హిడింబ (2023 సినిమా)

హిడింబ 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించాడు. అశ్విన్‌ బాబు, నందితాశ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను మే 26న విడుదల చేసి[1], సినిమాను జులై 20న విడుదల చేశారు.[2][3]

హిడింబ
దర్శకత్వంఅనిల్‌ కన్నెగంటి
స్క్రీన్ ప్లే
మాటలుకల్యాణ చక్రవర్తి
నిర్మాత
  • గంగపట్నం శ్రీధర్‌


తారాగణం
ఛాయాగ్రహణంబి.రాజశేఖర్‌
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంవికాస్‌ బడిసా
నిర్మాణ
సంస్థ
శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌
విడుదల తేదీ
20 జూలై 2023 (2023-07-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
  • మెమోరీస్, రచన: విరించి పుట్ల, గానం. యశస్వి కొండేపూడి, యాజిన్ నిజార్,వికాస్ బడిశ
  • ఐయాం ది బ్యాడ్ గై, రచన: ప్రణవం , గానం.లవిత లోబో , వికాస్ బడిశ
  • థీమ్ మ్యూజిక్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.బి.సుబ్బరాయ శర్మ.

హైదరాబాద్‌లో వరుసగా కిడ్నాప్‌కి గురైన అమ్మాయిల కేసును పోలీస్‌ ఆఫీసర్‌ అభయ్ (అశ్విన్‌) విచారిస్తుంటాడు. అభయ్ కేసును విచారిస్తున్నా కిడ్నాప్‌ చేస్తున్న వ్యక్తిని పట్టుకోకపోవడంతో ప్రభుత్వమే ఓ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ ఆద్య (నందితా శ్వేతా)ను నియమిస్తుంది. ఇద్దరూ కలిసి ఈ సీరియల్ కిడ్నాపుల కేసు పై దృష్టిపెట్టి క్రిమినల్ బోయాను అనుమానంతో పట్టుకుంటారు, కానీ కిడ్నాప్ చేసిన అతడికి అమ్మాయిలకు కేసుకు సంబంధం లేదని పోలీసుల పరిశోధనలో తేలుతుంది. ఈ కిడ్నాప్‌లు అండమాన్‌ దీవుల్లోని ఓ గిరిజన తెగ చేస్తుందని తెలుసుకుంటారు? ఈ కేసును అభయ్, ఆద్యలు ఎలా విచారించారు? చివరికి కిడ్నాప్‌కు గురైన అమ్మాయిలను వీరిద్దరూ ఎలా రక్షించారు? అనేదే మిగతా సినిమా కథ.[6]

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌
  • నిర్మాత: గంగపట్నం శ్రీధర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే:
  • దర్శకత్వం: అనిల్‌ కన్నెగంటి[7]
  • సంగీతం: వికాస్‌ బడిసా
  • సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌
  • మాటలు: కల్యాణ చక్రవర్తి
  • ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
  • ఆర్ట్ : షర్మిల ఎలిశెట్టి
  • పాటలు : రామజోగయ్య శాస్త్రి, బి. సుబ్బరాయ శర్మ, విరించి పుట్ల, ప్రణవం
  • ఫైట్స్ : రియల్ సతీష్, జాషువా, అనీల్ కన్నెగంటి

మూలాలు

మార్చు
  1. Sakshi (27 May 2023). "'హిడింబ' ట్రైలర్‌ అదిరిపోయింది". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  2. Andhra Jyothy (11 July 2023). "హిడింబకి విముక్తి లభించింది". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  3. Eenadu (10 August 2023). "ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  4. Namasthe Telangana (16 July 2023). "'హిడింబ'తో స్టార్‌డమ్‌ వస్తుంది!". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  5. Andhra Jyothy (16 July 2023). "సినిమా చూస్తే తెలుస్తుంది". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  6. Eenadu (20 July 2023). "రివ్యూ: హిడింబ.. అశ్విన్‌, నందితా శ్వేతల సినిమా ఎలా ఉంది?". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  7. Andhra Jyothy (19 July 2023). "సినిమా చూడనివాళ్లకు చెప్పొద్దు". Archived from the original on 19 July 2023. Retrieved 19 July 2023.