హలీం ఖాన్
హలీం ఖాన్ భారతీయ కూచిపూడి నృత్యకారుడు, ప్రదర్శకుడు, సినిమా నటుడు. స్త్రీ పాత్రలు ధరిస్తూ కూచిపూడి నృత్యం చేసే పురుష నాట్యకారునిగా ప్రాచుర్యం పొందాడు. దేశ విదేశాల్లో కూచిపూడి నాట్య కార్యశాలలు నిర్వహించాడు. చలనచిత్ర రంగంలోనూ నటిస్తున్నాడు.
జీవిత విశేషాలు
మార్చుఆయన ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో ఏప్రిల్ 10న జన్మించాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నివసిస్తున్నాడు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా 800కు పైగా ప్రదర్శనలిచ్చాడు. అంతే కాకుండా దేశ విదేశాలలో కూచిపూడి నాట్య కార్యశాలలను నిర్వహించాడు. ఆయన కూచిపూడి నృత్యంలో గల రూపానురూపం (మహిళా ప్రతిరూపం) లో ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ఆయన భామాకలాపం, అన్నమాచార్య కీర్తనలలో ఆయన అభినయానికి ప్రసిద్ధి పొందాడు. చిన్న పట్టణంలో ఆయన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించి తన కుటుంబానికి కూచిపూడి నాట్య నేపథ్యం లేనందువల్ల ఈ నాట్యం నేర్చుకోవడానికి అనేక యిబ్బందులు పడ్డాడు.
ప్రారంభంలో హలీం యొక్క రంగస్థల నానం హరి. అతని నృత్యం, ప్రత్యేకంగా మహిళల రూపంలో నటన, అతనికి విమర్శకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టింది. అతనికి అనేక అవార్డులు, సత్కారాలను గెలుచుకునేందుకు దోహదపడింది. కళను కాపాడుకోవడంకోసం హాలిమ్ ఎంతో ఉద్వేగభరితమైనది, ఇంటరాక్టివ్ కూచిపూడి డ్యాన్స్ సూచనల వీడియోలో నటనా ప్రదర్శనలనిస్తున్నాడు.
తన చిన్ననాటి రోజుల నుండి, కూచిపూడి సాంప్రదాయ నృత్యరీతులు అతన్ని ఆకర్షించాయి, చలనచిత్రాలు ప్రధానంగా ప్రేరణ కలిగించాయి. ఎదుర్కోవాల్సిన అడ్డంకులను అతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా కాలం ముందు, అతను కూచిపూడి నాట్యం నేర్చుకోవటానికి లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ఆయన ప్రముఖ నృత్యకారుడైన కాజా వెంకట సుబ్రహ్మణ్యం వద్ద శిష్యరికం చేసి ఆయన శిక్షణలో కూచిపూడి నృత్యరీతులను అభ్యసించాడు. నృత్యంపై అభిరుచి, నృత్యరీతుల ఆవిష్కరణ, శ్రేష్ఠత ఆయనకు అమూల్యమైనవి. ఆయన ప్రదర్శించిన అనేక ప్రదర్శనలలో నూతన రీతులను ఆవిష్కరించారు. అతను కూచిపూడి నృత్యాన్ని కవిత్వ, సంగీతాలతో (ఆంగ్లం, ఉర్దూ రెండింటిలో) అనుసంధానించాడు. అతను శివ తాండవం చేసినపుడు ఆవేశంగా ఉన్న శివుని దర్శింపజేస్తాడు. తన జావళి ద్వారా తన మనిషిని ప్రేమించే ఒక మహిళ హృదయంలోనికి ప్రేక్షకులను తీసుకుపోగలడు.
అతను సహజంగా నటిస్తున్న కళాకారునిగా చలన చిత్రాలలో విజయవంతంగా నటించాడు. తన కళాత్మక స్వభావం యొక్క మనస్తత్వంతో అతను ప్రాచీన నృత్యరీతులను రక్షించడానికి అనేక విధాలుగా కృషిచేస్తున్నాడు. ఇలా కళలను రక్షించడం అనేది అతని అంతర్లీన కోరిక. దీనిని సాకారం చేసుకొనేందుకు నృత్య సూచనలతో డి.వి.డిని చిత్రీకరించాడు.
మహిళా నృత్యకారిణిలు వేదికపైకి రాని సందర్భాలలో మహిళా ప్రతిరూపాలను జనాదరణ పొందించడానికి, ప్రాచీన సాంప్రదాయ నృత్యాలను ప్రచారం చేయడానికి కొన్ని పాత్రలను స్వయంగా స్వీకరించారు.
ప్రేక్షకుల మంత్రముగ్దులను చేస్తూ మహిళా పాత్రలను ధరించే కొద్దిమంది మగ నృత్యకారులలో అతను ఒకడు. అతని అభ్యాసం మగ నృత్యకారుడిగా శతాబ్దాల నాటి నృత్య రూపాన్ని సంరక్షించడానికి, ప్రచారం చేయడానికి తనకున్న అభిరుచికి సరిపోయింది. ఆయన తెలుగు చలన చిత్ర సీమలో నువ్విలా చిత్రం ద్వారా అరంగేట్రం చేసాడు.
సినిమాలు
మార్చుఖాన్ 2011 నుండి తెలుగు చలన చిత్రాలలో నటిస్తున్నాడు. అవి:
- నువ్విలా
- ఏక్షన్ 3D
- సరదాగా అమ్మాయితో
- ప్రేమా గీమా జాన్తా నై
- అడవి కాచిన వెన్నెల
- నువ్వు నేను ఒకటవుదాం
- శ్రీనిలయం
- ఆనె అటాడితే
- శివ నాగ
మూలాలు
మార్చు- Khaleejtimes.com
- Newindianexpress.com Archived 2016-03-07 at the Wayback Machine
- Thehindu.com
- Indiaglitz.com Archived 2015-09-24 at the Wayback Machine
- Tribuneindia.com
- Times of India
- [1]
- [2]
- [3][permanent dead link]
- [4] Archived 2015-11-25 at the Wayback Machine