–1970), 6వ (1977–1979), 7వ (1979–1984) & 11వ లోక్‌సభ (1996–1997)లో హర్యానాలోని అంబాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
  • 1987లో హర్యానా శాసనసభకు ఎన్నికై దేవీలాల్ ప్రభుత్వంలో 1987 నుండి 1989 వరకు రెవెన్యూ మంత్రిగా పని చేశాడు.
  • దేవి లాల్ బిజెపి పార్టీతో పొత్తును తెంచుకున్న తరువాత ఆయన హర్యానా అసెంబ్లీలో 1989 నుండి 1990 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశాడు.
  • ఆయన 1984లో భారతీయ జనతా పార్టీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3]
  • ఆయన 1996లో వాజ్‌పేయి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు, ఆ తర్వాత 1996 నుండి 1997 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.
  • 1998 లోక్‌సభ ఎన్నికలలో ఓటమి అనంతరం ఉత్తరప్రదేశ్ (1998-2000), హిమాచల్ ప్రదేశ్ (2000-2003), బీహార్ (1999) రాష్ట్రాల గవర్నర్‌గా నియమితులయ్యాడు.[4]
  • 2002లో డాక్టర్ సూరజ్ భాన్ కూడా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి భైరోన్ సింగ్ షెకావత్ అభ్యర్థిత్వంపై బిజెపిలో పునరాలోచనలో పడిన తర్వాత భారత ఉపరాష్ట్రపతి పదవికి రేసులో చేరారు.[5]
  • ఫిబ్రవరి 2004లో జాతీయ షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.[6]

సూరజ్ భాన్ 78 ఏళ్ల వయసులో గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 2006 ఆగస్టు 6న గుండెపోటుతో మరణించాడు.[7]

మూలాలు

మార్చు
  1. Subhash Mishra (3 April 2000). "Family Face-Off". India Today. Retrieved 2021-11-01.
  2. "Biographical Sketch of Member of XI Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2022-07-01.
  3. "List of Ex State Presidents". BJPHaryana.org.
  4. Surendra Kishore (1999-11-17). "Bihar Governor sacks underage minister". Indian Express. Retrieved 2007-06-02.
  5. Yoginder Gupta (12 July 2002). "Suraj Bhan joins race for VP's post". The Tribune. Retrieved 1 November 2021.
  6. "SC/ST Commission Chairman Suraj Bhan dead". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-01.
  7. The Times of India (7 August 2006). "BJP leader Suraj Bhan dead". Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.