సూర్యాపేట పురపాలకసంఘం

సూర్యాపేట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] సూర్యాపేట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నల్గొండ లోకసభ నియోజకవర్గం లోని సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

సూర్యాపేట పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
సూర్యాపేట పురపాలకసంఘం is located in తెలంగాణ
సూర్యాపేట పురపాలకసంఘం
సూర్యాపేట పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°04′28″N 79°41′42″E / 17.0743063°N 79.6951103°E / 17.0743063; 79.6951103
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట
మండలం సూర్యాపేట
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ
 - వైస్ చైర్‌పర్సన్‌ పుట్ట కిషోర్
వైశాల్యము
 - మొత్తం 35 km² (13.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,05,250
 - పురుషుల సంఖ్య 52,134
 - స్త్రీల సంఖ్య 53,112
పిన్ కోడ్ - 508213
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్రసవరించు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న సూర్యాపేట, 1952లో గ్రేడ్ -3 పురపాలక సంఘంగా ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత 1984లో గ్రేడ్ -2, 1998 నవంబరు 7న గ్రేడ్ -1 పురపాలక సంఘంగా మార్చబడింది.[1]

భౌగోళికంసవరించు

సూర్యాపేట 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°07′52″N 79°37′59″E / 17.131°N 79.633°E / 17.131; 79.633 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 132 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 105250 మంది కాగా, అందులో 52134 మంది పురుషులు, 53112 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 34 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలనసవరించు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 48 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పెరుమాళ్ళ అన్నపూర్ణ చైర్‌పర్సన్‌గా, పుట్ట కిషోర్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లుసవరించు

 1. కొండపల్లి భద్రమ్మ
 2. సలిగంటి సరిత
 3. వేములకొండ పద్మ
 4. మామిడి గుర్వయ్య
 5. దరావత్ రవకుమార్
 6. జాటోతు లక్ష్మీ
 7. షేక్ బాషామియా
 8. దరావత్ నీలాబాయి
 9. కుంభం రేణుక
 10. నెల్లుట్ల సోమలక్ష్మీ
 11. పెరుమాళ్ళ అన్నపూర్ణ (చైర్‌పర్సన్‌)
 12. వడ్డేపల్లి రాజ్యలక్ష్మీ
 13. ఎడ్ల గంగాభవాని
 14. బచ్చలకూరి శ్రీనివాస్
 15. పట్టే రేణుక
 16. ఎగిళ్ళ సుమీలరెడ్డి
 17. ఎలిమినేటి అభినయ్
 18. వెలుగు వెంకన్న
 19. చింతలపాటి భరత్
 20. మాలోతు కమల
 21. సుంకరి అరుణ
 22. అన్నపర్తి రాజేష్
 23. పోలగాని కవిత
 24. పుట్ట కిషోర్ (వైస్ చైర్‌పర్సన్‌)
 25. వల్ధాస్ సౌమ్య
 26. బత్తుల లక్ష్మీ
 27. ఆకుల కవిత
 28. నిమ్మల శ్రవంతి
 29. చిలిగల్ల లక్ష్మీకాంతమ్మ
 30. రాపత్తి శ్రీనివాస్
 31. అనంతుల యాదగిరి
 32. పల్స మహాలక్ష్మీ
 33. కొండపల్లి నిఖిల
 34. షేక్ జహీర్
 35. కుమ్మరికుంట్ల దేవిక
 36. మడిపెల్లి విక్రమ్
 37. జ్యోతి శ్రీవిద్య
 38. గండూరి ప్రవళిక
 39. బైరు శైలేందర్
 40. గండూరి రాధిక
 41. మొరిశెట్టి సుధారాణి
 42. షేక్ తాహేర్ పాష
 43. ఎం.డి. షఫిఉల్లా
 44. అంగిరేకుల రాజశ్రీ
 45. నామ అరుణ
 46. కెక్కిరేణి శ్రీనివాస్
 47. గండూరి పావని
 48. కట్కూరి కార్తీక్ రెడ్డి

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Suryapet Municipality". suryapetmunicipality.telangana.gov.in. Retrieved 6 April 2021.
 2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 6 April 2021.
 3. "Basic Information of Municipality, Suryapet Municipality". suryapetmunicipality.telangana.gov.in. Retrieved 6 April 2021.
 4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 6 April 2021.
 5. skannegari. "Suryapet Municipality - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 21 జనవరి 2021. Retrieved 6 April 2021.

వెలుపలి లంకెలుసవరించు