సోడ గోలీసోడ 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై చక్రసిద్ధ్ సమర్పణలో భువనగిరి సత్య సింధూజ నిర్మించిన ఈ సినిమాకు మల్లూరి హరిబాబు దర్శకత్వం వహించాడు. మానస్, నిత్య నరేష్, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ ఆడియోను 5 అక్టోబర్ 2017న విడుదల చేసి,[1] సినిమాను 2018 ఫిబ్రవరి 16న విడుదల చేశారు.[2]

సోడ గోలీసోడ
దర్శకత్వంమల్లూరి హరిబాబు
నిర్మాతభువనగిరి సత్య సింధూజ
తారాగణంమానస్, నిత్య నరేష్, కారుణ్య చౌదరి
ఛాయాగ్రహణంభరత్ మధుసూదనాన్
కూర్పునందమూరి హరి
సంగీతంముజీర్ మాలిక్
నిర్మాణ
సంస్థ
ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
2018 ఫిబ్రవరి 16 (2018-02-16)
సినిమా నిడివి
143 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

పేర్వారం గ్రామం నుండి శ్రీను (మానస్), రూప ( నిత్యా నరేష్)ను ప్రేమిస్తాడు. హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చి అబద్దం చెప్పి తన దగ్గర డబ్బుందని దర్శకుడు కొరటాల వినాయక్ (అలీ)ని నమ్మించి అతని సినిమాలో హీరోగా అవుతాడు. కానీ సినిమా సగం పూర్తయ్యే సరికి శ్రీను తమని మోసం చేశాడని అందరికీ తెలుస్తుంది. అసలు శ్రీను ఎవరు, ఎందుకు హీరో అవ్వాలనుకున్నాడు, దర్శకుడు కొరటాల వినాయక్ ను ఎందుకు మోసం చేశాడు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: ఎస్.బి ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత: భువనగిరి సత్య సింధూజ
  • సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: మల్లూరి హరిబాబు
  • సంగీతం: ముజీర్ మాలిక్
  • సినిమాటోగ్రఫీ: భరత్ మధుసూదనాన్
  • ఎడిటర్ : నందమూరి హరి
  • కొరియోగ్రఫీ: అమ్మ రాజశేఖర్, కపిల్
  • పాటలు: రెహ్మాన్

మూలాలు సవరించు

  1. CineJosh (7 October 2017). "Soda Goli Soda Movie Audio Launch 'సోడా..గోళీసోడా' తాగుతూ వినండి హాయ్ గా!". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  2. The Times of India (16 February 2018). "Soda Goli Soda Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  3. Filmybuzz (16 February 2018). "Soda Goli Soda Review" (in ఇంగ్లీష్). Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.