హనుమాన్ జంక్షన్ (సినిమా)

హనుమాన్ జంక్షన్ ఎం. రాజా దర్శకత్వంలో 2001 లో విడుదలైన తెలుగు చిత్రం.[2] ఇందులో అర్జున్, జగపతి బాబు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు.

హనుమాన్ జంక్షన్
దర్శకత్వంఎం. రాజా
రచనతోటపల్లి మధు (మాటలు)
ఎం. రాజా, మరుధూరి రాజా చిత్రానువాదం
నిర్మాతఎం. వి. లక్ష్మి
తారాగణంఅర్జున్,
జగపతి బాబు,
తొట్టెంపూడి వేణు,
లయ (నటి),
స్నేహ
ఛాయాగ్రహణంరాంప్రసాద్
కూర్పుఎం. బాబ్జీ, ఎడిటర్ మోహన్ (పర్యవేక్షణ)
సంగీతంసురేష్ పీటర్స్
నిర్మాణ
సంస్థ
ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్
విడుదల తేదీ
డిసెంబరు 21, 2001 (2001-12-21)[1]
భాషతెలుగు

కృష్ణ, దాసు అనాథలు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. దాసుకు ఒక దేవి అనే ఒక చెల్లెలు ఉంటుంది. ఆమెను ఇద్దరూ తమ చెల్లెల్లాగే చూసుకుంటూ ఉంటారు. కష్టపడి పైకొచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు. కె. డి అండ్ కో అనే సంస్థ స్థాపించి దానిని అభివృద్ధి లోకి తీసుకుని వస్తారు. కృష్ణకు చిన్నప్పటి నుంచి మీనాక్షి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె తండ్రి దేవుడయ్య. దేవుడయ్యకు కె.డి అండ్ కంపెనీ అన్నా, స్నేహితులన్నా ఈర్ష్య ఉంటుంది.

శత్రు అనే అతను కె.డి కంపెనీలో మేనేజరుగా చేరుతాడు. అతను అక్కడికి రావడానికి ఒక కారణం ఉంటుంది. కాలేజీ రోజల్నుంచీ అతను దేవిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమె తన అన్నలు ఎవరిని చెబితే వారినే పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. వాళ్ళని ఒప్పించడానికి అక్కడ ఉద్యోగంలో చేరతాడు శత్రు. కె.డి అండ్ కంపెనీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాటలు పాడటానికి ఆలస్యంగా వస్తుంది సంగీత అనే గాయని. ఈలోగా ఆ కార్యక్రమం రసాభాస అవుతుంది. దాంతో ఆమెను వాళ్ళు వీధి వీధి తిప్పి పాటలు పాడిస్తారు. ఆమె తనకు ఇంటికి వెళ్ళి అవమానాల పాలై ఆత్మహత్య చేసుకోబోతుంటే దాసు, కృష్ణ తమ ఇంటిలో ఆశ్రయం ఇస్తారు. ఆమె నెమ్మదిగా కృష్ణను అభిమానించడం మొదలుపెడుతుంది.

శత్రు స్నేహితులిద్దరికీ పెళ్ళి చేయడం కోసం అమ్మాయిలను వెతికే పనిలో పడతాడు. ఆ తర్వాత తన పెళ్ళి సులభమవుతుందని అతని ఆశ. కానీ కొన్ని పొరపాట్ల వల్ల దాసు మీనాక్షిని అభిమానించడం మొదలు పెడతాడు. మీనాక్షి, సంగీత కృష్ణను ప్రేమిస్తూ ఉంటారు. దేవుడయ్య ఇదే అదనుగా స్నేహితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడు. తాను ప్రేమిస్తున్న మీనాక్షిని కృష్ణ ప్రేమిస్తున్నాడని దాసును రెచ్చగొడతాడు. చివరికి దాసు నిజం తెలుసుకుని మీనాక్షిని కృష్ణ పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • కోనసీమల్లో ఓ కోయిల, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం. శ్రీనివాస్,చిత్ర
  • ఒక చిన్న లేడి కూన , రచన: చంద్రబోస్, గానం. సురేష్ పీటర్ , శ్రీరామ్ పార్ధసారధి, సుజాత మోహన్
  • గోల్ మాల్ గోల్మాల్ , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. కె ఎస్ చిత్ర, మనో, ఎం. జీ. శ్రీ కుమార్, సుజాత మోహన్
  • ఓ ప్రేమ ప్రేమ , రచన. చంద్రబోస్, గానం. సురేష్ పీటర్
  • ఖుషీ ఖుషీగా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. శంకర్ మహదేవన్, స్వర్ణలత.

మూలాలు

మార్చు
  1. "Telugu Cinema - Preview - Hanuman Junction - Editor Mohan - Jagapati Babu, Venu, Arjun, Laya, Sneha". www.idlebrain.com. Archived from the original on 2016-03-04. Retrieved 2020-05-14.
  2. "'హనుమాన్ జంక్షన్' సినిమా గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియని 14 విషయాలు". Prathidvani. 2023-12-29.

బయటి లంకెలు

మార్చు