స్టూవర్టుపురం పోలీసుస్టేషన్

స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ 1991 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వం వహించాడు. చిరంజీవి, విజయశాంతి, నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ ప్రధాన విలన్‌గా నటించాడు.[1]

స్టూవర్టుపురం పోలీసుస్టేషన్
(1991 తెలుగు సినిమా)
Stuartpuram Police Station.jpg
దర్శకత్వం యండమూరి వీరేంద్రనాధ్
చిత్రానువాదం పరుచూరి సోదరులు
తారాగణం చిరంజీవి,
నీరోష,
విజయశాంతి
సంగీతం ఇళయరాజా
సంభాషణలు ఎం.వి.ఎస్.హరనాథరావు
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు వెళ్ళైస్వామి
నిర్మాణ సంస్థ క్రియెటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

కథసవరించు

ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ ( చిరంజీవి ) ను స్టూవర్టుపురం పోలీస్ స్టేషనులో పోస్టు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్ట్‌పురం, దోపిడీలు, దొంగతనాలు, రాజకీయ అవినీతితో అపఖ్యాతి పాలైన ప్రదేశం. గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించే పని రాణా ప్రతాప్ కు కేటాయించారు. రాణా ప్రతాప్ ఈ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడు. నగల దోపిడీ వెనుక సూత్రధారి అయిన మాఫియా నాయకుడిని ( శరత్ కుమార్ ) పట్టుకుంటాడు

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."జిందాబాద్"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:46
2."ఫెంటాస్టిక్"మనో, కె.ఎస్.చిత్ర5:27
3."బలేగా ఉంది"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:03
4."ఇద్దరతివల"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, ఎస్. జానకి5:12
5."చీకటంటే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:56
6."నీతోనే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:09

మూలాలుసవరించు

  1. "Wordsmith and a guru of gyaan". The Hindu. 6 June 2009. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 8 October 2012.