స్టూవర్టుపురం దొంగలు

స్టూవర్టుపురం దొంగలు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం భానుచందర్ ,
లిస్సి
ఈశ్వరీరావు[1]
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ సాంబశివ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

దర్శక నిర్మాత సాగర్ 1986లో మావారి గోల సినిమా నిర్మించి అది ఘోర పరాజయం కావడంతో సినిమా నిర్మాణం నుంచి మూడేళ్ళపాటు దూరంగా ఉన్నారు. ఆయన మిత్రుడు జయసింహారెడ్డి - మొదటి రెండు సినిమాలు దర్శకునిగా యాక్షన్ జానర్ లో తీసి విజయం సాధించావు, ఇప్పుడు హాస్యాన్ని పట్టుకుని స్వీయనిర్మాణంలో తీయడం వల్ల నష్టపోయావు, మళ్ళీ దర్శకునిగా యాక్షన్ సినిమాలు తీయవచ్చు కదా అని సూచించారు. ఆయన మాటల స్ఫూర్తితోనే సాగర్ ఈ సినిమా నిర్మించారు.[2]

విడుదల, స్పందన

మార్చు

చిరంజీవి నటించిన స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ సినిమా విడుదలైన కొన్నాళ్ళకే ఈ సినిమా విడుదలైంది. దాదాపు ఒకేలా ఉన్న టైటిల్స్ వల్ల ఈ సినిమాని జనం గుర్తుపట్టక ఇబ్బందులు పడతారేమోనని అనుకున్నా సినిమాలోని విషయానికి సరిపడుతూండడంతో ఆ పేరే ఉంచేశారు. సినిమాను జనవరి 9, 1989న విడుదలైంది. మంచి ప్రేక్షకాదరణ పొంది విజయం సాధించింది.[2]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.
  2. 2.0 2.1 "మొదటి సినిమా-సాగర్, నవతరంగం వెబ్సైట్లో". Archived from the original on 2010-06-26. Retrieved 2015-08-21.