హిప్పీ
హిప్పీ IMG 20190624 191011.jpg
హిప్పీ సినిమా పోస్టరు
దర్శకత్వంటి. యస్. కృష్ణ
నిర్మాతకలైపులి ఎస్. థాను
రచనటి. యస్. కృష్ణ
నటులుకార్తికేయ, దిగంగనా సూర్యవంశి
ఛాయాగ్రహణంబృంద, శోభి, ఆర్ట్
కూర్పుకె.ఎల్ ప్రవీణ్
విడుదల
జూన్ 7 2019
నిడివి
నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణంసవరించు

కథసవరించు

హిప్పీ దేవదాస్‌ (కార్తికేయ) ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేసి మార్షల్‌ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహ (జజ్బా సింగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. స్నేహతో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫ్రెండ్‌ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి తొలి చూపులోనే మళ్లీ ప్రేమలో పడతాడు. స్నేహను కాదని ఆముక్తమాల్యద చుట్టూ తిరుగుతుంటాడు. హిప్పీకి ఇన్నాళ్లు తన మీద ఉన్నది ప్రేమ కాదు ఎట్రాక్షన్ అని అర్థం చేసుకున్న స్నేహ, వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. తరువాత హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతారు.కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలువుతుంది. ఆముక్తమాల్యద తన ఆంక్షలతో హిప్పీకి నరకం చూపిస్తుంది. చెప్పినట్టు వినాలని, చెప్పిన టైంకి రావాలని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎలాగైనా ఆముక్తమాల్యదను వదిలించు కోవాలనుకుంటాడు హిప్పీ. అందుకోసం హిప్పీ ఏం చేశాడు?చివరకు హిప్పీ, ఆముక్తమాల్యదలు కలిసున్నారా విడిపోయారా? అన్నదే మిగతా కథ.[1]

మూలాలుసవరించు

  1. "'హిప్పీ' మూవీ రివ్యూ". Sakshi. 2019-06-06. Retrieved 2020-02-26.