మాధవీ లత ఒక సినిమా నటి. తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.[1]

మాధవీ లత
దస్త్రం:Actress Madhavi Latha.jpg
జననం
పసుపులేటి మాధవి

(1988-10-02) 1988 అక్టోబరు 2 (వయసు 36)
వృత్తినటి, ఎమ్.ఎల్.ఏ వెష్ట్ జోన్ గుంటూరు (బీ.జే.పి)
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

జీవిత విశేషాలు

మార్చు

మాధవీ లత కర్ణాటక లోని బళ్ళారిలో 1988, అక్టోబరు 2న జన్మించింది. బళ్ళారిలోనే ఎ. ఎస్. ఎం. మహిళా కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ చేసింది. తరువాత గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ చేసింది. కన్నడ కుటుంబంలో పుట్టినా తెలుగు, తమిళ భాషలు ధారాళంగా మాట్లాడగలదు.[2] మాధవీలత మొదట్లో చిన్న చిన్న పాత్రలో సినిమాల్లోకి అడుగుపెట్టి 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే (2008) సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమా విజయవంతం అయింది. తర్వాత నానీ సరసన ఆమె కథానాయికగా నటించిన స్నేహితుడా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత ఆమె ఒక సంవత్సరం పాటు యునైటెడ్ కింగ్‌డం లో గడిపింది. అచట కోవెంట్రీ విశ్వవిద్యాలయం నుండి ఫాషన్ డిసైనింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. తరువాత హైదరాబాదు వచ్చి తిరిగి సినిమా ప్రస్థనాన్ని కొనసాగించింది. ఆమె "అరవింద్ 2" (2013) లో నటనను తిరిగి కొనసాగించింది. ఆమె యొక్క విడుదల కాని చిత్రం "చూడాలని చెప్పాలని" లో ఆమె నందమూరి తారకరత్న తో నటించింది. ఆ సినిమాలో ఆమె మూగ, చెవుడు గల అమ్మాయిగా నటించింది.

ఆమె మొదటి సినిమా 2015 లో తమిళంలోని "సుందర్ సి". ఆమె తెలుగులో మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథి లో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి నటించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర భాష
2008 నచ్చావులే అను తెలుగు
2009 ష్... తెలుగు
2009 స్నేహితుడా సావిత్రి తెలుగు
2011 ఉసురు అనూష తెలుగు
2013 అరవింద్ 2 తెలుగు
2015 అంబాలా తమిళం
2015 చూడాలని చెప్పాలని తెలుగు
2015 తొలిపాట తెలుగు
2024 మూడో కన్ను

మూలాలు

మార్చు
  1. http://www.deccanchronicle.com/140925/entertainment-tollywood/article/madhavi-latha-bags-biggie
  2. "Exciting year for Madhavi Latha". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 28 April 2017.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మాధవీ_లత&oldid=4093086" నుండి వెలికితీశారు