సోనీపత్
సోనీపత్ హర్యానా రాష్ట్రంలో నగరం. సోనీపత్ జిల్లా ముఖ్య పట్టణం. నగర పరిపాలన మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఇది జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోకి వస్తుంది. సోనీపత్ ఢిల్లీ నుండి 44 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి నైఋతి దిశలో 214 కి.మీ. దూరాన ఉంది. నగరానికి తూర్పు సరిహద్దున యమునా నది ప్రవహిస్తోంది.
సోనీపత్
సోనేపత్ | |
---|---|
Coordinates: 28°59′24″N 77°01′19″E / 28.990°N 77.022°E | |
దేశం | India |
రాష్ట్రం | హర్యాణా |
జిల్లా | సోనీపత్ |
Elevation | 224.15 మీ (735.40 అ.) |
జనాభా | |
• City | 2,78,149 |
• Urban | 2,89,333 |
భాషలు[3][4] | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5.30 |
PIN | 131001 |
టెలిఫోన్ కోడ్ | +91-130 |
లింగ నిష్పత్తి | 1.19 ♂/♀ |
1972 డిసెంబరు 22 న, సోనీపత్ ముఖ్య పట్టణంగా సోనీపత్ జిల్లా ఏర్పడింది. ఢిల్లీ-కల్కా మార్గంలో సోనీపత్ ప్రధానమైన రైల్వే కూడలి. ఢిల్లీ వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (NE II), గ్రాండ్ ట్రంక్ రోడ్ (NH 44) లు సోనీపత్ గుండా పోతాయి. ప్రతిపాదిత ఢిల్లీ-సోనీపత్-పానిపట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కూడా సోనీపత్ గుండా పోతుంది. ఢిల్లీ మెట్రో పొడిగింపు సోనీపత్ గుండా పోతుంది.
పేరు వ్యుత్పత్తి
మార్చుపురాణాల ప్రకారం, సోనీపత్‌ను ఇంతకు ముందు సోన్‌ప్రస్థ అని, స్వర్ణప్రస్థ అనీ పిలిచేవారు.[5][6] తరువాత, స్వర్ణప్రస్థ అనే పేరు స్వర్ణపథ్ గా, తరువాత దాని ప్రస్తుత రూపమైన సోనీపత్ గా మారింది.[7]
చరిత్ర
మార్చునగరం గురించిన ప్రస్తావన మహాభారతంలో స్వర్ణప్రస్థ పేరుతో ఉంది. హస్తినాపుర రాజ్యానికి బదులుగా పాండవులు కోరిన ఐదు ప్రస్థాలలో స్వర్ణప్రస్థ నగరం ఒకటి. మిగిలిన నాలుగు పట్టణాలు పానప్రస్థం (పానిపట్ ), బాఘప్రస్థం (బాగ్‌పత్), తిలప్రస్థం (ఫరీదాబాద్), ఇంద్రప్రస్థం (ఢిల్లీ).[8]
ఋతుపవనాల కాలంలో తయారుచేసే తీపి వంటకం ఘేవార్‌కు సోనీపత్ ప్రసిద్ధి గాంచింది.
శీతోష్ణస్థితి
మార్చుశీతోష్ణస్థితి డేటా - Sonipat | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 21 (70) |
24 (75) |
30 (86) |
37 (99) |
40 (104) |
38 (100) |
35 (95) |
34 (93) |
34 (93) |
33 (91) |
28 (82) |
22 (72) |
31 (88) |
సగటు అల్ప °C (°F) | 8 (46) |
11 (52) |
16 (61) |
22 (72) |
27 (81) |
28 (82) |
28 (82) |
27 (81) |
26 (79) |
21 (70) |
14 (57) |
9 (48) |
20 (68) |
సగటు వర్షపాతం mm (inches) | 19.7 (0.78) |
24.6 (0.97) |
24.6 (0.97) |
10.1 (0.40) |
40.7 (1.60) |
96.9 (3.81) |
190 (7.5) |
201 (7.9) |
134.3 (5.29) |
12 (0.5) |
4 (0.2) |
10 (0.4) |
767.9 (30.32) |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 66 | 58 | 47 | 32 | 35 | 53 | 68 | 71 | 66 | 55 | 51 | 63 | 55 |
Source: http://www.myweather2.com [9] |
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనగణన ప్రకారం, సోనీపత్ నగర మొత్తం జనాభా 2,78,149. వారిలో 1,48,364 మంది పురుషులు, 1,29,785 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 32,333 మంది. సోనీపత్‌లో అక్షరాస్యత 2,10,112 (జనాభాలో 75.5%). పురుష అక్షరాస్యత 79.7% స్త్రీ అక్షరాస్యత 70.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 42,013. 2011 లో సోనీపత్‌లో 55,599 నివాస గృహాలు ఉన్నాయి.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Sonipat". www.censusindia.gov.in. Retrieved 11 January 2020.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Census2011UA
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. p. 24. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 23 జూన్ 2019.
- ↑ IANS (28 January 2010). "Haryana grants second language status to Punjabi". Hindustan Times. Retrieved 23 June 2019.
- ↑ Gupta, Ramesh Chandra (1985). Urban geography of Delhi-Shahadra (in ఇంగ్లీష్). Bhavna Prakashan.
- ↑ Kauśika, Rs̥hi Jaiminī; Baruā, Jaiminī Kauśika (1967). Maiṃ apane Māravāṛī samāja ko pyāra karatā hūm̐ (in హిందీ). Jaiminī-Prakāśana.
- ↑ Sharma, Chandrapal (1 September 2017). भारतीय संस्कृति और मूल अंकों के स्वर : अंक चक्र : Bhartiya Sanskriti aur Mool Anko ke Swar Ank Chakra (in హిందీ). Diamond Pocket Books Pvt Ltd. ISBN 9789352784875.
- ↑ Gupta, Ramesh Chandra (1985). Urban geography of Delhi-Shahadra (in ఇంగ్లీష్). Bhavna Prakashan. p. 29.
- ↑ "January Climate History for Sonipat | Local | India".