జెనీలియా

సినీ నటి
(జెనీలియా డిసౌజా నుండి దారిమార్పు చెందింది)

జెనీలియా (పుట్టిన తేది: 1987 ఆగస్టు 5) ఒక భారతీయ సినీ నటి. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈమె అమ్మ జినెట్, నాన్న నీల్ కలిపి జెనీలియా అని పేరుపెట్టారట.

జెనీలియా

జన్మ నామంజెనీలియా డి`సూజా
జననం (1987-08-05) 1987 ఆగస్టు 5 (వయసు 36)[1]
ముంబై, భారత్
ఇతర పేర్లు జీనూ, హరిణి, జీన్
క్రియాశీలక సంవత్సరాలు 2003—ప్రస్తుతం
భార్య/భర్త రితేష్ దేశ్‌ముఖ్
ప్రముఖ పాత్రలు బాయ్స్ సినిమాలో హరిణి పాత్ర (తమిళ్, తెలుగు భాషల్లో)
బొమ్మరిల్లులో హాసిని
Filmfare Awards
తెలుగు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి అవార్డు
2006 బొమ్మరిల్లు

ఈమె అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తన మొదటి ఫిలిం ఫేర్ అవార్డుని (ఉత్తమ నటి: బొమ్మరిల్లు) వారి సమక్షంలోనే తీసుకోవటం విశేషం. ఈమె తుజే మేరి కసం అనే హిందీ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది.

2020, ఆగస్టు నెల ప్రారంభంలో తాను కరోనా వ్యాధి బారిన పడినట్లు జెనీలియా ప్రకటించారు. అయితే పరీక్షల్లో నెగిటివ్ ఫలితం వచ్చిందని ఆమె వెల్లడించారు. కరోనా వ్యాధి బారిన పడినవాడు దృఢంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.

జెనీలియా నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చలనచిత్రం పాత్ర భాష సహనటులు ఇతరాలు
2003 తుఝే మేరీ కసమ్ అంజు హిందీ రితేష్ దేశ్‌ముఖ్ నువ్వే కావాలి అనే తెలుగు చిత్రం యొక్క పునర్నిర్మాణం
బాయ్స్ హరిణి తమిళం సిద్ధార్థ నారాయణ్, భరత్ తెలుగులోకి అనువాదం చేయబడింది.
సత్యం అంకిత తెలుగు చైతన్య
2004 మస్తీ బిందియా హిందీ అజయ్ దేవ్‌గన్, వివేక్ ఓబరాయ్, రితేష్ దేశ్‌ముఖ్
సాంబ సంధ్య తెలుగు జూనియర్ ఎన్టీఆర్, భూమికా చావ్లా
2005 నా అల్లుడు గగన తెలుగు జూనియర్ ఎన్టీఆర్, శ్రీయా శరణ్ తమిళంలోకి మధురై మప్పిలైగా అనువాదం చేయబడింది.
సచిన్ (సినిమా) షాలిని తమిళం విజయ్, బిపాషా బసు, లిండా అర్సెనియో
సుభాష్ చంద్రబోస్ అనిత తెలుగు వెంకటేష్, శ్రీయా శరణ్
సై ఇందు తెలుగు నితిన్, శశాంక్ తమిళంలోకి కజుగుగా, మలయాళంలోకి 'ఛాలెంజ్' గా అనువాదం చేయబడింది.
2006 హ్యాపీ మధుమతి తెలుగు అల్లు అర్జున్, మనోజ్ బాజ్‌పాయ్ మలయాళంలోకి హ్యాపీగా అనువాదం చేయబడింది.
రామ్ లక్ష్మి తెలుగు నితిన్, హ్రిషితా భట్
బొమ్మరిల్లు హాసిని తెలుగు సిద్ధార్థ్ నారాయణ్, నేహా బేంబ్ 'విజేత':తెలుగు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి అవార్డు
'విజేత':సంతోషం ఉత్తమనటి అవార్డు
'విజేత': నంది న్స్పెషల్ జూరీ అవార్డు
చెన్నై కాదల్ నర్మద తమిళం బరత్
2007 ఢీ పూజా తెలుగు విష్ణు వర్థన్ బాబు
2008 మిష్టర్ మేధావి శ్వేత తెలుగు రాజా
సత్య ఇన్ లవ్ వేద కన్నడం శివరాజ్ కుమార్
సంతోష్ సుబ్రమణ్యం హాసిని తమిళం జయం రవి తీయబడుతుంది
రెడీ పూజ తెలుగు రామ్
జానే తూ యా జానే నా అదితి హిందీ ఇమ్రాన్ ఖాన్
2008 ఆరెంజ్ తెలుగు రామ్ చరణ్ తేజ
2012 నా ఇష్టం (2012 సినిమా) కృష్ణవేణి తెలుగు దగ్గుబాటి రానా
2022 వేద్ శ్రావణి జాదవ్ మరాఠి రితేష్ దేశ్‌ముఖ్

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జెనీలియా&oldid=3947465" నుండి వెలికితీశారు