హైపర్ ఆది తెలుగు సినిమా నటుడు, స్క్రిప్ట్‌ రైటర్‌, జబర్దస్త్ కమెడియన్. ఆయన అసలు పేరు కోట ఆదయ్య. హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]

హైపర్ ఆది
జననం
కోట ఆదయ్య [1]

1990
వృత్తినటుడు , స్క్రిప్ట్‌ రైటర్‌
క్రియాశీల సంవత్సరాలు2004 నుండి ప్రస్తుతం

జననం, విద్యాభాస్యంసవరించు

హైపర్ ఆది 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా , చీమకుర్తి లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన బి.టెక్ పూర్తి చేశాడు.

సినీ జీవితంసవరించు

హైపర్ ఆది బి.టెక్ పూర్తి చేశాక కొంతకాలం సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేసి నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆయన జబర్దస్త్ షో లో స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేసి, అదిరే అభి టీంలో నటుడిగా పరిచయమై, జబర్దస్త్ లో టీమ్‌కు లీడర్‌గా ఎదిగాడు.[3] హైపర్ ఆది 2017లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.

నటించిన సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర పేరు ఇతర విషయాలు
2017 రారండోయ్ వేడుక చూద్దాం
మేడ మీద అబ్బాయి బండ్ల బాబ్జి డైలాగ్ రచయిత
2018 తొలిప్రేమ రాజు
సోడ గోలీసోడ
ఆటగదరా శివ ఆది
సవ్యసాచి పద్మనాభం
2019 మిస్టర్ మజ్ను పుల్ల రావు
చిత్రలహరి అజయ్
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు మహేష్
వెంకీ మామ సీతారామ్
2020 అల వైకుంఠపురములో రంగరాజు
2021 30 రోజుల్లో ప్రేమించటం ఎలా
క్రాక్ కానిస్టేబుల్
నాట్యం
2022 భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ పాటలో

మూలాలుసవరించు

  1. Alitho Saradaga | Hyper Aadhi,Varshini | 26th October 2020 | ETV Telugu (in ఇంగ్లీష్), retrieved 2021-05-10
  2. The Hindu (31 January 2019). "From TV to films: Telugu actor Hyper Aadhi shares his journey" (in ఇంగ్లీష్). Archived from the original on 23 సెప్టెంబర్ 2021. Retrieved 23 September 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. The Times of India (27 August 2019). "Jabardasth: Here's why Hyper Aadi and his team was missing from the show - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 23 సెప్టెంబర్ 2021. Retrieved 23 September 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హైపర్_ఆది&oldid=3474735" నుండి వెలికితీశారు