స్పీడున్నోడు
స్పీడున్నోడు 2016 తెలుగు సినిమా. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడిగా ఇరవై ఏళ్లలో 11 సినిమాలు చేస్తే వాటిల్లో ఒకటి రెండు మినహా అన్నీ రెడీమేడ్ కథలే (రీమేక్ సినిమాలే). వాటితోనే విజయాలందుకున్నారు భీమినేని. అదేకోవలో 2012లో తమిళంలో వచ్చిన 'సుందరపాండియన్' సినిమాని 'స్పీడున్నోడు' పేరుతో తెరమీదికి తీసుకొచ్చారాయన.
స్పీడున్నోడు | |
---|---|
దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
స్క్రీన్ ప్లే | భీమినేని శ్రీనివాసరావు |
కథ | ఎస్.ఆర్. ప్రభాకరన్ |
దీనిపై ఆధారితం | సుందరపాండియన్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | విజయ్ ఉలగనాథ్ |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | శ్రీ వసంత్ |
నిర్మాణ సంస్థ | గుడ్‌విల్ సినిమా |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురాయలసీమలోని వెంకటాపురం గ్రామ ప్రజలు ఫ్యాక్షన్ వదిలేసి ఆడ, మగ బేధాలను పక్కన పెట్టి పిల్లలను చదివించాలనుకుంటారు. అయితే ఆ ఊరి అమ్మాయిలు ప్రేమలో పడ్డారు అని తెలిస్తే చాలు ప్రేమించిన అబ్బాయిని చంపేస్తారు. మరోవైపు పక్క ఊరిలో ఉండే శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్) ఫ్రెండ్ అంటే చాలు అతనికి అండగా నిలుస్తూ అలాంటి ఫ్రెండ్ కోసం ఎలాంటివారి బెండ్ తియ్యడానికైనా రెడీ అయిపోతాడు. ఆ క్రమంలో వెంకటాపురానికి చెందిన వాసంతి (సోనారిక)ని ప్రేమిస్తున్న ఇద్దరు స్నేహితుల సమస్య శోభన్ దగ్గరికి వస్తుంది. దాన్ని శోభన్ ఎలా పరిష్కరించాడు.. ఆ స్నేహితులు శోభన్ పట్ల ఎలా వ్యవహరించారు..? ఈ ప్రేమ వ్యవహారం తెలిసిన ఆ గ్రామస్థులు ఏం చేశారన్నదే మిగిలిన కథ.
స్నేహమే ప్రాణంగా భావించే యువకుడు తన స్నేహితుల చేతిలోనే మోసపోవడం అనేది ఈ సినిమాలోని ప్రధాన అంశం. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాకి తెలుగులో కొత్తగా చూపించడానికి దర్శకుడు తీవ్ర ప్రయత్నం చేశాడు. అయితే అది హీరోయిజాన్ని చూపించడం వరకే. పాత్రల చిత్రణ, వాటితో సాగాల్సిన కథనంపై కసరత్తు చేయడానికి ఈ మూడేళ్ళలో దర్శకుడికి సమయం దొరకలేదు కాబోలు. సినిమా మొత్తం బుల్లెట్ మీద యమ ‘స్పీడు’గా తిరిగే హీరో ఎంట్రీలో గుర్రం మీద వస్తాడు. భీమినేని వారు చేసిన నేటివిటీ మార్పులు ఈ రీతిన సాగాయి. సెల్ఫీ ఫైట్ ఎబ్బెట్టుగా ఉంది. టైటిల్స్ వేసేటపుడు ఫేస్‌బుక్‌ని వాడటం బ్యాక్ గ్రౌండ్ మార్చటానికే పరిమితం. పృధ్వీ, పోసాని, శ్రీనివాస రెడ్డి, అలీ లాంటి హాస్యనటులు ఉన్నా కామెడి కూడా అంతంతమాత్రమే.[1]
నటులు
మార్చుపాటలు
మార్చు- హాలీవుడ్ హీరో లెక్క, రచన : కరుణాకర్ అడిగర్ల , గానం.స్మిత , గీతా మాధురి
- ఆటకుందోయి, రచన: చంద్రబోస్, గానం.ఎల్.వి.రేవంత్ , శ్రావణ భార్గవి
- ఏ సునామీ అయిన , రచన: శ్రీమణి, గానం.ఎల్ . వి.రేవంత్
- గుర్రాన్ని చెరువుదాకా , రచన: అనంత్ శ్రీరామ్, గానం.అనుదీప్ దేవ్ , దామిని
- ఎల్లో ఎల్లో దర్టీ ఫెలో , రచన: చంద్రబోస్ ,,గానం.రాహుల్ సింప్లేగంజ్
- అమ్మాయిని అబ్బాయి చూడగానే, రచన: చంద్రబోస్, గానం. ఎల్. వి. రేవంత్
- రెక్కలతో చుక్కలకేగిరా , రచన: శ్రీమణి , గానం.ఎల్.వి.రేవంత్ , రమ్య బెహరా
- కసాయి కత్తి పదును, రచన: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి,గానం. ఎల్. వి. రేవంత్