కార్తికేయ గుమ్మకొండ

తెలుగు సినీ నటుడు

కార్తికేయ గుమ్మకొండ, దక్షిణాది చిత్రాలతో పేరొందిన నటుడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్‌ఎక్స్‌ 100 తో తన మొదటి విజయం సాధించడమే కాక తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. హీరో నాని నటించిన నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా నటించడమే కాక, గుణ 369,  90ఎంఎల్  చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాలు సాధించాడు.

కార్తికేయ గుమ్మకొండ
2019 లో కార్తికేయ
జననం
కార్తికేయ గుమ్మకొండ

1992
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2017–ఇప్పటివరకు
తల్లిదండ్రులువిట్టల్ రెడ్డి

జీవితం - విద్యార్హత

మార్చు

కార్తికేయ తండ్రి గుమ్మకొండ విట్టల్ రెడ్డి నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత, తల్లి గుమ్మకొండ రజనీ విద్యావేత్త. రంగా రెడ్డి జిల్లా హైదరాబాద్, వనస్థలిపురంలో నాగార్జున పాఠశాలలో విద్యను పూర్తి చేసి విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో తన ఇంటర్మీడియేట్ విద్యను కొనసాగించాడు. వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే తాను నటుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.[1]

సినీ జీవితం

మార్చు

లఘు చిత్రాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ లో నిర్మించిన  "ప్రేమతో మీ కార్తీక్" చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. కానీ ఆ తరువాత అదే బ్యానర్  పై అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం భారీ విజయాన్ని సాధించి అతని ప్రతిభని అందరికీ తెలిసేలా చేసింది. అలా ఆ తరువాత 2019 లో హిప్పీ, గుణ 369, నాని గ్యాంగ్ లీడర్, 90ఎంఎల్ చిత్రాలలో నటించాడు. అటు హీరోగా క్రేజ్ సంపాదిస్తూనే ఇటు మంచి నటుడిగా తన ప్రతిభని చూపించాలని  హీరో నాని తో గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి డార్క్ కామెడీ కథతో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన “చావు కబురు చల్లగా” లో నటించాడు.

అవార్డ్స్

మార్చు

కార్తికేయ గుమ్మకొండ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రకుగాను ఆయన 2019 సైమా అవార్డు - ఉత్తమ విలన్ అవార్డును అందుకున్నాడు.[2]

 
ఉత్తమ విలన్ గా (గ్యాంగ్ లీడర్) సినిమాకు గాను అవార్డు అందుకుంటూ

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు గమనికలు మూ
2017 ప్రేమతో మీ కార్తీక్ కార్తీక్ రిషి రిషి [3]
2018 ఆర్‌ఎక్స్‌ 100[4] శివుడు అజయ్ భూపతి అజయ్ భూపతి
2019 హిప్పీ దేవదాస్ నడింపల్లి (హిప్పీ) టి. యస్. కృష్ణ టి. యస్. కృష్ణ
గుణ 369 గుణ అర్జున్ జంధ్యాల అర్జున్ జంధ్యాల
నాని గ్యాంగ్ లీడర్ దేవ్ విక్రమ్. కె. కుమార్ విక్రమ్. కె. కుమార్ [5]
90ఎంఎల్ [6] దేవ దాస్ శేఖర్ రెడ్డి ఎర్రా [7]
2021 చావు కబురు చల్లగా బస్తీ బాలరాజు కౌశిక్ పెగాళ్ళపాటి [8]
రాజా విక్రమార్క[9] రాజా విక్రమార్క శ్రీ సరపల్లి [10]
2022 వలిమై నరేన్ / వోల్ఫ్రాంగా హెచ్. వినోద్ తమిళ అరంగేట్రం
2023 బెదురులంక 2012 శివశంకర వర ప్రసాద్ క్లాక్స్
2024 భజే వాయు వేగం తెలుగు

టెలివిజన్

మార్చు
సంవత్సరం సిరీస్ / షో పాత్ర నెట్‌వర్క్ గమనికలు మూ
2020 బిగ్ బాస్ S4 అతిథి / ప్రదర్శకుడు (నృత్యం) స్టార్ మా ఎపిసోడ్ 49 [11]

అవార్డులు & నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం
2018 జీ సినీ అవార్డ్స్ తెలుగు సంవత్సరపు ఉత్తమ అన్వేషణ - పురుషుడు ఆర్‌ఎక్స్‌ 100 గెలుపు
2019 17వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటుడు గెలుపు[12]
2021 9వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ ప్రతినాయకుడు నాని గ్యాంగ్ లీడర్ గెలుపు

మూలాలు

మార్చు
  1. "Kartikeya Gummakonda (RX100) Age, Height, Father, Girlfriend, Family, Biography". Fabpromocodes (in ఇంగ్లీష్). Retrieved 2019-12-11.
  2. TV9 Telugu (19 September 2021). "SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట." Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Kartikeya Gummakonda reminisces his time before foraying into films". The Times of India. 8 August 2018. Retrieved 8 August 2018.
  4. "'RX 100' release date announced - Telugu News". IndiaGlitz.com. 2018-07-02. Retrieved 2019-12-11.
  5. "'RX 100' fame Kartikeya excited about his role in Nani – Vikram Kumar's film". The Times of India. 19 February 2019. Retrieved 2020-05-05.
  6. సాక్షి, సినిమా (11 December 2019). "ఈ సినిమాతో క్లారిటీ వచ్చింది – కార్తికేయ". Sakshi. Archived from the original on 11 December 2019. Retrieved 11 December 2019.
  7. Kumar, AuthorP Nagendra. "90 ML fulfilled my dream of being a commercial hero". Telangana Today.
  8. "Chaavu Kaburu Challaga First Look: 'RX 100' fame Kartikeya turns into Basthi Balaraju". The Times of India. 13 February 2020. Retrieved 2022-07-05.
  9. "Raja Vikramarka Teaser: Kartikeya as NIA Officer". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-04. Retrieved 2021-09-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Actor Kartikeya shares picture ahead of shooting 'Raja Vikramarka'". Telangana Today. 2021-07-04.
  11. "బిగ్‌బాస్ వేదికపై కార్తికేయ ఫెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా.. సినీ వర్గాల ప్రశంసలు". https://filmibeat. Retrieved 2020-10-27.
  12. Telugu, TV9 (2019-09-30). "అంగరంగ వైభవంగా సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 వేడుక 17th Santosham Awards Event Photos". TV9 Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]