హెచ్.వి.బాబు
హనుమప్ప విశ్వనాథ్ బాబు (1903-1968) 1930వ దశకములో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు 1903 మార్చి 27న బెంగుళూరులో జన్మించాడు. ఈయన వైద్యవిద్యను అభ్యసించాడు. ఈయన బావ హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసులో నటించాడు.
హెచ్.వి.బాబు బొంబాయిలో సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో హైదరాబాదులో అధ్యాపకునిగా ఉన్న హెచ్.ఎం.రెడ్డి అక్కడ ప్లేగు రావడంతో బొంబాయిలో ఉంటున్న బావమరిది దగ్గరికి వెళ్ళి ఉన్నాయి. హెచ్.వి.బాబు ప్రోద్భలంతో హెచ్.ఎం.రెడ్డి సినీరంగంలో ప్రవేశించాడు.[1]
హెచ్.వి. బాబు బొంబాయికి చెందిన కోహినూర్ ఫిల్ము కంపెనీ ద్వారా నటుడుగా చిత్రరంగంలో ప్రవేశించారు. తర్వాత తన బావగారైన హెచ్.ఎం.రెడ్డి ద్వారా ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో నటుడిగా, సహాయ దర్శకునిగా చేరారు. సినిమా ఆర్టిస్టుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సహనపరుడుగా ఆయనకు మంచి పేరుండేది. కన్నాంబ కథానాయకిగా అనేక పౌరాణిక చిత్రాలు తీశాడు.
చిత్ర సమాహారం
మార్చుమూలాలు
మార్చు- ↑ ASHISH RAJADHYAKSHA , PAUL WILLEMEN (1998). ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా (2 ed.). New Delhi: OXFORD UNIVERSITY PRESS. pp. 48–49. Retrieved 20 June 2021.
బయటి లింకులు
మార్చుఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హెచ్.వి.బాబు పేజీ