సూరిగాడు
సూరిగాడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1992 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా. ఇందులో సురేష్, యమున, దాసరి నారాయణరావు ముఖ్యపాత్రల్లో నటించారు. దాసరి ఇందులో టైటిల్ రోల్ పోషించాడు.[1] ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వం వహించాడు.
సూరిగాడు | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | శ్రీరాజ్ గిన్నె |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | సురేష్ , యమున దాసరి నారాయణరావు |
సంగీతం | సాలూరి వాసూరావు |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
చిన్నప్పటి నుంచి సర్వస్వాన్ని తన ఉన్నతి కోసం దారబోసిన తన తండ్రిని ఆపద కాలంలో కూడా ఆదుకోని కొడుకు మీద తండ్రి చేసిన న్యాయపోరాటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.
కథ
మార్చుఆఫీసర్స్ క్లబ్ లో వాచ్ మన్ గా పనిచేసే సూరికి ఒక్కడే కొడుకు. కొడుకు తనలాగా చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోకూడదని అతన్ని ఉన్నత చదువుల కోసం పెద్ద కళాశాలలో చేర్పిస్తాడు. అయితే అతను మాత్రం నాన్నను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ధనవంతుడి కొడుకుగా గొప్పలు చెప్పుకుంటూ ఒక ధనవంతుడి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. తల్లిదండ్రులను పెళ్ళికి పిలవడు. తల్లి వంటమనిషిగా, తండ్రి వాచ్ మన్ గా చేరినా వారిని పట్టించుకోడు. ఒకసారి సూరి భార్యకు జబ్బు చేస్తుంది. ఆమెకు వైద్యం చేయించడానికి నాలుగు లక్షలు అవసరమవుతాయి. చిన్నప్పటి నుంచీ తన సంపదనంతా అతనికే దారపోసిన సూరి కొడుకు మీద కోర్టు కేసు వేసి ఆ డబ్బులు వసూలు చేసుకుని భార్య చికిత్స కోసం విదేశాలకు వెళతాడు.
నటవర్గం
మార్చు- సూరిగా దాసరి నారాయణరావు
- సురేష్, సూరి కొడుకు
- యమున, సూరి కోడలు
- సుజాత, సూరి భార్య
- గొల్లపూడి మారుతీరావు, సూరి వియ్యంకుడు
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- కాంతా రావు
- జె.వి. సోమయాజులు
- సారథి
- రాళ్లపల్లి
- జయలలిత
- సికంఠల
సాంకేతికవర్గం
మార్చు- సంభాషణలు: శ్రీరాజ్ గిన్నె
- ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
ఈ మూవీ కి పురష్కారాలు అలంకారం కాదు, పురష్కారాలకే ఈ మూవీ అలంకారం.
మార్చుసంగీతం
మార్చుఈ చిత్రానికి సాలూరి వాసూరావు సంగీతం అందించాడు.
మూలాలు
మార్చు- ↑ "నాన్నతనానికి నిలువెత్తు నిదర్శనం - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-12.[permanent dead link]