సోమా భరత్ కుమార్

సోమా భరత్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 నవంబర్ 07న తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌డీడీసీఓఎఫ్‌ఎల్‌) చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]

సోమా భరత్ కుమార్

తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌
పదవీ కాలం
2022 నవంబర్ 07 - ప్రస్తుతం
ముందు లోక భూమా రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1960
వర్ధమానుకోట, నాగారం మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
సంతానం 2

జననం, విద్యాభాస్యం

మార్చు

సోమా భరత్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, వర్ధమానుకోట గ్రామంలో జన్మించాడు. ఆయన ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కన్నాభిరాం వద్ద జూనియర్‌ లాయర్‌గా పని చేసి అనంతరం న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

సోమా భరత్‌కుమార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘం ఎన్నికల్లో పీడీఎస్‌యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసుల పాలైన ఎంతో మంది ఉద్యమకారులకు ఉచిత న్యాయ సేవలు, పార్టీకి కూడా న్యాయ సలహాలు ఇచ్చాడు. ఆయన తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా నియమితుడయ్యే ముందు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. సోమా భరత్‌కుమార్‌ నవంబర్ 10న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[4]

మూలాలు

మార్చు
  1. T News Telugu (7 November 2022). "టీఎస్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా సోమా భరత్‌కుమార్‌ - T News Telugu". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  2. Nava Telangana (8 November 2022). "టీఎస్‌డీడీసీఓఎఫ్‌ఎల్‌ చైర్మెన్‌గా సోమా భరత్‌కుమార్‌". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. Namasthe Telangana (8 November 2022). "మరో ఉద్యమ నేతకు కార్పొరేషన్‌ పదవి". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. Namasthe Telangana (10 November 2022). "డెయిరీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా సోమా భరత్‌ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.