హరిశ్చెంద్రుడు (1981 సినిమా)

ఈ సినిమా భారతదేశంలో రాజకీయ చిత్రాల నిర్మాణానికి నాంది పలికింది. దీనికి 1981వ సంవత్సరం, ఏప్రిల్ 23వ తారీఖున ఢిల్లీలో జరిగిన 28వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో నేటి రాజకీయనాయకుల కపట ప్రవర్తన, వాళ్ల దుష్టచర్యలను బహిర్గతం చేసినందుకు ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపిక అయి రజతకమలాన్ని గెలుచుకుంది.

హరిశ్చెంద్రుడు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం యు.విశ్వేశ్వర రావు
నిర్మాణం యు.డి.మురళీకృష్ణ
కథ యు.విశ్వేశ్వరరావు
చిత్రానువాదం యు.విశ్వేశ్వరరావు
తారాగణం ప్రభాకరరెడ్డి,
జయచిత్ర,
సావిత్రి,
శివపార్వతి,
ఎన్.వి.ప్రసాదరావు
ఛాయాగ్రహణం మోహనకృష్ణ
కూర్పు ఆర్.హనుమంతరావు
నిర్మాణ సంస్థ విశ్వశాంతి మూవీస్
అవార్డులు జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రం
భాష తెలుగు

ఇతివృత్తం మార్చు

హరిప్రసాదరావు స్వార్థపరులకు, నీతిబాహ్యులైన రాజకీయవేత్తలకు ప్రతీక. రాజకీయ చదరంగంలో ఎదుటివారిని చిత్తుచేసి తన స్వార్థాన్ని చూసుకోవడంలో అందె వేసిన చెయ్యి అతనిది. తన ప్రయోజనం కోసం అతడు చేయని అక్రమం లేదు. అతనికి వరుసకు బావమరిది అయిన హరిశ్చెంద్రుడు సత్యం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి. హరిశ్చెంద్రుని కొడుకుకు, హరిప్రసాదరావు కూతురుకు వివాహం చేయడానికి నిశ్చితార్థం జరుగుతుంది. కుమార్తె పెళ్ళి చూసుకోవడానికి వీలు లేకుండా హరిప్రసాదరావు భార్య మరణిస్తుంది. చివరిక్షణంలో తన కూతురును జాగ్రత్తగా చూసుకోమని ఆ యింటిలో పనిచేసే మాణిక్యం చేతిలో పెడుతుంది. వయసులో ఉన్న మాణిక్యంపై కన్నువేసిన హరిప్రసాదరావు ఆమెను బలాత్కరించి లోబరుచుకుంటాడు. ఈ సంగతి తెలిసిన మాణిక్యం భర్త హరిప్రసాదరావును మట్టుపెట్టబోతే, అతడినే హరిప్రసాదరావు చంపి దానికి ఆత్మహత్య రంగు పులిమి నేరం నుండి తప్పించుకుంటాడు. అయినా నిజం తెలిసిన ప్రజలంతా హరిప్రసాదరావును యేవగించుకుంటారు. ఫలితంగా ఎన్నికలలో ఓడిపోతాడు. ఎన్నికలలో వెదజల్లిన డబ్బంతా వృధా కావడంతో బెంగతో మంచం పడతాడు హరిప్రసాదరావు. బాకీదార్లు ఇంటి నుండి తరిమివేస్తే చివరకు మాణిక్యమే అతనికి దిక్కవుతుంది[1].

నటీనటులు మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు[2]:

  1. ఉత్తది ఉత్తది అత్తయ్య అంతా ఉత్తది - ఎస్.పి.శైలజ, విజయలక్ష్మి శర్మ- రచన: కొండవీటి వెంకటకవి
  2. ఏమని చెప్పేది గురుడు నేనేమని గురుడా- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: శ్రీశ్రీ
  3. నే చేసినదే చట్టమని నేను - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: యు. విశ్వేశ్వర రావు,శ్రీశ్రీ
  4. పండులకు చూస్తారు కాని చుక్కలకు చూస్తారు - టి.ఆర్.జయదేవ్ - రచన: యు. విశ్వేశ్వర రావు
  5. పచ్చి తాకుటాపై మా తల్లి - కమల చంద్రబాబు,విజయలక్ష్మి శర్మ, పి.లీల - రచన: కొండవీటి కవి
  6. మాయామేయ జగంబు నిశ్చమని ( పద్యం ) - వి.రామకృష్ణ - రచన: యు. విశ్వేశ్వర రావు
  7. ముద్దు మొగడా నా ముద్దుల మొగుడా - జయచిత్ర - రచన: యు. విశ్వేశ్వర రావు

మూలాలు మార్చు

  1. గాంధి (11 June 1981). "చిత్ర సమీక్ష: హరిశ్చెంద్రుడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68 సంచిక 69. Retrieved 12 February 2018.[permanent dead link]
  2. కొల్లూరి భాస్కరరావు. "హరిశ్చంద్రుడు - 1981". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 14 ఏప్రిల్ 2020. Retrieved 14 April 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు మార్చు