హాత్‌రస్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హాత్‌రస్ జిల్లా ఒకటి. మొదట దీనికి బుద్ధుని తల్లి మాయాదేవి పేరిట మాయాదేవి జిల్లా అని అన్నారు.[1] హాత్‌రస్ పట్టణం ఈ జిల్లా కేంద్రం. జిల్లావైశాల్యం 1800 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,565,678.

హాత్‌రస్ జిల్లా

महामायानगर ज़िला
مہامایا نگر ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో హాత్‌రస్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో హాత్‌రస్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఅలీగఢ్
ముఖ్య పట్టణంహాత్‌రస్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుహాత్‌రస్
విస్తీర్ణం
 • మొత్తం1,840 km2 (710 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం15,65,678
 • సాంద్రత850/km2 (2,200/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.1 per cent
 • లింగ నిష్పత్తి870
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

1997 మే 3 న అలీగఢ్, మథుర, లఖింపూర్ ఖేరి, ఆగ్రా జిల్లాల్లోని కొంత భాగాన్ని విడదీసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. గౌతమబుద్ధుని తల్లి పేరు మాయాదేవి మీదుగా జిల్లా పేరును నిర్ణయించారు.[2] 2012లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు ప్రస్తుతమున్న పేరు పెట్టారు.

విభాగాలుసవరించు

  • జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి:
  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి: హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి.
  • జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి: హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి, ముర్సన్, సెహ్‌పౌ, హసయన్.
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు: హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి
  • పార్లమెంటు నియోజకవర్గం: హాత్‌రస్,

అక్బర్‌పురిసవరించు

జిల్లాలోని సంసి- నానౌ రోడ్డు పక్కన ఉన్న అక్బర్‌ పురి గ్రామం, శేఖర్ పురి గ్రామాలు వేరైనా రెవెన్యూ శాఖ రెండింటినీ ఒకటిగా భావిస్తుంది. 1991 గణాంకాల ప్రకారం ఈ గ్రామ జనసంఖ్య 2000 మంది. గ్రామంలో హినుదువులు, ముస్లిములు నివసిస్తున్నారు. హిందువులలో బ్రాహ్మణులు, జాట్, జాతవ్ (చామర్), ఖతిక్, హరిజనులు, తెలీ ప్రజలు నివసిస్తున్నారు. వీరి సాంఘిక స్థితి జాతీయసరాసరికి దగ్గరగా ఉంటుంది.

  • బిహారె చందన్‌సింగ్ మందిర్ పాఠశాల. ప్రాథమిక నుండి 8 వ తరగతి వరకు
  • అకాడమీ ఆఫ్ ఎజ్యుకేషన్: 9-12 తరగతులు

[3]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,565,678,[4]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 318వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 815 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.19%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 870 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 73.1%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ప్రయాణ సౌకర్యాలుసవరించు

జిల్లాలో 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి: హాత్‌రస్ రైల్వే జంక్షన్, హాత్‌రస్ రోడ్ రైల్వే స్టేషను, హాత్‌రస్ సిటీ రైల్వే స్టేషను, హాత్‌రస్ ఖిలా రైల్వే స్టేషను ఉన్నాయి. పలు రైల్ వసతులు ఉన్నా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రైలు వసతి కొరవ సమస్య ఉంది.

మూలాలుసవరించు

  1. "Important Cabinet Decisions". Information and Public Relations Department. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 17 January 2013.
  2. Bhushan, Ranjit (2 July 1997). "The Ambedkar Armada". Outlook. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 24 February 2012.
  3. "Villages of Sasni Sub District(MAHAMAYA NAGAR-UTTAR PRADESH )". Local Government Directory. Ministry of Panchayati Raj. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 28 August 2013.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665