సూర్యాపేట మండలం
సూర్యాపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1] సూర్యాపేట, ఈ మండలానికి కేంద్రం. ఈ మండలంలో 3 నిర్జన గ్రామాలుతో కలిపి 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండలం కోడ్: 04638.[2] ఈ మండలం భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా నిర్వహించబడుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.
సూర్యాపేట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°09′05″N 79°37′13″E / 17.151487°N 79.620151°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట జిల్లా |
మండల కేంద్రం | సూర్యాపేట |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 219 km² (84.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,55,422 |
- పురుషులు | 77,072 |
- స్త్రీలు | 78,350 |
పిన్కోడ్ | 508213 |
నల్గొండ జిల్లా నుండి మార్పు
మార్చులోగడ సూర్యాపేట మండలం,నల్గొండ జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సూర్యాపేట మండలాన్ని,కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా పరిధిలోకి చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 219 చ.కి.మీ. కాగా, జనాభా 155,422. జనాభాలో పురుషులు 77,072 కాగా, స్త్రీల సంఖ్య 78,350. మండలంలో 38,012 గృహాలున్నాయి.[4]
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- బాలెంల
- రామన్నగూడ
- ఎర్కారం
- రామవరం
- రామచంద్రాపురం
- సోలిపేట్
- ఎండ్లపల్లి
- టేకుమట్ల
- పిన్నయ్యపాలెం
- పిల్లలమర్రి
- సూర్యాపేట
- ఇమాంపేట్
- కేశారం
- తాల్లఖమ్మంపాడు
- కె.టి.అన్నారం
- కాసారబాద్
- బి.మాదారం
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Suryapet Mandal Villages, Nalgonda, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-09-06. Retrieved 2020-06-21.
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.