సోనా హైడెన్
సోనా హైడెన్ (ఆంగ్లం: Sona Heiden) భారతీయ నటి, చిత్ర నిర్మాత. ఆమె వ్యాపారవేత్త కూడా. ఆమె తమిళ చిత్రాలతో పాటు మలయాళం, తెలుగు చిత్రాలలో నటిస్తుంది.
సోనా హైడెన్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి, వ్యాపారవేత్త, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
ఆమె 2002లో "మిస్ తమిళనాడు" టైటిల్ గెలుచుకుంది. ఆమెకు చెన్నైలో యూనికోడ్ పేరుతో మహిళల బట్టల దుకాణం ఉంది.[1] 2008లో, తమిళ చిత్రం కుసేలన్‌లో నటించింది.[2] ఆమెకు ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. 2010లో, ఆమె శ్రీపతి రంగసామి దర్శకత్వంలో కనిమొళి(Kanimozhi) చిత్రం నర్మించింది. ఇందులో జై, షాజాన్ పదమ్సీ, విజయ్ వసంత్ తదితరులు తారాగణం. ఆమె భారతీయ జనతా పార్టీ మద్దతుదారు.
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఆమె 1979 జూన్ 1న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి పోర్చుగీస్, ఫ్రెంచ్ సంతతికి చెందినవాడు. కాగా ఆమె తల్లి శ్రీలంకకు చెందిన తమిళురాలు. చెన్నైలోని రింగ్‌రోడ్ మొనాస్టరీ స్కూల్‌లో ఆమె చదువు ప్రారంభించింది. అన్నామలై యూనివర్సిటీ నుంచి బిజినెస్ లో డిగ్రీని పొందింది. ఆ తర్వాత మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి కాస్ట్యూమ్ డిజైన్‌లో అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ పొందింది. ఆమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు.
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమా
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాషాచిత్రం | నోట్స్ |
2001 | పూవెల్లం అన్ వాసం | అనిత | తమిళం | |
షాజహాన్ | సుజాత | తమిళం | ||
2003 | ఆయుధం | తెలుగు | ||
వీడే | తెలుగు | ప్రత్యేక ప్రదర్శన | ||
విలన్ | తెలుగు | |||
2004 | ఆంధ్రావాలా | తెలుగు | ||
2005 | పొన్ మెగలై | ఉమా | తమిళం | |
2006 | శివప్పతిగారు | తమిళం | ప్రత్యేక ప్రదర్శన | |
2007 | కెల్వికూరి | దివ్య | తమిళం | |
మిరుగం | సావిత్రి | తమిళం | ||
2008 | రౌద్రం | సుభద్ర | మలయాళం | |
స్వర్ణం | ఆచిపెన్ను | మలయాళం | అతిథి పాత్ర | |
పాతు పాతు | మోహిని | తమిళం | ||
కుసేలన్ | సోనా | తమిళం | ||
కథానాయకుడు | సోనా | తెలుగు | ||
పార్థన్ కండ పరలోకం | పూంకోడి | మలయాళం | ||
2009 | నమ్యజమన్రు | కన్నడ | ||
వేనల్ మరణం | ముత్తులక్ష్మి | మలయాళం | ||
గురు ఎన్ ఆలు | సుగుణ | తమిళం | ||
నారి | మలయాళం | |||
అజఘర్ మలై | తమిళం | అతిథి పాత్ర | ||
2011 | కో | రేష్మా కొఠారి | తమిళం | |
2012 | ఒంబాధుల గురువు | కుముదు టీచర్ | తమిళం | |
కర్మయోధ | సెలీనా మేడమ్ | మలయాళం | ||
2013 | సొక్కలి | తమిళం | ||
మిజి | సుశీల | మలయాళం | ||
వీరచోజన్ | తమిళం | |||
కథయల్లితు జీవితం | మలయాళం | |||
2014 | యామిరుక్క బయమే | ఆమెనే | తమిళం | అతిధి పాత్ర |
నినైవిల్ నిండ్రావల్ | తమిళం | |||
ఆమయుం ముయలుం | పంజవర్ణం | మలయాళం | ||
2015 | అమర్ అక్బర్ ఆంటోనీ | ఉష | మలయాళం | |
రొంభ నల్లవన్ దా నీ | కౌన్సలర్ | తమిళం | ||
ఎల్లం చెట్టంటే ఇష్టం పోలే | వసుంధర | మలయాళం | ||
2016 | జితన్ 2 | తమిళం | ||
ఒప్పం | సర్దార్జీ భార్య | మలయాళం | ||
విరుమండికుం శివానందికిం | తమిళం | |||
2017 | బ్రహ్మ.కామ్ | వనంగముడి భార్య | తమిళం | |
2018 | ఓడు రాజా ఓడు | మైథిల్లి | తమిళం | |
జానీ | రాముని భార్య | తమిళం | ||
నా కథ | డాన్స్ మాస్టర్ | మలయాళం | ||
2019 | విళంబరం | తమిళం | ప్రత్యేక ప్రదర్శన | |
ఇసక్కింటే చరిత్ర | డోలీ | మలయాళం | ||
పూవల్లియుం కుంజదుం | సునంద మనోహర్ | మలయాళం | ||
2020 | పచ్చ మంగా | సుజాత | మలయాళం | |
2021 | పరమపదం విలయత్తు | మణిమొళి | తమిళం | |
చేజింగ్ | సోనా | తమిళం | ||
సిగప్పు మనితరగళ్ | తమిళం |
టెలివిజన్
మార్చుసంవత్సరం | ధారావాహిక | పాత్ర | భాష | టీ వీ ఛానల్ |
---|---|---|---|---|
2021 | సిల్లును ఒరు కాదల్ | ఆమెనే | తమిళం | కలర్స్ తమిళ్ |
2021–2022 | అభి టైలర్ | నీలాంబరి | ||
2022 | రోజా | సన్ టీవీ | ||
2022–2023[3] | మారి | తారా | జీ తమిళ్ |
మూలాలు
మార్చు- ↑ http://chennaionline.com/cityfeature/Trends/Jan09/01story77.aspx
- ↑ "காப்பகப்படுத்தப்பட்ட நகல்". Archived from the original on 2013-07-03. Retrieved 2021-03-03.
- ↑ "Tamil actors Sona Heiden and Mukesh Kanna quit TV show 'Maari'". The Times of India. 2023-05-02. ISSN 0971-8257. Retrieved 2023-05-30.