సోనారీ

అస్సాం రాష్ట్రంలోని చరైడియో జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం.

సోనారీ, అస్సాం రాష్ట్రంలోని చరాయిదేవ్ జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం. 2015, ఆగస్టు 15న చరాయిదేవ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది.

సోనారీ
పట్టణం
సోనారీ is located in Assam
సోనారీ
సోనారీ
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
సోనారీ is located in India
సోనారీ
సోనారీ
సోనారీ (India)
Coordinates: 27°04′N 95°02′E / 27.07°N 95.03°E / 27.07; 95.03
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాచరాయిదేవ్
Government
 • Bodyసోనారీ పురపాలక సంఘం
Elevation
97 మీ (318 అ.)
జనాభా
 (2001)
 • Total17,430
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
785690
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్ 33

భౌగోళికం

మార్చు

సోనారీ పట్టణం 27°04′N 95°02′E / 27.07°N 95.03°E / 27.07; 95.03 అక్షాంక్షరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 97 మీటర్ల (318 అడుగుల) ఎత్తులో ఉంది. అహోమ్ రాజులు నిర్మించిన 500 సంవత్సరాల పురాతన "ధోదర్ అలీ" లో ఇదీ ఒక ప్రధాన పట్టణం. సోనారీ పట్టణం తౌకాక్ నది ప్రక్కన ఉంది. ఈ పట్టణానికి సుమారు 3 కి.మీ.ల దూరంలోని చారిత్రక దిసాంగ్ నది ఒడ్డున భోజో రైల్వే స్టేషను ఉంది. రహదారి మార్గం ద్వారా శివసాగర్ పట్టణం నుండి ధోదర్ అలీ మీదుగా ఈ పట్టణానికి చేరుకోవచ్చు. దీనికి సమీపంలోనే చరాయిదేవ్ అహోం రాజుల సమాధి ఉంది. సోనారీ పట్టణం టీ, కలప పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉంది.

చరిత్ర

మార్చు

సోనారీ అసలు పేరు సోనాపూర్. మణిరామ్ దేవాన్ ఏర్పాటు చేసిన మొదటి రెండు టీ ఎస్టేట్లలో ఒకటైన టీ రీసెర్చ్ అసోసియేషన్ టోక్లాయ్ ప్రయోగాత్మక స్టేషనును డాక్టర్ ప్రదీప్ బారువా కనుగొన్నాడు. 1845లో సోనారీలోని సఫ్రీ సమీపంలో జోర్హాట్, సెంగ్లంగ్ టిఇ వద్ద దేవన్ సిన్నమారా టిఇని స్థాపించారు.[2] మణిరామ్ దేవాన్ మొదటి భారతీయ వాణిజ్య టీ ప్లాంటర్.[3] ఈ పట్టణం మధ్యలో బోర్ పుఖూరి అనే చారిత్రాత్మక అహోం కింగ్డమ్ ట్యాంక్ చుట్టూ ఒక ఉద్యానవనం ఉంది.[4] అహోం కాలంలోని అస్సాం జనరల్ విగ్రహం ఇక్కడ నిర్మించబడినందున, పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఈ పార్కును లచిత్ నగర్ పార్కు అని పిలుస్తున్నారు. తవ్కాక్ నది వంతెన సమీపంలో కోచ్ జనరల్ చిలరాయ్ విగ్రహాం ఏర్పాటుచేయబడింది. 2004లో గీతికావి పార్వతి ప్రసాద్ బారువ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని సోనారీ వద్ద ఏర్పాటుచేశారు.

జనాభా

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] సోనారి పట్టణంలో 17,430 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 55% మంది, స్త్రీలు 45% మంది ఉన్నారు. సోనారీ సగటు అక్షరాస్యత రేటు 92% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీ అక్షరాస్యత 72% గా ఉంది. ఈ జనాభాలో 12% మంది, 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. Falling Rain Genomics, Inc – Sonari. Fallingrain.com. Retrieved on 2020-12-21.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2020-12-21.
  3. The Assam Tribune Online Archived 2016-04-19 at the Wayback Machine. Assamtribune.com (2014-01-08). Retrieved on 2020-12-21.
  4. "Archived copy". Archived from the original on 2012-11-19. Retrieved 2020-12-21.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-12-21.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సోనారీ&oldid=3989782" నుండి వెలికితీశారు