స్వర్ణకమలాలు (పుస్తకం)
స్వర్ణకమలాలు ప్రముఖ రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి రచించిన కథల సంకలనం.[1] భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రిగా ఇల్లిందల సరస్వతీదేవిని ఈ కథాసంకలనం నిలిపింది. ఈ గ్రంథంలో వంద కథలున్నాయి. వాటిలో కొన్ని అంతకు ముందు "పండుగ బహుమానము", "అక్కరకు రాని చుట్టము", "ముత్యాలమనసు" అనే సంపుటాలలో ప్రచురింపబడ్డాయి. 1981లో వెలువడిన ఈ కథా సంకలనానికి ప్రముఖ రచయిత అమరేంద్ర "తొలి పలుకుల"ను అందించాడు. ఈ సంకలనంలోని అనేక కథలు హిందీ, కన్నడ, ఇతర భారతీయ భాషలలోనికి అనువదించబడ్డాయి.
స్వర్ణకమలాలు | |
కృతికర్త: | ఇల్లిందల సరస్వతీదేవి |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | శీలా వీర్రాజు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కథా సంకలనము |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | ఇల్లిందల సరస్వతీదేవి |
విడుదల: | 1981 |
కథల జాబితా
మార్చు- కొండ మల్లెలు
- చీకటిలో చెదరని మనిషి
- ఎదిగిన కొడుకు
- దగాపడ్డ డాక్టరమ్మ
- సప్తమ భావము
- తనదాకా వస్తేనే కాని
- శాంతించిన సముద్రం
- తండ్రి పోలిక
- సైకాలజీ
- పొద్దు వన్నెలు
- బహుమానము
- రజతోత్సవం
- మూగజీవులు
- సలహా
- గ్రహపాటు
- తారతమ్యము
- జీవితానికొక తోడు
- సహోదరులు
- డైరీ
- పరోక్షము - సమక్షము
- నడచిన బాట
- పునర్లబ్ధము
- కాగితప్పూలు
- ఉదరనిమిత్తం
- మెహ్తరాని
- మహోన్నతుడు
- అనాశ్వాసిత
- మనసులోని ఇజమ్
- వీడినమబ్బులు
- అసమర్థుడు
- ప్రత్యక్ష పరిచయం
- డోలారోహణ
- స్వాతంత్ర్య సిద్ధి
- పండుగ చీరె
- మాయా ముత్యాలు
- పితృ హృదయం
- నవ్వులాట
- అక్కరకు వచ్చిన చుట్టం
- పరిత్యక్తుడు
- పై మనిషి
- శలభాలు
- గళ్ళ లుంగీ
- ముత్యాల మనసు
- విజయ గర్వం
- వ్యాపారం
- కత్తిమీద సాము
- పచ్చ బంగీ
- వేమూరి వారి కోడలు
- కథ వెనుక దాగిన నిజం
- నాగరీకము
- కడసారి వాడు
- దొరలు
- కలిసి వీడిన జోడు
- స్వర్ణకమలాలు
పురస్కారాలు
మార్చు- 1982లో ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[2]
- 1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఈ పుస్తకాన్ని ఉత్తమ తెలుగు గ్రంథంగా ప్రకటించింది.
అభిప్రాయాలు
మార్చు- "స్వర్ణకమలాలు"లో వర్గభేదాన్ని కళ్ళకు కట్టించారు రచయిత్రి. వరకట్నం మూలంగా అవివాహితలుగా వుండి పోతున్న స్త్రీలని, వారి దయనీయ స్థితిని చూపించారు. స్త్రీలు విద్యా వంతులు, ఉద్యోగినులు అయినప్పుడే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె అనేక కథల్లో సూచించారు. - అజహరుద్దీన్ (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన తెలంగాణ రచనలు-సమగ్ర విశ్లేషణ అనే వ్యాసంలో)
- సరస్వతీదేవి గారి కథలు ఉన్నతాదర్శాలనూ ఉత్తమాభిరుచులనూ పెంపొందించే ఉదాత్త దృష్టితో తీర్చిదిద్దిన కథలు. ఈ కథల్లో ప్రధానంగా ఆకర్షించే విశేషం అపారమైన వస్తువైవిధ్యం, ఎన్నో తరాలవాళ్ళు, ఎన్నో తరహాల వాళ్ళు కళ్ళముందు మెదులుతారు. మూసలో పోసిన అచ్చులు కాక రక్తమాంసాలతో జీవించే నరనారీ జనాన్ని పాత్రలుగా మలచడంలో నైపుణ్యం కనబరిచారు. - అమరేంద్ర (స్వర్ణకమలాలు పుస్తకం తొలిపలుకులు లో)