స్నేహితుడా
స్నేహితుడా ... సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇందులో నాని, మాధవీ లత నటించారు . ప్రసాద్ ఈ చిత్రాన్ని సత్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించాడు. శివరాం శంకర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2009 ఆగస్టు 7 న విడుదలైంది.
స్నేహితుడా (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బెల్లకొండ సత్యం |
---|---|
నిర్మాణం | ప్రసాద్ |
రచన | బెల్లకొండ సత్యం |
తారాగణం | నాని, బ్రహ్మానందం |
సంగీతం | శివరాం శంకర్ |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
విడుదల తేదీ | 7 ఆగష్టు 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుసాయి ( నాని ) అనాథ. డబ్బు కోసం అతను కోర్టులో దొంగ సాక్ష్యాలు చెబుతూ ఉంటాడు. నిరాశ్రయుడు కావడంతో రాత్రి వేళ అతను దొంగ లాగా ఇళ్లలో ఉంటాడు. ఒక రాత్రి అతను సావిత్రి ( మాధవి లత) ఉన్న భవనం లోకి వెళ్ళి అక్కడ ఆమెకు పట్టుబడతాడు. అతను ఆ రాత్రి తనను ఉండనివ్వమని ఆమెను వేడుకుంటాడు. ఆమె అతన్ని ఎగతాళి చేస్తుంది. అకస్మాత్తుగా ఆమె ఇంటి నుండి పారిపోతుంది. ఆ రాత్రి అతడు ఆమెను ఒక పార్కులో పట్టుకుంటాడు. తాను తప్పిపోయానని ఆమె అతనికి చెబుతుంది. ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోయిందని అతను భావిస్తాడు కోర్టులో తనతో పాటు అబద్ధపు సాక్ష్యాలు చెప్పమని ఆమెను తన భాగస్వామిగా చేర్చుకుంటాడు. చివరికి అతని దయ, సున్నితమైన స్వభావం వలన ఆమె అతన్ని ప్రేమిస్తుంది.
నాటకీయ పరిస్థితిలో ఆమె తన గురించి చెబుతుంది. ఆమె తన గ్రామంలో మంచి గౌరవనీయమైన భూస్వామి ( నాసర్ ) కుమార్తె. ఆమె తన స్నేహితులతో పర్యటించడానికి ఇష్టపడేది, కానీ ఆమె తండ్రి ఆమె కోరికను తిరస్కరించారు. సావిత్రి ఇంటి నుండి పారిపోతుంది. ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్న ముఠా ఆమెను కిడ్నాప్ చేస్తుంది. సాయి ఆమెకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఆమెపై కోపంగా ఉన్నతండ్రి, తన కుమార్తె చనిపోయిందని నిర్ణయించుకుంటాడు. ఆమె కథ విన్న తరువాత సాయి, ఆమెను తన కుటుంబంతో తిరిగి కలపాలని నిర్ణయించుకుంటాడు. అక్కడి నుండి ఇక సినిమా అంతా ఆ ప్రయత్నమే.
నటీనటులు
మార్చు- సాయిగా నాని
- సావిత్రిగా మాధవి లత
- శ్రీనివాసరావుగా నాసర్
- అపుర్వ
- బ్రహ్మానందం
- గుండు హనుమంతరావు
- ఎం.ఎస్.నారాయణ
- కిన్నెరా
- ప్రుద్వి రాజ్
- దువ్వాసి మోహన్
సవిూక్షలు
మార్చుఈ చిత్రం థ్రిల్లరుకు ఫ్యామిలీ డ్రామాకూ మధ్య చక్కటి గీతను గీసిందని దీపా గరిమెళ్ళ అభిప్రాయపడింది. మొదటి సగం "అందంగా వినోదాత్మకంగా ఉంది" అని ఆమె ప్రశంసించింది, కాని రెండవ సగం దాని "పాత క్లైమాక్స్"కు "జిగట డైలాగు" లతో అంత బాలేదు. మొత్తంమీద, ఆమె ఈ చిత్రానికి 4.5 / 10 రేటింగ్ ఇచ్చింది.[1]
మూలాలు
మార్చు- ↑ Garimella, Deepa. "Snehituda Review". fullhyd.com. LRR Technologies (Hyderabad). Retrieved 22 March 2013.