సెస్ బుర్కే

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

సెసిల్ బర్క్ (1914, మార్చి 27 - 1997, ఆగస్టు 4) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆక్లాండ్ తరపున, ఒకసారి న్యూజీలాండ్ తరపున ఆడాడు.

సెస్ బర్క్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సెసిల్ బర్క్
పుట్టిన తేదీ(1914-03-27)1914 మార్చి 27
ఎల్లర్స్లీ, ఆక్లాండ్, న్యూజీలాండ్
మరణించిన తేదీ1997 ఆగస్టు 4(1997-08-04) (వయసు 83)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 35)1946 29 March - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 1 60
చేసిన పరుగులు 4 959
బ్యాటింగు సగటు 2.00 17.43
100లు/50లు 0/0 0/2
అత్యధిక స్కోరు 3 51*
వేసిన బంతులు 66 12757
వికెట్లు 2 200
బౌలింగు సగటు 15.00 25.99
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 2/30 6/23
క్యాచ్‌లు/స్టంపింగులు 0/- 31/-
మూలం: Cricinfo, 2017 1 April

జననం మార్చు

సెసిల్ బర్క్ 1914, మార్చి 27న న్యూజీలాండ్ లోని ఎల్లర్స్లీలో జన్మించాడు.

మరణం మార్చు

సెసిల్ బర్క్ 1997, ఆగస్టు 4న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్‌లో మరణించాడు.[1]

క్రికెట్ కెరీర్ మార్చు

లోయర్-ఆర్డర్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, లెగ్-బ్రేక్ - గూగ్లీ బౌలర్ గా రాణించాడు. 1937-38లో ఆక్లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత 1953-54 సీజన్ వరకు జట్టు కోసం క్రమం తప్పకుండా ఆడాడు. 1945-46లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు స్పెషలిస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఇందులో బర్క్ రెండు ఆస్ట్రేలియన్ వికెట్లు (బిల్ బ్రౌన్, కీత్ మిల్లర్) తీశాడు.

ఎంసిసి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో పర్యటించినప్పుడు 1946-47 సీజన్‌లో సింగిల్ టెస్ట్ మ్యాచ్‌కు 12వ వ్యక్తిగా ఉన్నాడు, 1949లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. 18 మ్యాచ్ లలో 29.83 సగటుతో డెర్బీషైర్‌పై 6–23తో సహా 54 వికెట్లు తీశాడు. కేవలం 171 పరుగులు మాత్రమే చేశాడు. పర్యటన సమయంలో తన చేతికి గాయం అయింది. దాంతో ఏ టెస్టుల్లోనూ ఆడలేదు.[2]

మూలాలు మార్చు

  1. Ces Burke at cricinfo.com
  2. McConnell, L., and Smith, I., (1993) The Shell New Zealand Cricket Encyclopedia, Auckland: Moa Beckett. p. 30. ISBN 1-86958-034-6

బాహ్య లింకులు మార్చు