సోనాల్ మోంటెరో
సోనాల్ మోంటెరో భారతీయ సినిమా నటి.[2] ఆమె అనేక కోస్టల్‌వుడ్, శాండల్‌వుడ్ సినిమాల్లో నటించింది.
సోనాల్ మోంటెరో | |
---|---|
జననం | |
జాతీయత | బారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014 - ప్రస్తుతం |
జీవితం తొలి దశలో
మార్చుఆమె మంగళూరులోని సెయింట్ ఆగ్నెస్ కాలేజీలో చదివింది. ఆ సమయంలో, ఆమె మోడలింగ్ పరిశ్రమలో అడుగుపెట్టి మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2013, మిస్ కొంకణ్ 2015 టైటిల్స్ గెలుచుకుంది. ఆమె మొదట "అంజియా సర్ఖేన్ చేదున్" కొంకణి మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. ఇది 2013 సంవత్సరంలో యూట్యూబ్ లో విడుదలై తీర ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందింది.[3]
కెరీర్
మార్చు2015లో, ఆమె తుళు చిత్రం ఎక్క సకలో కథానాయికగా తొలిసారిగా నటించింది. ఆమె జై తులునాడులో ఆధునిక అమ్మాయి పాత్రను పోషించింది. ఆ తరువాత రొమాంటిక్ కామెడీ పిలిబైల్ యమునక్కలో ప్రధాన పాత్రను పోషించింది. శాండల్‌వుడ్ లో ఆమె నటించిన అభిసారికే, ఎంఎల్ఏ చిత్రాలు 2018లో విడుదలైయ్యాయి.[4] ఆమె బాలీవుడ్ చిత్రం సాజన్ చలే ససురాల్ 2కి సంతకం చేసింది.[5] ఆమె నటిస్తున్న శాండల్‌వుడ్ చిత్రాలు గాలిపాట 2, బుద్దివంత 2 నిర్మాణ దశలో ఉన్నాయి. పంచతంత్ర, రాబర్ట్ (2021) లలో కూడా ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది.[6]
2022లో, ఆమె నటించిన బనారస్ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది.[7][8]
తన నటనా వృత్తితో పాటు, సోనాల్ స్టేజ్ షోలలో, వీడియో ఆల్బమ్ లలోనూ పాల్గొంటుంది,[9] అందాల పోటీలకు జ్యూరీలో ఉంది. అంతేకాకుండా, ఆమె ఫ్యాషన్ ఏబిసీడి అనే ఫ్యాషన్ ఈవెంట్ అండ్ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీకి డైరెక్టర్ కూడా.
గుర్తింపు
మార్చుఅభిసారికే (2018) చిత్రానికిగాను ఆమె ఉత్తమ మహిళా నూతన నటిగా సైమా అవార్డు - కన్నడకు నామినేట్ చేయబడింది.
మూలాలు
మార్చు- ↑ "Sonal Monterio gets her big break with a Yogaraj Bhat film". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 26 April 2022.
- ↑ "Sonal Monteiro joins B-Town, but will not leave her roots".
- ↑ "Anjea Sarkhen Chedun !!!!!! FULL VERSION....HD" – via YouTube.
- ↑ "Tulu actor Sonal is Pratham's leading lady in his next, MLA - Times of India". The Times of India. Retrieved 30 April 2018.
- ↑ "Mangaluru: Pilibail star Sonal steps into Sandalwood". Retrieved 30 April 2018.
- ↑ "My dream to work with Yogaraj Bhat has come true - Times of India". The Times of India. Retrieved 30 April 2018.
- ↑ Prajasakti (27 September 2022). "పాన్ ఇండియా మూవీగా 'బనారస్'" (in ఇంగ్లీష్). Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ "Actress Sonal Monteiro HD Images, Photos and Photoshoot". web.archive.org. 2023-10-13. Archived from the original on 2023-10-13. Retrieved 2023-10-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sonal turns singer for 'Pilibail Yamunakka'". Retrieved 30 April 2018.