కోటగిరి వెంకటేశ్వరరావు

సినిమా ఎడిటర్
(కోటగిరి వెంకటేశ్వర రావు నుండి దారిమార్పు చెందింది)

కోటగిరి వెంకటేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్. వీరి సోదరుడు కోటగిరి గోపాలరావు కూడా ఎడిటర్ గా పనిచేశారు.

కోటగిరి వెంకటేశ్వరరావు
వృత్తిఎడిటర్
మతంహిందూమతం
జీవిత భాగస్వామిసుజాత
పిల్లలు2 అమ్మాయిలు

జీవిత సంగ్రహంసవరించు

కోటగిరి వెంకటేశ్వరరావు గారి పూర్వీకులు జమీందారు దగ్గర దివాన్లుగా పనిచేశారు.[1] వీరికి ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు. అందరికన్నాకోటగిరి గోపాలరావు పెద్దవాడు. చిన్నతనంలోనే వీరి తండ్రిగారు మరణించడంతో అన్నగాగే ఇంటి బాధ్యతలను చూశారు. బ్రతుకు తెరువు కోసం మద్రాసు చేరి, జమిందారు గారి స్టుడియోలో ఆదుర్తి సుబ్బారావు లాంటి వారి సినిమాలకు ఎడిటింగ్ చేస్తుండేవారు.

చదువు మీద శ్రద్ధ తగ్గి పదవ తరగతి పాసైన తర్వాత వెంకటేశ్వరరావు కూడా మద్రాసు చేరి మొదట ఒక నిశ్చల పొటోగ్రాఫర్ దగ్గర సహాయకునిగా చేరాడు. తర్వాత ఎడిటింగ్ లో చేరి అన్నయ్య దగ్గర పనిలోని మెళుకువలు నేర్చుకున్నాడు. గోపాలరావు గారు అప్పుడు కె.రాఘవేంద్రరావు గారి అడవి రాముడు (1977) సినిమా కోసం పనిచేస్తుండగా తను కూడా రెండు పాటల్ని ఎడిట్ చేసి సహాయం చేశారు. ఇదే తన మొదటి సినిమాగా టైటిల్స్ లో చూపించారు.

తర్వాత రాఘవేంద్రరావు గారి సినిమాలతో పాటు, బి.గోపాల్, భారతీరాజా, ఎన్టీరామారావు మొదలైన ఎందరో సినీ దర్శకుల, నిర్మాతల చిత్రాలకు పనిచేశారు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా స్థిరపడక ముందు ఇతని దగ్గర ఒక సంవత్సర కాలం ఎడిటింగ్ నేర్చుకున్నారు.

వీరు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఆరు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించారు. ఈ సంస్థ కోసం విరాళాలు పోగుచేసి స్వంత ఆఫీసును నిర్మించారు.

వీరు సుజాతను పెళ్ళిచేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.

పురస్కారాలుసవరించు

నంది అవార్డులుసవరించు

చిత్ర సమాహారంసవరించు

మూలాలుసవరించు

  1. ఇది అన్నయ్య నేర్పిన విద్య, ఈనాడు ఆదివారం 20 నవంబర్ 2011 లో కోటగిరి వెంకటేశ్వరరావు పరిచయం.
  2. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". మూలం నుండి 22 నవంబర్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 19 March 2020. Cite news requires |newspaper= (help)
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. మూలం నుండి 24 February 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 February 2020.
  4. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". మూలం నుండి 6 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 6 March 2020. Cite news requires |newspaper= (help)
  5. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. మూలం నుండి 6 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 6 March 2020. Cite news requires |newspaper= (help)

బయటి లింకులుసవరించు