శ్రీరాజ్ గిన్నె

సినీ రచయిత, కథా రచయిత

శ్రీరాజ్ గిన్న (ఆంగ్లం:Sriraj Ginne) (జ. 1946 నవంబరు 22), భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమలో సంభాషణా రచయిత. ఆయన స్క్రిప్ట్ రాసిన చిత్రాలలో ముఖ్యమైనవి కలికాలం, సూరిగాడు, ప్రేమిస్తే. ఆయన తెలుగు టెలివిజన్ సీరియళ్ళు కూడా రాస్తుంటారు. వాతిలో స్నేహ ముఖ్యమైనది. ఆయన లఘు కథలు, నాటకాలు, లఘు నాటకాలు, అనువాదాలు చేస్తూంటారు.

శ్రీరాజ్ గిన్నె
జననం(1946-11-22)1946 నవంబరు 22
క్రియాశీల సంవత్సరాలు1991 present
జీవిత భాగస్వామిగిన్నె పార్వతి దేవి
తల్లిదండ్రులురాజలింగం & శేషమ్మ
వెబ్‌సైటుhttp://www.srirajonline.com

నేపధ్యం

మార్చు

శ్రీరాజ్ లఘు కథా రచయితగా పసిద్ధుడు. ఆయన సుమారు 100 కథలు వ్రాసాడు. అందుకో కొన్ని ఆంగ్లం, కన్నడం, ఒరియా, హిందీ భాషల్లోఅనువాదమైనాయి. కొన్ని ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. ఆయన రాసిన "కాలధర్మం" అనే నాటకం బెంగళూరులో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభలలో ప్రదర్శించబడింది. ఆయన 15 నాటకాలు, 25 లఘు నాటకాలు రచించారు. యివి ఆకాశవాణి, స్నేహ టెలివిజన్ లలో ప్రసారమైనాయి. ఆయన 15 తెలుగు సినిమాలకు సంభాషణలు రాసాడు. వాటిలో "కలికాలం", "సూరిగాడు" (1993లో ఇండియన్ పనోరమలో ఉత్తమ చిత్రంగా ర్యాండు పొందబడినది అంరియు అదే సంవత్సరం చైనా ఫిల్ం ఫెస్ట్ లో ఎంపికైనది), "ప్రేమించు" (2001లో బంగారు నంది పురస్కారం పొందినది), "రాజేశ్వరి కళ్యాణం", "అక్కా బాగున్నావా" ముఖ్యమైనవి.

చిత్రాలు

మార్చు

రచయితగా

మార్చు
  • కలికాలం : 1991 మే 30 - కథ
  • సూరిగాడు : 1992 ఏప్రిల్ 17 - డైలాగులు, కథ
  • కలిగాలం (తంకిళం) : మే 1992 -కథ
  • అత్తకు కొడుకు మామకు అల్లుడు : 1993 జనవరి 9
  • మామా కోడళ్ళు : 02.04.1993
  • అప్పలీ మనసా (మరాఠీ) : జూన్ 1993
  • కుంకుమ భాగ్య (కన్నడ) :అక్టోబరు 1993
  • సంతాన్ (హిందీ) : 1993 నవంబరు 12 - కథ
  • పోలీస్ అఫీసర్ (తమిళ డబ్బింగ్) : జూలై 1993
  • వాచ్‌మన్ వడివేలి (తమిళం) : 1994 జూలై 24
  • వెన్నెల (తెలుగు) : మే 1994
  • ఆంటీ చోరీ తోంటీ కట్టె (ఒరియా) : డిసెబరు 1993
  • కలికాల్ (బెంగాళీ) : 1993
  • తపస్సు (తెలుగు) : 1995 ఫిబ్రవరి 2
  • అక్కా బాగున్నావా? : సెప్టెంబరు 1997
  • స్పీడ్ డాన్సర్ (తెలుగు) : 1999 జూన్ 17
  • రాజేశ్వరి కళ్యాణం (తెలుగు)  : 1995
  • ప్రేమించు : 2001 ఏప్రిల్ 11 -కథ
  • మాజీ ఆయీ (మరాఠీ) : 2008

టెలివిజన్

మార్చు
  • స్నేహ (13 ఎపిసోడ్ల సీరియల్) - ఈటీవీ 1995 ఆగస్టు 29 నుండి 1995 నవంబరు 28
  • రాగం మారిన పాట (ఒకే ఎపిసోడ్)
  • మందాకిని (ఒకే ఎపిసోడ్)

పుస్తకాలు

మార్చు
  • లంచం (నాటకం)
  • ఒక్క క్షనం (లఘు కథల పోటీ)
  • చుక్కలసీమ (లఘు కథ)
  • కాలధర్మం (నాటకం)
  • వెలుగు వాక్గిలోకి (Anthology of Short Stories)

మూలాలు

మార్చు

ఆధారాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు