సౌమ్యా రెడ్డి
సౌమ్యారెడ్డి కర్ణాటక చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జయనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2023లో జరిగిన ఎన్నికల్లో 16 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది.[2]
సౌమ్యా రెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం జూన్ 2018 – 13 మే 2023 | |||
ముందు | బి.ఎన్. విజయ కుమార్ | ||
---|---|---|---|
తరువాత | సి.కే. రామమూర్తి | ||
నియోజకవర్గం | జయనగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | అభిషేక్ రాజే[1] |
సౌమ్య రెడ్డి కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె.[3]
రాజకీయ జీవితం
మార్చుసౌమ్యారెడ్డి తన తండ్రి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2016లో కర్ణాటక ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, 2017లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా పని చేసి 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జయనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రహ్లద్ పై 2,887 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[4][5]
సౌమ్యారెడ్డి 2019లో జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైంది. ఆమె 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తిపై 160 ఓట్ల తేడాతో గెలిచినట్టు తొలుత అధికారులు ప్రకటించడంతో బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తి రీకౌంటింగ్ కు పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు రీకౌంటింగ్ లో 16 ఓట్ల తేడాతో రామమూర్తి గెలిచినట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సౌమ్య రెడ్డికి 57,781 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి సీకే రామమూర్తికి 57,797 ఓట్లు వచ్చాయి. 16 ఓట్ల తేడాతో సౌమ్య రెడ్డి ఓటమి పాలవ్వగా, అదే పేరుతో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధికి 320 ఓట్లు వచ్చాయి.[6]
సౌమ్యారెడ్డి 2024లో లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనుంది.[7]
మూలాలు
మార్చు- ↑ India Today (3 December 2015). "Karnataka Minister's daughter hosts eco-friendly, zero-waste, vegan wedding reception" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ Eenadu (15 May 2023). "ఫలితం తారుమారు.. సౌమ్యా కన్నీరు". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.
- ↑ "Father's reputation will help me win: Sowmya Reddy" (in ఇంగ్లీష్). 2 May 2018. Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ The Hindu (13 June 2018). "Sowmya Reddy wins Jayanagar for Congress" (in Indian English). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Indian Express (16 May 2023). "In the 16-vote Jayanagar win, the case of another Sowmya Reddy, another Ramamurthy" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ Eenadu (26 March 2024). "నాడు ఓడినా.. నేడు సత్తా చాటేదెలా?". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.