స్టీఫెన్ బూక్
స్టీఫెన్ లూయిస్ బూక్ (జననం 1951, సెప్టెంబరు 20) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 30 టెస్టులు, 14 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | స్టీఫెన్ లూయిస్ బూక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, న్యూజీలాండ్ | 1951 సెప్టెంబరు 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | Right-handed | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 140) | 1978 10 February - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1989 24 February - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 27) | 1978 15 July - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1987 27 October - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 8 April |
జననం, కుటుంబం
మార్చుస్టీఫెన్ లూయిస్ బూక్ 1951, సెప్టెంబరు 20న న్యూజీలాండ్ లో జన్మించాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ రిచర్డ్ బూక్ (బెర్ట్ సట్‌క్లిఫ్ జీవిత చరిత్ర రచయిత), అవార్డు గెలుచుకున్న నవలా రచయిత, స్క్రీన్ రైటర్ పౌలా బూక్ ఇతని సోదరులు.
దేశీయ క్రికెట్
మార్చుబూక్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ గా రాణించాడు. 600 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీసిన తక్కువ న్యూజీలాండ్ బౌలర్లలో ఒకడు.[1] 1985లో వెల్లింగ్‌టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ తర్వాత టెస్ట్ క్రికెట్‌కు సంబంధించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యధికంగా 9వ స్థానానికి చేరుకున్నాడు.[2]
అంతర్జాతీయ కెరీర్
మార్చు1978 ఫిబ్రవరిలో వెల్లింగ్‌టన్‌లో ఇంగ్లాండ్‌పై న్యూజీలాండ్ తొలి టెస్టు విజయంతో బూక్ తన తొలి టెస్ట్ అరంగేట్రం చేశాడు. కొన్ని నెలల తర్వాత ఇంగ్లాండ్‌లో తన మొదటి విదేశీ పర్యటన చేసాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 28 ఓవర్ల స్పెల్‌లో 18 మెయిడిన్లు, 2 వికెట్ల తీసి కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
1979/80లో, డ్యునెడిన్‌లోని కారిస్‌బ్రూక్‌లో క్లైవ్ లాయిడ్ వెస్ట్ ఇండియన్స్‌తో జరిగిన మొదటి టెస్టు ముగింపులో, న్యూజీలాండ్ 9 వికెట్లకు 100 పరుగులతో క్రీజులో ఉన్న బూక్ గ్యారీ ట్రూప్ తో చేరాడు. మ్యాచ్ గెలవడానికి మరో నాలుగు పరుగులు అవసరముండగా, ఇద్దరు టెయిల్ ఎండర్లు బ్లాక్ క్యాప్స్‌ను వెస్టిండీస్‌పై మొదటి టెస్ట్ విజయాన్ని అందించారు.[3]
1983-84లో న్యూజీలాండ్ ఇంగ్లాండ్‌పై వారి మొట్టమొదటి సిరీస్‌ను గెలుచుకుంది. క్రైస్ట్‌చర్చ్‌లో బూక్ 37 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు.[4]
1984-85లో నియాజ్ స్టేడియంలో పాకిస్థాన్‌పై 87 పరుగులకు 7 వికెట్లు తీసి తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు.[5]
1985-86లో, ఆస్ట్రేలియాపై బ్లాక్ క్యాప్స్ మొదటి టెస్ట్ సిరీస్ విజయం సమయంలో, బూక్ బ్యాట్‌తో అరుదైన విజయాన్ని సాధించాడు. అతను ఎస్.సి.జి.లో జరిగిన రెండో టెస్టులో జాన్ బ్రేస్‌వెల్ (83 నాటౌట్)తో కలిసి న్యూజీలాండ్ రికార్డు పదో వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యంలో 37 పరుగులు అందించాడు.[6] న్యూజీలాండ్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
స్టీఫెన్ బూక్, 1989లో పాకిస్థాన్‌పై న్యూజీలాండ్ తరఫున బౌలింగ్ చేస్తున్నప్పుడు, ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చాడు. 70 ఓవర్లలో 10 మెయిడిన్లుతో 229 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీశాడు.[7][8] న్యూజీలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇదే అత్యంత ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలింగ్ గణాంకాలు.
క్రికెట్ తర్వాత జీవితం
మార్చు1991 నుండి 2016లో పదవీ విరమణ చేసే వరకు బూక్, అతని భార్య ఒక సూపర్ మార్కెట్ వ్యాపారాన్ని కలిగి ఉన్నారు.[9]
1992లో డునెడిన్ మేయర్ పదవి కోసం ఉన్నత స్థాయి ప్రచారాన్ని ప్రారంభించాడు. అయితే అందులో విజయం సాధించలేదు, కానీ దక్షిణ వార్డుకు నగర కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు.[10]
బూక్ 10 సంవత్సరాలపాటు న్యూజీలాండ్ క్రికెట్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు. 2012 నుండి 2016 వరకు న్యూజీలాండ్ క్రికెట్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఒటాగో స్పెషల్ ఒలింపిక్స్ ట్రస్ట్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు.[11]
గౌరవాలు
మార్చు2016 న్యూ ఇయర్ ఆనర్స్‌లో, క్రీడలు, సమాజానికి చేసిన సేవలకు న్యూజీలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అధికారిగా నియమితులయ్యాడు.[12]
మూలాలు
మార్చు- ↑ McConnell, Lynn (10 July 2003). "Cairns joins select group of bowlers in New Zealand history". ESPNcricinfo. Retrieved 28 August 2021.
- ↑ McConnell, Lynn (27 August 2003). "Richardson gets reward for his consistency". ESPNcricinfo. Retrieved 28 August 2021.
- ↑ "Full Scorecard of West Indies vs New Zealand 1st Test 1979/80 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-19.
- ↑ "Full Scorecard of New Zealand vs England 2nd Test 1983/84 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-19.
- ↑ "Full Scorecard of New Zealand vs Pakistan 2nd Test 1984/85 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-19.
- ↑ "Full Scorecard of New Zealand vs Australia 2nd Test 1985/86 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-05-19.
- ↑ "Records | Test matches | Bowling records | Most runs conceded in an innings | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2021-02-15.
- ↑ "Cricket: Boock loses top place in bowling's hall of shame". The New Zealand Herald (in New Zealand English). Retrieved 2021-02-15.
- ↑ "Meet The Trustees". White Matter Brain Cancer Trust. Archived from the original on 2021-02-08. Retrieved 2021-02-15.
- ↑ Topham-Kindley, Liane (12 October 1989). "Boock gains most votes". Otago Daily Times. p. 4.
- ↑ "Meet The Trustees". White Matter Brain Cancer Trust. Archived from the original on 2021-02-08. Retrieved 2021-02-15.
- ↑ "New Year honours list 2016". Department of the Prime Minister and Cabinet. 31 December 2015. Retrieved 16 January 2018.