హిల్ ఫోర్ట్ ప్యాలెస్
హిల్ ఫోర్ట్ ప్యాలెస్ (రిట్జ్ హోటల్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నౌబత్ పహాడ్ లో ఉన్న ప్యాలెస్. 1915లో నిర్మాణమైన ఈ ప్యాలెస్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉంది.[1][2][3]గతంలో ఇక్కడ సినిమా షూటింగ్ లు కూడా జరిగేవి. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
హిల్ ఫోర్ట్ ప్యాలెస్ | |
---|---|
పూర్వపు నామం | రిట్జ్ హోటల్ (1980-1997) |
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
ప్రదేశం | నౌబత్ పహాడ్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
పూర్తి చేయబడినది | 1915 |
యజమాని | తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ |
Native names English: Hill Fort Palace Urdu: ھل فورٹ محل | |
నిర్మాణం దేని కొరకు | నిజామత్ జంగ్ |
వాస్తవ ఉపయోగం | నిజామత్ జంగ్ నివాసం (1915-1929) ప్రిన్స్ మోజాం జాహ్ నివాసం (1929-1955) రిట్జ్ హోటల్ (1980-1997) |
చరిత్ర
మార్చునిజాం ప్రభుత్వంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నవాబ్ సర్ నిజామాత్ జంగ్ చే 1915లో ఈ ప్యాలెస్ నిర్మించబడింది. ఆ ప్యాలెస్ లో ఆయన 15 సంవత్సరాలు జీవించాడు. కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాల శైలిలో దీనిని నిర్మించారు.[4][3]
1929లో నిజామాత్ జంగ్ హజ్ వెళ్ళిన తరువాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (ఏడవ అసఫ్ జా) తన కుమారుడైన ప్రిన్స్ మోజాం జాహ్ కోసం దీనిని కొనుగోలు చేశాడు. ఆ తరువాత నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ అధికారిక నివాసంగా మార్చబడింది.
1955లో ఆపరేషన్ పోలో తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని, 1980లో స్టార్ హోటల్ నడపడంకోసం ది రిట్జ్ హోటల్ కంపెనీకి లీజుకు ఇచ్చింది. 1997 వరకు హోటల్ గా ఉంది.[5][6]
ప్రదేశం
మార్చునగరం నడిబొడ్డున గల నౌబత్ పహాడ్ సమీపంలో 6 ఎకరాల్లో ఈ ప్యాలెస్ ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Hill Fort Palace to regain past glory". Times of India. 5 April 2014. Retrieved 16 November 2018.
- ↑ Hill Fort Palace : MIT Libraries
- ↑ 3.0 3.1 The space has a story to tell - The Hindu
- ↑ PHOTOS: Hyderabad's 100-Year-Old Hill Fort Palace Is Now A Prospective Art Gallery
- ↑ Once famous Ritz Hotel of Hyderabad now turns into a shooting location for films- The New Indian Express
- ↑ "A walter scott castle, sliver of Nizami times". The New Indian Express. Retrieved 16 November 2018.