ప్రధాన మెనూను తెరువు

నాని (నటుడు)

తెలుగు సినీ నటుడు
(నాని నుండి దారిమార్పు చెందింది)

నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన ఈగ కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటనతో న్యాచురల్ స్టార్గా పిలవబడుతున్నాడు. 2015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. 2014 లో నాని నిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు. 2018 ఏప్రిల్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధంలో నటించాడు. కానీ అది సరి అయిన ఫలితం ఇవ్వలేదు. మా టీవీలో ప్రసారం అయిన బిగ్ బాస్ 2 కి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని.2018 లో కింగ్ నాగార్జున అక్కినేని గారితో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు.2019లో జెర్సీ సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

నాని
Nani at Aaha Kalyanam audio launch (cropped).jpg
2014 జనవరిలో "ఆహా కళ్యాణం" ఆడియో లాంచ్ లో నాని
జననంఘంటా నవీన్‍బాబు
(1984-02-24) 1984 ఫిబ్రవరి 24 (వయస్సు: 35  సంవత్సరాలు)
చల్లపల్లి,ఆంధ్రప్రదేశ్,భారతదేశం
నివాసంహైదరాబాద్,తెలంగాణ,భారతదేశం
వృత్తినటుడు,దర్శకుడు,రేడియో వ్యాఖ్యాత,నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు2008–ఇప్పటివరకు
జీవిత భాగస్వామియలవర్తి అంజనా (2012–ఇప్పటివరకు)
తల్లిదండ్రులుGanta Rambabu,Ganta Vijayalakshmi

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర సహనటు (లు) ఇతర విశేషాలు
2008 అష్టా చమ్మా మహేశ్,
రాంబాబు
కలర్స్ స్వాతి, శ్రీనివాస్, భార్గవి నాని మొదటి సినిమా
2009 రైడ్ అర్జున్ తనిష్, అక్ష, శ్వేత బసు ప్రసాద్
స్నేహితుడా సాయి మాధవీ లత
2010 భీమిలి కబడ్డి జట్టు సూరి శరణ్య మోహన్, కిషోర్, ధనరాజ్, తాగుబోతు రమేశ్
2011 అలా మొదలైంది గౌతం నిత్యా మీనన్, స్నేహా ఉల్లాల్, ఆశిష్ విద్యార్థి, తాగుబోతు రమేశ్
వెప్పం కార్తీక్ నిత్యా మీనన్, కార్తీక్ కుమార్, బిందు మాధవి తమిళ్ సినిమా,
తెలుగులో సెగ పేరుతో అనువదించబడింది
పిల్ల జమీందార్ ప్రవీణ్ జయరామరాజు హరిప్రియ, బిందు మాధవి, శ్రీనివాస్, రావు రమేశ్
2012 ఈగ నాని సమంత, సుదీప్ ద్విబాషా చిత్రం,
తమిళ్ లో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
ఎటో వెళ్ళిపోయింది మనసు వరుణ్ కృష్ణ సమంత
నీదానే ఎన్ పొన్వసంతం ట్రైన్ ప్రయాణికుడు అతిథి పాత్ర,
"ఎటో వెళ్ళిపోయింది మనసు" యొక్క తమిళ ఏకకాలనిర్మాణం,
ఇందులో జీవా వరుణ్ పాత్రను పోషించాడు
2013 ఢి ఫర్ దోపిడి చిత్ర సహ నిర్మాత కూడా నానీనే
2014 పైసా
2015 జెండా పై కపిరాజు అమలా పాల్
ఎవడే_సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాళవిక నాయర్,విజయ్ దేవరకొండ
భలే భలే మగాడివోయ్ లక్కరాజు/ లక్కీ లావణ్య త్రిపాఠి,మురళీ శర్మ
2016 కృష్ణగాడి వీరప్రేమ గాథ కృష్ణ మెహ్రీన్ పిర్జాదా
జెంటిల్_మేన్ గౌతమ్,జై(ద్విపాత్రభినయం) నివేదా థామస్
మజ్ను ఆదిత్యా
2017 నేను లోకల్ బాబు కీర్తీ సురేష్
నిన్ను కోరి ఉమా మహేశ్వర రావు నివేదా థామస్,ఆది పినిశెట్టి
2017 మిడిల్ క్లాసు అబ్బాయి నాని సాయిపల్లవి
2018 కృష్ణార్జున యుద్ధం కృష్ణ, అర్జున్ అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్
2018 దేవదాస్ దాసు రష్మీక

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు