సోనియా మన్

ఉత్తర ప్రదేశ్ కు చెందిన సినిమా నటి, మోడల్.

సోనియా మన్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన సినిమా నటి, మోడల్. సినిమాలు, మ్యూజిక్ వీడియోలలో నటించింది.[1] 2012లో హైడ్ ఎన్ సీక్ అనే మలయాళ సినిమాలో తొలిసారిగా నటించింది.[2]

సోనియా మన్
సోనియా మన్ (2014)
జననం (1986-09-10) 1986 సెప్టెంబరు 10 (వయసు 38)
హల్ద్వానీ, ఉత్తర ప్రదేశ్
వృత్తినటి, మోడల్

జననం, విద్య

మార్చు

సోనియా మన్ 1986, సెప్టెంబరు 10న ఉత్తర ప్రదేశ్ లోని హల్ద్వానీలో బల్దేవ్ సింగ్ మన్ - పరంజిత్ కౌర్ దంపతులకు జన్మించింది. వామపక్ష నేతగా ఉన్న బల్దేవ్ సింగ్ మన్, 1986 సెప్టెంబరు 26న తన 16రోజుల కుమార్తెను చూసేందుకు వెళుతున్న సమయంలో అమృత్‌సర్‌లో మిలిటెంట్ల చేతిలో హతమయ్యాడు.[3] సోనియా అమృత్‌సర్‌ పట్టణంలో పెరిగింది.[4] హోలీ హార్ట్ ప్రెసిడెన్సీ స్కూల్ నుండి స్కూల్ విద్యను, అమృత్‌సర్‌లోని బిబికె డిఏవి కాలేజ్ ఫర్ ఉమెన్ లో తన కళాశాల విద్యను పూర్తిచేసింది.[4]

సినిమారంగం

మార్చు

2013లో టీన్స్ అనే మలయాళ సినిమాలో,[5] హానీ అనే పంజాబీ సినిమాలో నటించింది.[6] 2014లో వచ్చిన బడే చంజీ నే మేరే యార్ కమీనీ అనే పంజాబీ సినిమాలో నటించింది.[7] 2014లోనే కహిన్ హై మేరా ప్యార్ అనే హిందీ సినిమాలో కూడా నటించింది.[8] 2015లో ఢీ అంటే ఢీ అనే తెలుగు సినిమాలో,[9] 2016లో 25 కిల్లే, మోటార్ మిత్రన్ ది అనే పంజాబీ సినిమాల్లో[10] నటించింది.

2017లో హృదయాంతర్ అనే మరాఠీ సినిమాలో అతిధి పాత్రలో,[11] డాక్టర్ చక్రవర్తి అనే తెలుగు సినిమాలో,[12] 2020 జనవరి 31న విడుదలైన హ్యాపీ హార్డీ అండ్ హీర్‌ అనే హిందీ సినిమాలో కూడా నటించింది.[13]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2012 మైడ్ ఎన్ సీక్ మలయాళం
2013 టీన్స్ లేఖ మలయాళం
2013 హానీ ప్రీత్ పంజాబీ
2014 బడే చంగీ నే మేరే యార్ కమినే కామిని పంజాబీ
2014 కహిన్ హై మేరా ప్యార్ ప్రియ/శాంతి హిందీ తొలి హిందీ చిత్రం
2015 ఢీ అంటే ఢీ లక్ష్మీ ప్రసన్న తెలుగు
2016 25 కిల్లే సోనియా మాన్ పంజాబీ
2016 మోటార్ మిత్రన్ డి ప్రీత్ పంజాబీ
2017 హృదయాంతర్ సోనియా మరాఠీ అతిధి పాత్ర
2017 డా. చక్రవర్తి సోనియా తెలుగు
2020 హ్యాపీ హార్డీ అండ్ హీర్ హీర్ రాంధావా హిందీ

మూలాలు

మార్చు
  1. "Sonia Mann is happier doing Punjabi videos". The Times of India. 13 December 2018. Retrieved 2022-04-25.
  2. "Divyadarshan was my biggest support: Sonia Mann". The Times of India. 26 May 2012. Retrieved 2022-04-25.
  3. "Actor Sonia Mann writes emotional letter to her late father". The Times of India. 24 September 2019. Retrieved 2022-04-25.
  4. 4.0 4.1 "Here Are Some Interesting Facts About Punjabi Actress Turned Model Sonia Maan". Ghaint Punjab. 18 July 2018. Archived from the original on 2019-12-07. Retrieved 2022-04-25.
  5. "Punjabi actresses who found fame in the South Indian film industry as well!". in.com. 7 March 2019. Archived from the original on 7 December 2019. Retrieved 2022-04-25.
  6. "Harbhajan visits city with 'Haani' cast". Hindustan Times. 1 September 2013. Retrieved 2022-04-25.
  7. "25 Kille's Sonia Mann In An Unbelievably Weird Photoshoot!". Ghaint Punjab. 23 May 2016. Archived from the original on 2019-12-07. Retrieved 2022-04-25.
  8. "Clean sweep". The Tribune. 31 December 2017. Retrieved 2022-04-25.[permanent dead link]
  9. "D Ante D". The Times of India. Retrieved 2022-04-25.
  10. "25 Kille". The Times of India. Retrieved 2022-04-25.
  11. "Punjabi actor Sonia Mann to pair with Hrithik Roshan?". The Times of India. 6 March 2018. Retrieved 2022-04-25.
  12. "Dr Chakravarthy". The Times of India. 13 July 2017. Retrieved 2022-04-25.
  13. "Happy Hardy and Heer: Himesh Reshammiya's musical drama postponed, to now release on 31 January, 2020". Firstpost. 6 December 2019. Retrieved 2022-04-25.