ఎస్. ఎస్. రాజమౌళి

ప్రముఖ దర్శకుడు, నిర్మాత
(రాజమౌళి నుండి దారిమార్పు చెందింది)

ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత[1]. ఎన్.టి.ఆర్ (జూనియర్)తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.రాజమౌళి తీసిన బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్)సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.బాహుబలి (ది కంక్లూజన్) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్షరాలా1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.

ఎస్.ఎస్. రాజమౌళి
S. S. Rajamouli at the trailer launch of Baahubali.jpg
ముంబైలో జరిగిన బాహుబలి సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో ఎస్. ఎస్. రాజమౌళి
జననం(1973-10-10) 1973 అక్టోబరు 10 /1973,అక్టోబర్ 10
భారతదేశం రాయచూరు, కర్ణాటక, ఇండియా.
వృత్తిసినిమా దర్శకుడు,సినిమా నిర్మాత
వేతనందాదాపు చిత్రానికి 12 కోట్లు
జీవిత భాగస్వామిరమా రాజమౌళి.
పిల్లలుకార్తికేయ/మయూశ
వెబ్ సైటుss-rajamouli.com ss ఈగ సినిమా

రాజమౌళి చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం నటీనటులు విశేషాలు
2001 స్టూడెంట్ నంబర్ 1 జూనియర్ ఎన్.టి.ఆర్., గజాలా, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు
2003 సింహాద్రి జూనియర్ ఎన్.టి.ఆర్., భూమిక, అంకిత, నాజర్, ముఖేష్ రిషి
2004 సై నితిన్, జెనీలియా, శశాంక్, రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్
2005 ఛత్రపతి ప్రభాస్, శ్రియా, భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్
2006 విక్రమార్కుడు రవితేజ, అనుష్క శెట్టి, అజయ్, వినీత్ కుమార్, బ్రహ్మానందం
2007 యమదొంగ జూనియర్ ఎన్.టి.ఆర్., ప్రియమణి, మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం
2009 మగధీర రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్
2010 మర్యాద రామన్న సునీల్, సలోని, నాగినీడు, సుప్రీత్, వేణుగోపాల్
2011 రాజన్న అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ అన్నీ పోరాట సన్నివేశాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు
2012 ఈగ నాని, సమంత, సుదీప్ తమిళంలో నాన్ ఈ పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
2015 బాహుబలి :ది బిగినింగ్ ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా 2015 జూలై 10 విడుదలైనది
2017 బాహుబలి: ది కంక్లూషన్ ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా 2017 ఏప్రిల్ 28న విడుదలైంది
2019 ఆర్.ఆర్.ఆర్ జూ ఎన్టీఆర్,రాం చరణ్,

ఆలియా భట్, ఎడ్గార్‌ జోన్స్‌ ||నిర్మాణ దశలో ఉంది

పురస్కారాలుసవరించు

 • పద్మశ్రి
 • జాతీయ పురస్కారాలు
  • ఉత్తమ తెలుగు చిత్రం - ఈగ
  • జాతీయ ఉత్తమ చిత్రం - బాహుబలి: ది బిగినింగ్
 • నంది పురస్కారాలు
 • దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్
  • ఉత్తమ తెలుగు దర్శకుడు - మగధీర
 • సినీ"మా" అవార్డ్
  • ఉత్తమ దర్శకుడు -మగధీర
 • ఇతర అవార్డులు
  • స్టార్ వరల్డ్ ఇండియా - ఉత్తమ చిత్రం - ఈగ

మూలాలుసవరించు

 1. http://www.telugumoviesnow.com/2013/05/27/s-s-rajamouli-name-of-success-in-tollywood/

ఇతర లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.