హరిత కౌర్ డియోల్
ఫ్లైట్ లెఫ్టినెంట్ హరిత కౌర్ డియోల్ (1972 - డిసెంబరు 25 1996) భారతీయ వాయుసేనలో పైలట్. ఆమె వాయుసేనలోని మొట్టమొదటి మహిళా పైలట్. ఆమె తన ఇరవై రెండవ ఏట 1994 సెప్టెంబరు 2 న మొదటిసారిగా Avro HS-748 విమానాన్ని నడిపింది.[1][2][3][4]
కెరీర్
మార్చుఆమె చండీఘర్ లోని ఒక సిక్కు కుటుంబానికి చెందినవారు.[1] 1993 లో ఎయిర్ ఫోర్స్ లో మొదటి ఏడుగురు మహిళా కాడెట్స్‌లో ఒకరిగా, షార్ట్ సర్వీసు కమిషన్ ఆఫీసరుగా ఎంపికైంది. రవాణా పైలట్ గా భారతదేశంలో మహిళా శిక్షణలలో క్లిష్టమైనది.[5] ప్రాథమిక శిక్షణ అనంతరం హైదరాబాదు దగ్గరలో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలోను, యెలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషను వద్ద ఎయిర్ లిఫ్టింగ్ ఫోర్స్ లోనూ శిక్షణ పొందారు.[6]
ఆమె 1996 డిసెంబరు 25 న నెల్లూరు వద్ద విమాన ప్రమాదంలో మరణించారు.[5] ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గల బుక్కపురం గ్రామం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఆమెతో పాటు 24 మంది ఎయిర్ ఫోర్స్ కు చెందిన వ్యక్తులు మరణించారు.[7][8]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "All time inspirational women personalities of India". India TV. 8 March 2013.
- ↑ Shobana Nelasco (2010). Status of Women in India. Deep & Deep Publications. pp. 13–. ISBN 978-81-8450-246-6.
- ↑ Year Book 2009. Bright Publications. p. 559.
- ↑ Documentation on Women, Children, and Human Rights. Sandarbhini, Library and Documentation Centre, All India Association for Christian Higher Education. 1994. p. 2.
- ↑ 5.0 5.1 Limca Book of Records. Bisleri Beverages Limited. 2003.
- ↑ Soma Basu (September 4, 1994). "IAF flies into a new era". SikhWomen.com. Retrieved 2014-02-13.
- ↑ India: A Reference Annual. Publications Division, Ministry of Information and Broadcasting. 1998. p. 686.
- ↑ "Woman IAF flying cadet killed in trainer crash - Indian Express". May 13, 2008. Retrieved 2014-02-13.