హన్నాథియల్ జిల్లా
హన్నాథియల్ జిల్లా, మిజోరాం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఒకటి. 2008, సెప్టెంబరు 12న మొదటిసారిగా హన్నాథియల్ జిల్లాను ప్రకటించారు. 12 సంవత్సరాల తరువాత 2019, జూన్ 3న డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయడంతో జిల్లాగా ఏర్పడింది.[1] దీని ముఖ్య పట్టణం హన్నాథియల్.
హన్నాథియల్ జిల్లా | |
---|---|
మిజోరాం రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
రాష్ట్ర ఏర్పాటు | 2019, జూన్ 3 |
ముఖ్య పట్టణం | హన్నాథియల్ |
Government | |
• లోక్‌సభ నియోజకవర్గం | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
జనాభా | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
చరిత్ర
మార్చు1998 నుండి 2018 వరకు రెండు దశాబ్దాలుగా హన్నాథియల్ జిల్లా ఏర్పాటుకు జిల్లా ఏర్పాటు పోరాట కమిటీ పోరాటం చేసింది. హన్నాథియల్ పట్టణం నుండి ఐజ్‌వాల్ నగరం వరకు ర్యాలీలు, దీక్షలు, ఊరేగింపులు, బంద్ లు, [2] బహిరంగ సమావేశాలు, [3] మెమోరాండాలు, తీర్మానాలు ముఖ్యమంత్రికి సమర్పించారు.[4][5] అంతేకాకుండా 54వ జాతీయ రహదారి దిగ్బంధనం, [6] పత్రికా సమావేశాలు[7], మిజోరాం ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.
2019, జూన్ 3న హన్నాథియల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని మిజోరాం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2019, అక్టోబరు 18న జిల్లా ప్రధాన కార్యాలయంలోని హెచ్‌బిఎస్‌సి గ్రౌండ్ వద్ద ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.[8]
టోపోనిమి
మార్చుజిల్లా ప్రధాన కార్యాలయం హన్నాథియల్ పేరును జిల్లాకు పెట్టారు.
విభాగాలు
మార్చుఈ జిల్లాలో దక్షిణ తుయిపుయి, ఉత్తర లుంగ్లీ, తూర్పు లుంగ్లీ అనే మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్న 27 పట్టణాలు, గ్రామాలలో 5,846 కుటుంబాలు ఉన్నాయి. 28,468 మంది జనాభా ఉన్నారు. ఇందులో 14,208 మంది పురుషులు, 14,260 మంది స్త్ర్రీలు ఉన్నారు. జిల్లా రాజధానిలో 1,548 కుటుంబాలు ఉండగా 7,187 జనాభా ఉన్నారు.[9]
పట్టణాలు, గ్రామాలు
మార్చుహన్నాథియల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలు:
- రావుపుయ్
- పాంగ్జాల్
- థిల్ట్‌లాంగ్
- దక్షిణ చాంగ్టుయ్
- టార్ఫో
- ఖవ్రి
- ఐతుర్
- చెర్లున్
- పాత న్గార్చిప్
- కొత్త న్గార్చిప్
- థింగ్సాయ్
- బువల్పుయి హెచ్
- దక్షిణ లంగ్లెంగ్
- డెన్లుంగ్ (ఉప గ్రామం)
- లైట్ (మౌదర్ ఉప గ్రామంతో)
- రోట్లాంగ్ ఈస్ట్
- తుయిపు 'డి'
- డార్జో
- ముల్లియన్‌పుయి
- లంగ్‌పుట్‌లాంగ్
- దక్షిణ వాన్లైఫాయి
- హన్నాథియల్
- చిప్పిర్
- బువల్పుయి వి
- లుంగ్మావి
- ఫైలేంగ్ సౌత్
రవాణా
మార్చుఇక్కడ పవన్ హన్స్[10] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[11] 54వ జాతీయ రహదారి ద్వారా హన్నాథియల్ పట్టణం, ఐజ్‌వాల్ నగరంతో కలుపబడుతోంది. హన్నాథియల్, ఐజ్‌వాల్ మధ్య 172 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సి క్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.[12]
భౌగోళికం
మార్చుఈ జిల్లాకు ఉత్తరం వైపు సెర్ఛిప్ జిల్లా, దక్షిణం వైపు లవంగ్‌త్లై జిల్లా, ఆగ్నేయం వైపు సైహ జిల్లా, తూర్పు వైపు మయన్మార్ రాష్ట్రం ఉంది. హన్నాథియల్ పట్టణం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది.
మూలాలు
మార్చు- ↑ "HNAHTHIAL DISTRICT CELEBRATES FORMATION". DIPR Mizoram. Retrieved 27 December 2020.
- ↑ "Hnahthial leh Khawzawlah total bandh". Vanglaini Daily Newspaper. Archived from the original on 24 ఫిబ్రవరి 2015. Retrieved 27 December 2020.
- ↑ "Public Meeting". Vanglaini Daily Newspaper. Retrieved 27 December 2020.[permanent dead link]
- ↑ "Hnahthial District not likely". oneindia. Retrieved 27 December 2020.
- ↑ "Hnahthial residents for district status". The Telegraph. Retrieved 27 December 2020.
- ↑ "over 100 hurt in police lathicharge". Times of India. Retrieved 27 December 2020.
- ↑ "Press conference in Aizawl". Vanglaini Daily Newspaper. Retrieved 27 December 2020.[permanent dead link]
- ↑ "HNAHTHIAL DISTRICT CELEBRATES FORMATION". DIPRl. Retrieved 27 December 2020.
- ↑ "District thar 3-ah mi 1,15,424 an awm Saitual district-ah mihring an tam ber". Vanglaini. Archived from the original on 6 ఆగస్టు 2020. Retrieved 27 December 2020.
- ↑ "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 27 డిసెంబరు 2020.
- ↑ "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 September 2015. Retrieved 27 December 2020.
- ↑ "Aizawl to Siaha". Mizoram NIC. Retrieved 27 December 2020.