హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోవున్న ఎయిర్ ఫోర్స్ స్టేషను.

హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోవున్న ఎయిర్ ఫోర్స్ స్టేషను.[1] భారతీయ వైమానిక దళం పరిధిలోవున్న ఈ ట్రైనింగ్ కమాండ్ ఫోర్స్ స్టేషను నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌కు ఉత్తరాన 8 కి.మీ.ల దూరంలో ఉంది. ఇందులో ఫైటర్ ట్రైనింగ్ వింగ్, హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్, నెం. 43 ఎక్విప్‌మెంట్ డిపో, అనుబంధ యూనిట్లు ఉన్నాయి.[2] తూర్పు-పడమర (09-27), 7,384 feet (2,251 m) పొడవు x 150 feet (46 m) వెడల్పుతో రన్‌వే ఉంది.

హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను
సంగ్రహం
విమానాశ్రయ రకంభారత వైమానిక దళం
కార్యనిర్వాహకత్వంట్రైనింగ్ కమాండ్, భారత వైమానిక దళం
సేవలుహైదరాబాదు
ప్రదేశంహకీంపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్, తెలంగాణ
ఎత్తు AMSL2,020 ft / 616 m
అక్షాంశరేఖాంశాలు17°19′52″N 78°18′46″E / 17.3312°N 78.3129°E / 17.3312; 78.3129
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
09/27 7,384 2,250 కాంక్రీటు/తారు

చరిత్ర మార్చు

రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ద్వారా రవాణా ఎయిర్‌ఫీల్డ్‌గా ఈ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను ఉపయోగించబడింది. భారత స్వాతంత్ర్యం తరువాత ఆపరేషన్ పోలో జరిగిన తరువాత హైదరాబాద్ నిజాం అధికారంలోకి రాలేదు. ఆ సమయంలో ఈ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను నిరుపయోగంగా ఉంది.[3] భారత వైమానిక దళంలోకి కొత్తగా నియమించబడిన పైలట్లకు ట్రైనింగ్ అందించడానికి 1951లో ఇందులో కన్వర్షన్ అండ్ ట్రైనింగ్ యూనిట్ ప్రారంభించబడింది. సిటియు ప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్ దశ ముగిసిన తర్వాత 1958లో జెట్ ట్రైనింగ్ వింగ్ గా పేరు మార్చబడింది. 1964, జూన్ లో నంబర్ 2 జెటిడబ్ల్యూ (బీదరులో ఉంది) లో విలీనం చేయబడింది, దీనిని ఫైటర్ ట్రైనింగ్ వింగ్‌గా పేరు మార్చారు. 1948, డిసెంబరులో ఇది 'ఎయిర్ ఫోర్స్ స్టేషన్' స్థాయికి ఎదిగింది. 2001లో ఇందులో స్టేషన్ మ్యూజియం స్థాపించబడింది.[4]

గుర్తింపులు మార్చు

1995లో హెలికాప్టర్ స్ట్రీమ్‌లో, 2016లో ఫైటర్ స్ట్రీమ్‌లో లేడీ పైలట్‌లకు ఫ్లైయింగ్ ట్రైనింగ్ ప్రారంభించారు. ఈ స్టేషన్ సిబ్బంది వివిధ సహాయ కార్యక్రమాలు, విపత్తు సహాయక చర్యలలో కూడా పాల్గొంటారు. ఇక్కడి సిబ్బంది అత్యుత్తమ పనితీరును గుర్తించి 2019లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు రంగులను ప్రదానం చేశాడు.[5]

మూలాల మార్చు

  1. "Air Marshal RD Mathur visits Hakimpet Air Force Station". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-24. Retrieved 2021-08-31.
  2. "Hakimpet AFS, Air Force Station Hakimpet". www.indiamapped.com. Retrieved 2021-08-31.
  3. Iskras in the IAF Service Archived 15 అక్టోబరు 2012 at the Wayback Machine భారత రక్షక్
  4. Hakimpet AFS Museum Archived 7 ఫిబ్రవరి 2012 at the Wayback Machine భారత రక్షక్
  5. Mar 4, Ch Sushil Rao / TNN /; 2019; Ist, 18:00. "Air Force Station, Hakimpet awarded Colours by President Ramnath Kovind | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-31. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)