సై 2004 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. నితిన్, జెనీలియా, శశాంక్ ప్రధాన పాత్రలు పోషించారు.[2]సై చిత్రానికీ కధ విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతం ఎం ఎం కీరవాణి అందించాడు.ఈ చిత్రం సెప్టెంబర్ 23 న విడుదల అయింది.

సై
దర్శకత్వంరాజమౌళి
రచనరత్నం (సంభాషణలు)
స్క్రీన్ ప్లేరాజమౌళి
కథకె. వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాతఎ. భారతి
తారాగణంనితిన్
జెనీలియా డిసౌజా
శశాంక్
ప్రదీప్ రావత్
ఛాయాగ్రహణంసెంథిల్ కుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్
పంపిణీదార్లుశ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్
విడుదల తేదీ
2004 సెప్టెంబరు 23 (2004-09-23)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్8 crore (equivalent to 24 crore or US$3.0 million in 2020)[1]
బాక్సాఫీసు12 crore (equivalent to 36 crore or US$4.5 million in 2020)(share)

కథ మార్చు

పృథ్వి, శశాంక్ హైదరాబాదులోని ఓ కళాశాలలో రెండు విద్యార్థి వర్గాలకు నాయకులు. ప్రతి విషయంలోనూ పోటీ పడుతూ ఒకరిని ఓడించడానికి ఒకరికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. వీళ్ళకి రగ్బీ ఆట అంటే ఇష్టం. ఒక రోజు లోకల్ మాఫియా డాన్ అయిన భిక్షు యాదవ్ వచ్చి ఆ కళాశాల స్థలాన్ని దాని వారసుల నుంచి కొన్నట్లుగా లీగల్ నోటీస్ చూపిస్తాడు. అప్పటి దాకా ఒకరంటే ఒకరికి పడని పృథ్వి, శశాంక్ కాలేజీ స్థలాన్ని కాపాడుకోవడానికి చేతులు కలుపుతారు. తమ స్థలాన్ని తమకు వదిలేయమని తమ తెలివి తేటలు ఉపయోహించి భిక్షు యాదవ్ ని నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు. ఇది సహించలేని భిక్షు యాదవ్ రగ్బీ ఆటలో తమను ఓడిస్తే స్థలాన్ని అలాగే వదిలేస్తానని సవాలు విసురుతాడు. పృథ్వి అతని బృందం కలిసి భిక్షు యాదవ్ ని ఓడించి ఎలా తమ కాలేజీని సొంతం చేసుకున్నారన్నది మిగతా కథ.

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.

  • చంటైనా బుజ్జైనా, రచన: చంద్రబోస్, గానం. కల్యాణి మాలిక్, స్మిత, వసుంధరా దాస్
  • గూట్లో ఉంది బెల్లం ముక్క, రచన: భువన చంద్ర , గానం. టిప్పు, మాలతి
  • నల్ల నల్లని కళ్ళ, రచన: శివశక్తి దత్త, ఎం ఎం కీరవాణి, కె ఎస్ చిత్ర
  • అప్పుడప్పుడు , రచన: ఎం ఎం కీరవాణి , గానం.లక్కీఆల్, సుమంగళి
  • గంగా ఏ సి , రచన: చంద్రబోస్, గానం.కల్యాణి మాలిక్, వసుంధరా దాస్
  • పంతం పంతం, రచన:చంద్రబోస్, గానం.దేవీశ్రీ ప్రసాద్, కీరవాణి, టిప్పు , చంద్రబోస్, కల్యాణి మాలిక్, స్మిత.

మూలాలు మార్చు

  1. http://www.idlebrain.com/movie/postmortem/chatrapati.html
  2. జి. వి., రమణ. "సై సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 19 November 2017.
  3. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=సై&oldid=4131588" నుండి వెలికితీశారు